కరీంనగర్: బతుకుదెరువు కోసం సౌదిఅరేబియాకు వెళ్లిన ఓ తెలంగాణ యువకుడు అక్కడ జరిగిన ప్రమాదంలో మృతి చెందాడు. కరీంనగర్ జిల్లా వెల్లటూరు మండలం అంబారిపేట గ్రామానికి చెందిన బొమ్మగాని శేఖర్(29) బతుకుదెరువు కోసం దుబాయ్ వెళ్లాడు. అక్కడ ఓ ఫ్యాక్టరీలో పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో సోమవారం కర్మాగారంలో పని చేస్తున్న సమయంలో ప్రమాదం జరగడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు.