తండ్రీకొడుకులను రక్షించబోయి యువకుడి మృతి | man died in hyderabd golnaka over Protect Boite son and father in well | Sakshi
Sakshi News home page

తండ్రీకొడుకులను రక్షించబోయి యువకుడి మృతి

Published Wed, Oct 19 2016 5:53 PM | Last Updated on Sun, Sep 2 2018 4:37 PM

(ఫైల్) ఫోటో - Sakshi

(ఫైల్) ఫోటో

హైదరాబాద్ : నగరంలోని పాతబస్తీలో బుధవారం విషాదం సంభవించింది. తండ్రీకొడుకులను కాపాడేందుకు యత్నించిన ఓ యువకుడు అనూహ్యంగా మృతి చెందిన ఘటన గోల్నాకలో చోటుచేసుకుంది. 

గోల్నాకకు చెందిన అంజాద్ అనే యువకుడు ప్రమాదవశాత్తు స్థానికంగా ఉన్న ఓ బావిలో పడిపోయాడు. యువకుడ్ని కాపాడేందుకు అతని తండ్రి బావిలోకి దూకాడు. ఈ క్రమంలో వారిద్దరిని రక్షించేందుకు అజ్గర్ అనే మరో యువకుడు కూడా బావిలోకి దూకాడు. సమాచారం అందుకున్న పోలీసులు, రెవెన్యూ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని వారిని కాపాడేందుకు తీవ్రంగా యత్నిస్తున్నారు. ఈ ప్రమాదంలో తండ్రీకొడుకులను కాపాడేందుకు యత్నించిన అజ్గర్ మృతి చెందాడు. దీంతో స్థానికంగా విషాదం చోటుచేసుకుంది. మిగతా ఇద్దరిని రక్షించేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement