
సాక్షి, హైదరాబాద్: వచ్చే నెలలో చండీగఢ్‌లో జరిగే జాతీయ సబ్ జూనియర్ రోలర్ హాకీ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే తెలంగాణ బాలబాలికల జట్లలో హైదరాబాద్‌కు చెందిన అన్నా చెల్లెళ్లు మొహమ్మద్ సుమేర్, మనాల్ సుల్తానా ఎంపికయ్యారు. ఉస్మానియా యూనివర్సిటీ మైదానంలో జరిగిన రాష్ట్ర స్థాయి రోలర్ హాకీ టోర్నీలో వీరిద్దరూ సత్తా చాటారు.
గోల్నాకలోని సెయింట్ పాల్స్ గ్రామర్ స్కూల్‌లో చదువుకుంటున్న వీరిద్దరూ జాతీయ పోటీల్లో పాల్గొనడం వరుసగా ఇది రెండో ఏడాది. చాదర్‌ఘాట్‌లోని విక్టరీ ప్లే గ్రౌండ్ (వీపీజీ)లో కోచ్ అబుద్ ఖురేషీ వద్ద వీరిద్దరూ శిక్షణ పొందుతున్నారు.
చదవండి: IND vs NZ Test Series: కివీస్‌తో టెస్టు... సూర్యకుమార్ వద్దు.. శ్రేయస్‌కు చోటు!
Comments
Please login to add a commentAdd a comment