పోలీస్ స్టేషన్లో గొంతుకోసుకున్నయువకుడు
పోలీస్ స్టేషన్లో గొంతుకోసుకున్నయువకుడు
Published Wed, Sep 28 2016 3:04 PM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM
అచ్చంపేట: దొంగతనం కేసులో పోలీసులు విచారణకు పిలవటంతో ఓ యువకుడు మనస్తాపానికి గురై ఆత్మహత్యకు యత్నించాడు. మహబూబ్‌నగర్ జిల్లా అచ్చంపేటలో ఈ ఘటన చోటు చేసుకుంది. మండలంలోని సింగారం గ్రామం పెద్దతండాకు చెందిన చెందిన కిషన్ మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాలలో చదువుకుంటున్నాడు. ఓ దొంగతనం కేసులో అనుమానంతో కిషన్ ను పోలీసులు స్టేషన్‌కు తీసుకువచ్చారు.
అయితే తను ఏ నేరం చేయలేదని కిషన్ చెబుతున్నాడు. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం పోలీస్‌స్టేషన్ ఆవరణలోనే వెంట తెచ్చుకున్న బ్లేడ్‌తో కిషన్ గొంతు కోసుకున్నాడు. తీవ్ర రక్తస్రావం కావటంతో పోలీసులు వెంటనే అచ్చంపేట ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా మారటంతో హైదరాబాద్‌కు తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Advertisement
Advertisement