కరీంనగర్ జిల్లా ముస్తాబాద్‌కు చెందిన మాడూరి కిషన్(30) సౌదీ అరేబియాలో అనుమానాస్పదస్థితిలో మృతి చెందాడు.
ముస్తాబాద్: కరీంనగర్ జిల్లా ముస్తాబాద్‌కు చెందిన మాడూరి కిషన్(30) సౌదీ అరేబియాలో అనుమానాస్పదస్థితిలో మృతి చెందాడు. మంగళవారం కిషన్ భవనంపై అంతస్థు నుంచి పడిపోయి మృతి చెందినట్లు ఆయన పనిచేస్తున్న కంపెనీ ప్రతి నిధులు సమాచారం అందించారు. కిషన్ మూడేళ్ల క్రితం అప్పులు చేసి సౌదీ వెళ్లాడు. మరోవారంలో వస్తున్నట్లు భార్య లావణ్యకు తెలిపాడు. ఇంతలోనే కిషన్ ప్రమాదం లో మరణించాడనే సమాచారం వచ్చింది. సోమవారం తన భర్త ఫోన్‌లో మాట్లాడడని, కంపెనీలో కొంతమంది బెదిరిస్తున్నారని తెలిపాడని లావణ్య పేర్కొంది. కొంతమంది కావాలనే బిల్డింగ్‌పై నుంచి తోసి వేసి హత్య చేశారని ఆరోపించింది.