senior hockey team
-
గోల్స్ సునామీ సృష్టించిన తమిళనాడు.. 60 నిమిషాల్లో 43..
జాతీయ పురుషుల సీనియర్ హాకీ చాంపియన్‌షిప్‌లో ఆతిథ్య తమిళనాడు జట్టు ఆటగాళ్లు ఊహించనిరీతిలో అండమాన్ నికోబార్ జట్టుపై గోల్స్ సునామీ సృష్టించారు. చెన్నైలో జరుగుతున్న ఈ టోరీ్నలో నాలుగు క్వార్టర్ల పాటు 60 నిమిషాలు జరిగిన ఈ మ్యాచ్‌లో ఏకంగా 43 గోల్స్ సమోదయ్యాయి. తమిళనాడు 43–0తో అండమాన్ నికోబార్ జట్టుపై జయభేరి మోగించింది. కెప్టెన్ కార్తీ సెల్వం 13, సోమన్న, సుందరపాండి చెరో 9 గోల్స్ తుఫాన్ సృష్టించారు. మారీశ్వరన్ శక్తివేల్ 6, పృథ్వీ 3, సెల్వరాజ్ కనగరాజ్ రెండు గోల్స్ సాధించారు. శ్యామ్ కుమార్ ఒక గోల్ చేశాడు. కనీస ప్రతిఘటన చేయలేకపోయిన అండమాన్ జట్టు కనీసం ఖాతా తెరువక పోవడమే విడ్డూరంగా ఉంది. మరో మ్యాచ్‌లో ఆంధ్రప్రదేశ్... మధ్యప్రదేశ్ ధాటికి చేతులెత్తేసింది. ఏపీ జట్టును ఖాతా తెరవనీకుండా మధ్యప్రదేశ్ జట్టు 17–0తో విజయం సాధించింది. -
హాకీ జిల్లా స్థాయి సీనియర్ జట్టు ఎంపిక
అనంతపురం సప్తగిరిసర్కిల్ : హాకీ జిల్లా స్థాయి సీనియర్ జట్టును బుధవారం ఎంపిక చేసినట్లు హాకీ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి విజయ్‌బాబు తెలిపారు. ఎంపికైన క్రీడాకారులు ఈ నెల 28 నుంచి 31 వరకు విశాఖపట్టణంలో జరిగే సీనియర్ రాష్ట్ర చాంపియన్‌షిప్ టోర్నీలో పాల్గొంటారన్నారు. క్రీడాకారులకు అనంత క్రీడా గ్రామంలో ఆర్డీటీ సహకారంతో డచ్ శిక్షకులతో తర్ఫీదు ఇచ్చినట్లు వివరించారు. శిక్షణ ముగింపు శిబిరానికి డచ్ హాకీ క్రీడాకారులు కొస్పల్, రోడ్రిక్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ప్రతి క్రీడాకారుడు తన ఫిట్నెస్ను నిలుపుకునేందుకు కృషి చేయాలని సూచించారు. అప్పుడే రాణించగలరన్నారు. జట్టుకు కోచ్‌గా బాబయ్య, మేనేజర్‌గా ఓబులేసు వ్యవహరిస్తారు. ఎంపికైన క్రీడాకారులు వీరే గంగాధర్, హరీశ్, ఎర్రిస్వామి, లోక్‌నాథ్, శివానందరెడ్డి, అమర్, శివ, సాయికిరణ్, మహబూబ్‌బాషా, అక్రంబాషా, బాబ్జాన్, భగత్ బాబు, వెంకటేశ్, హర్షవర్దన్, నల్లప్పరెడ్డి, సంతోశ్, మహబూబ్‌బాషా.