
మొహాలి: జాతీయ సబ్ జూనియర్ రోలర్ హాకీ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ బాలికల జట్టు స్వర్ణ పతకానికి విజయం దూరంలో నిలిచింది. పంజాబ్‌లో జరుగుతున్న ఈ టోర్నీలో సోమవారం జరిగిన బాలికల సెమీఫైనల్లో తెలంగాణ జట్టు 2–1 గోల్స్ తేడాతో చండీగఢ్ జట్టును ఓడించింది.
మనాల్ సుల్తానా, నిదా ఖాన్, తనుశ్రీ, అక్షిత, హజ్రా, తర్పణ, హరిణి, మెహక్, అఫీరా, శరణ్య, రిషిక తెలంగాణ బాలికల జట్టులో సభ్యులుగా ఉన్నారు. మంగళవారం జరిగే ఫైనల్లో హరియాణాతో తెలంగాణ పసిడి పతకం కోసం పోరాడనుంది.
Comments
Please login to add a commentAdd a comment