golnaka
-
బీఆర్ఎస్లో విభేదాలు.. బయటపడ్డ ఎమ్మెల్యే, కార్పొరేటర్ మధ్య వార్
సాక్షి, హైదరాబాద్: అంబర్‌పేట అధికార బీఆర్ఎస్ పార్టీలో విభేదాలు తారాస్థాయికి చేరాయి. స్థానిక ఎమ్మెల్యే, కార్పొరేటర్ మధ్య వివాదం మరింత ముదిరింది. మంగళవారం మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకల్లో అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్‌కు, గోల్నాక కార్పొరేటర్ దూసరి లావణ్య, ఆమె భర్త శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. ఈ క్రమంలో పూలే విగ్రహానికి పూలమాల వేసే సమయంలో ఎమ్మెల్యే, కార్పొరేటర్ మధ్య వ్యాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో ఇరు వర్గాల కార్యకర్తలు, అనుచరులు రోడ్డు మీదనే ఘర్షణకు దిగారు. అయితే కార్పొరేటర్ లావణ్య భర్త శ్రీనివాస్‌పై ఎమ్మెల్యే వెంకటేష్ చేయి చేసుకున్నారని ఆమె వర్గం ఆరోపిస్తుంది. మహాత్మాజ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాల వేసే సమయంలో ఎమ్మెల్యే తనను నెట్టుకుంటూ వెళ్లాడని కార్పొరేటర్ లావణ్య భర్త శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. అంతేగాక గత కొంత కాలం నుంచి నియోజకవర్గం అభివృద్ధి పనుల్లో తనను ఆహ్వానించడం లేదని కార్పొరేటర్ ఆవేదన వ్యక్తం చేశారు. తమ డివిజన్లో జరిగిన ఆత్మీయ సమ్మేళన సభలో కూడా తమను అవమానించేలా ఎమ్మెల్యే వ్యవహరించారని అన్నారు. -
Roller Hockey Championship: హైదరాబాద్ అన్నాచెల్లెళ్లు సూపర్!
సాక్షి, హైదరాబాద్: వచ్చే నెలలో చండీగఢ్‌లో జరిగే జాతీయ సబ్ జూనియర్ రోలర్ హాకీ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే తెలంగాణ బాలబాలికల జట్లలో హైదరాబాద్‌కు చెందిన అన్నా చెల్లెళ్లు మొహమ్మద్ సుమేర్, మనాల్ సుల్తానా ఎంపికయ్యారు. ఉస్మానియా యూనివర్సిటీ మైదానంలో జరిగిన రాష్ట్ర స్థాయి రోలర్ హాకీ టోర్నీలో వీరిద్దరూ సత్తా చాటారు. గోల్నాకలోని సెయింట్ పాల్స్ గ్రామర్ స్కూల్లో చదువుకుంటున్న వీరిద్దరూ జాతీయ పోటీల్లో పాల్గొనడం వరుసగా ఇది రెండో ఏడాది. చాదర్‌ఘాట్‌లోని విక్టరీ ప్లే గ్రౌండ్ (వీపీజీ)లో కోచ్ అబుద్ ఖురేషీ వద్ద వీరిద్దరూ శిక్షణ పొందుతున్నారు. చదవండి: IND vs NZ Test Series: కివీస్‌తో టెస్టు... సూర్యకుమార్ వద్దు.. శ్రేయస్‌కు చోటు! -
గోల్నాకలో భారీ అగ్నిప్రమాదం
-
Hyderabad: గోల్నాకలో భారీ అగ్నిప్రమాదం
హైదరాబాద్: గోల్నాకలో గురువారం అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. పేపర్ గోడౌన్లో మంటలు చెలరేగాయి. దీంతో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. స్థానికులు వెంటనే ఫైర్‌సిబ్బందికి సమాచారం అందించారు. అధికారులు, సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఫైరింజన్ సహయంతో మంటలను అదుపు చేస్తున్నారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
హైదరాబాద్ గోల్నాకలో దారుణం
-
తండ్రీకొడుకులను రక్షించబోయి యువకుడి మృతి
హైదరాబాద్ : నగరంలోని పాతబస్తీలో బుధవారం విషాదం సంభవించింది. తండ్రీకొడుకులను కాపాడేందుకు యత్నించిన ఓ యువకుడు అనూహ్యంగా మృతి చెందిన ఘటన గోల్నాకలో చోటుచేసుకుంది. గోల్నాకకు చెందిన అంజాద్ అనే యువకుడు ప్రమాదవశాత్తు స్థానికంగా ఉన్న ఓ బావిలో పడిపోయాడు. యువకుడ్ని కాపాడేందుకు అతని తండ్రి బావిలోకి దూకాడు. ఈ క్రమంలో వారిద్దరిని రక్షించేందుకు అజ్గర్ అనే మరో యువకుడు కూడా బావిలోకి దూకాడు. సమాచారం అందుకున్న పోలీసులు, రెవెన్యూ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని వారిని కాపాడేందుకు తీవ్రంగా యత్నిస్తున్నారు. ఈ ప్రమాదంలో తండ్రీకొడుకులను కాపాడేందుకు యత్నించిన అజ్గర్ మృతి చెందాడు. దీంతో స్థానికంగా విషాదం చోటుచేసుకుంది. మిగతా ఇద్దరిని రక్షించేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
మృతి చెందాడనుకున్న వ్యక్తి ప్రత్యక్షం
గన్ ఫౌండ్రి(హైదరాబాద్): ఆ ఇంటి పెద్ద చనిపోయాడు. కుటుంబమంతా విషాదంలో మునిగిపోయింది. మృతదేహానికి అంత్యక్రియలు సైతం నిర్వహించారు. తెల్లారితే దశదిన కర్మ చేసేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. ఇంతలో చనిపోయాడకున్న వ్యక్తి అనూహ్యంగా బతికొచ్చాడు. సినిమా కథను తలపిస్తున్నా ఈ సంఘటన శనివారం గోల్నాక ప్రాంతంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. అంబర్పేట్ గోల్నాక హనుమాన్ నగర్‌కు చెందిన అంజయ్య (50) మలక్‌పేట్‌లోని చాందినీ ఫంక్షన్ హాల్లో పనిచేస్తుంటాడు. మద్యం అలవాటున్న అంజయ్య ఈనెల 1న ఫంక్షన్ హాల్‌కు వెళ్తున్నట్టు కుటుంబ సభ్యులకు చెప్పి ఇంటి నుంచి వెళ్లాడు. ఆ రోజు అతడు తిరిగి ఇంటికి రాకపోవడంతో భార్య సరోజ, కుమారుడు సాయి, కుమార్తె స్వప్న ఆందోళనకు గురయ్యారు. ఆచూకీ కోసం బంధువులు, స్నేహితుల ఇళ్లల్లో వాకబు చేశారు. అంజయ్య ఫొటోను చూపిస్తూ పలు ప్రాంతాల్లో వెతకసాగారు. ఇదిలావుండగా.. ఈనెల 1వ తేదీన కాచిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో మద్యం మత్తులో గాయాలతో ఉన్న 50 ఏళ్ల వయసున్న వ్యక్తిని చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రిలో చేర్పించారు. అయితే ఆ వ్యక్తి మత్తు దిగగానే వైద్యులకు చెప్పకుండా ఆస్పత్రి నుంచి వెళ్లిపోయాడు. ఇదే వ్యక్తి మద్యం తాగి ఎంజీబీఎస్ వద్ద అపస్మారక స్థితిలో పడివుండగా పోలీసులు గుర్తించి ఆస్పత్రికి తరలించారు. రెండోసారి కూడా మత్తు దిగగానే తిరిగి వెళ్లిపోయాడు. ఇదిలావుండగా, సుమారు అదే వయసున్న గుర్తు తెలియని వ్యక్తి అఫ్జల్‌గంజ్ పోలీస్ స్టేషషన్ పరిధిలోని రాష్ట్ర గ్రంథాలయం ముందు గాయాలతో పడి ఉండడాన్ని గుర్తించి చికిత్స నిమిత్తం ఉస్మానియాకు తరలించారు. ఈ నేపథ్యంలో అంజయ్యను వెదికి పెట్టాలని అతడి కొడుకు ఫొటోతో మీర్పేట్ పోలీస్ స్టేషషన్లో ఫిర్యాదు చేశాడు. అంజయ్య ఫొటోను చూసిన పోలీసులు గాయపడ్డ అతడిని ఉస్మానియాలో చేర్పించినట్లు చెప్పారు. దీంతో అంజయ్య కుటుంబ సభ్యలు ఆస్పత్రికి చేరుకుని అఫ్జల్‌గంజ్ పోలీసులు ఈనెల 4న వైద్యం కోసం చేర్పించిన వ్యక్తిని తమ తండ్రిగా భావించి మూడు రోజుల పాటు సపర్యలు చేయగా ఈనెల 8న ఆ వ్యక్తి మృతి చెందాడు. ఈమేరకు అఫ్జల్‌గంజ్ పోలీసులకు సమాచారం అందించి మృతదేహాన్ని తీసుకెళ్లి అంత్యక్రియలు సైతం చేసేశారు. ఆదివారం అంజయ్యకు దశదిన కర్మ చేసేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. ఇంతలో అతడు బతికే ఉన్నాడన్న సమాచారం అందడంతో కుటుంబమంతా ఆశ్చర్యపోయారు. అంజయ్యను గుర్తించింది ఇలా.. పదిహేడు రోజుల క్రితం అదృశ్యమైన అంజయ్య శనివారం బడీచౌడీలోని కూరగాయల మార్కెట్ వద్ద కూరగాయలు అమ్మే మంజుల అనే మహిళకు తారసపడ్డారు. అతడిని గుర్తించిన ఆమె అంజయ్య బంధువులకు సమాచారం అందించింది. అంజయ్య బతికే ఉన్నాడని, తాను చూసినట్టు గట్టిగా చెప్పడంతో అవతలివారు నమ్మి అక్కడకు చేరుకుని ఆశ్చర్యపోయారు. చనిపోయాడకున్న అంజయ్య బతికే ఉన్నాడని ఆనందంలో విషయాన్ని అఫ్జల్‌గంజ్ పోలీసులకు చేరవేశారు. అయితే, ఇప్పుడు అంజయ్య కుటుంబ సభ్యులు అంత్యక్రియలు చేసిన వ్యక్తి ఎవరనేది మిస్టరీగా మిగిలింది. -
తాళం వేసిన ఇంట్లో చోరీ
హైదరాబాద్ : పట్టపగలే దొంగలు రెచ్చిపోతున్నారు. తాజాగా నగరంలోని అంబర్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలోని గోల్నాకలో తాళం వేసిన ఓ ఇంట్లో శుక్రవారం మధ్యాహ్నం చోరీ జరిగింది. చోరీ జరిగిన ఇంట్లో రూ.80 వేల నగదు, 10 తులాల బంగారం పోయినట్లు సమాచారం. యజమాని రాంచందర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
మామ ఇంటికే కన్నం..
గోల్నాక: ఇంటి తాళం పగులగొట్టి కిలో 50 గ్రాముల బంగారు ఆభరణాలను చోరీ చేసిన ఇద్దరు నిందితులను పోలీసులు రిమాండ్‌కు తరలించారు. ఈస్ట్‌జోన్ డీసీపీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీసీపీ డాక్టర్ వి.రవీందర్, అడిషనల్ డీసీపీ ఎల్టీ చంద్రశేఖర్, చాదర్‌ఘాట్ ఇన్స్పెక్టర్ ఎల్.రాజావెంకటరెడ్డి, అడిషనల్ ఇన్స్పెక్టర్ దీరావత్ హుస్సేన్ వివరాలను వెల్లడించారు. ఓల్డ్ సంతోష్‌నగర్ జీఎంనగర్కు చెందిన సయ్యద్ ఒమర్ స్థానికంగా వ్యాపారం చేస్తుంటాడు. మలక్‌పేట కాలడేరాలో నివాసముండే ఒమర్ అతడి మామ మహ్మద్ అబ్దుల్ రహీంఖాన్ ఇంటిని టార్గెట్ చేసుకున్నారు. గత సంవత్సరం ఆగస్టు 30న రహీంఖాన్ కోడలు ఫాతిమా జబీన్ కువైట్ నుంచి వస్తుండటంతో, కుటుంబ సభ్యులు శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వెళ్లారు. ఇదే అదునుగా సయ్యద్ ఒమర్ తన స్నేహితుడు సయ్యద్ తారిఖ్ మొయినుద్దీన్‌ను రహీంఖాన్ వెంట పంపాడు. మొయినుద్దీన్ ఎప్పటికప్పుడు రహీం ఖాన్ వివరాలను ఫోన్ ద్వారా ఒమర్‌కు తెలియజేస్తున్నాడు. రహీంఖాన్ ఇంటి తాళాలు పగులగొట్టి ఇంట్లోని కిలో 50 గ్రాముల బంగారు ఆభరణాలను, నగదును చోరీ చేశాడు. ఎయిర్‌పోర్టు నుంచి ఇంటికి తిరిగి వచ్చిన రహీంఖాన్ చోరీపై చాదర్‌ఘాట్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నిందితులు బంగారు ఆభరణాలను సంతోష్‌నగర్‌లోని వైశ్యా బ్యాంకులో తనఖా పెట్టి రూ.12 లక్షలు అప్పుగా తీసుకున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ఈ నెల 16వ తేదీన ఇద్దరిని అరెస్టు చేసి వారి నుంచి కిలో 50 గ్రాముల బంగారు ఆభరణాలు, బైక్, మూడు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసును ఛేదించిన చాదర్‌ఘాట్ పోలీసులను డీసీపీ అభినందించారు.