బ్రెడా (నెదర్లాండ్స్): చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో పోరులో టీమిండియా ఘన విజయం సాధించింది. చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా భారత పురుషుల హాకీ జట్టు శనివారం జరిగిన తమ తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్‌ను చిత్తు చేసింది. 4-0 గోల్స్ తేడాతో భారత్ గెలుపొందింది. వరుస విరామాల్లో గోల్స్ మీద గోల్స్ చేస్తూ ప్రత్యర్థి పాక్‌ను ముప్పుతిప్పలు పెట్టారు భారత క్రీడాకారులు. ప్రపంచంలో మేటి ఆరు జట్లు బరిలో దిగే ఈ టోర్నీ ఆరంభ మ్యాచ్‌లో గెలిచి భారత్ శుభారంభం చేసి, ప్రత్యర్థి పాక్‌కు తమ సత్తా చూపించింది. ర్యాంకింగ్స్ పరంగా చూసుకుంటే పాకిస్తాన్ (13) కంటే మెరుగ్గా ఉన్న భారత్ (6) అత్యుత్తమ ఆటతీరుతో ఆకట్టుకుంది. చీఫ్ కోచ్ హరేంద్ర సింగ్ అభిప్రాయపడ్డుట్లుగానే ఎలాంటి భావోద్వేగాలకు తావివ్వకుండా భారత్ మెరుగైన ఆటతీరుతో చాంపియన్స్ ట్రోఫీలో బోణీ కొట్టింది.
Comments
Please login to add a commentAdd a comment