పెళ్లి చేసుకుంటానని మోసం | the lover cheet in Marriage fraud | Sakshi
Sakshi News home page

పెళ్లి చేసుకుంటానని మోసం

Published Thu, May 12 2016 2:29 AM | Last Updated on Sun, Sep 3 2017 11:53 PM

the lover cheet in Marriage fraud

బాలల హక్కుల సంఘాన్ని ఆశ్రయించిన బాలిక

 హిమాయత్‌నగర్: పెళ్లి చేసుకుంటానని మోసం చేసి.. వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధమైన యువకుడిపై బాలిక (16) బాలల హక్కుల సంఘానికి ఫిర్యాదు చేసింది. తనకు న్యాయం చేయాలని కోరింది. ఆ సంఘం గౌరవ అధ్యక్షుడు అచ్యుతరావుతో కలిసి బాధితురాలు బుధవారం విలేకరులకు తెలిపిన వివరాల ప్రకారం... ఖమ్మం జిల్లా బీరోలు గ్రామానికి చెందిన బాలిక తనకు మామ వరసయ్యే నేతగాని వెంకన్న ఇంటికి వంట చేసేందుకు వెళ్లగా...అతని కుమారుడు నేతగాని నగేష్ (28) పెళ్లి చేసుకుంటానని లొంగదీసుకున్నాడు.

గర్భం దాల్చగా.. బలవంతంగా బాలికతో మాత్రలు మింగించి అబార్షన్ అయ్యేలా చేశాడు. ఆ తర్వాత బాలిక పెళ్లి చేసుకోవాలని కోరగా.... దిక్కున్న చోట చెప్పుకోమని బెదిరించాడు. గురువారం అతను వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోవాడానికి సిద్ధం కావడంతో బాలిక బాలల హక్కుల సంఘాన్ని ఆశ్రయించింది. ఆ పెళ్లిని ఆపి తాను మేజర్ అయిన తర్వాత నగేష్‌తో తనకు వివాహం జరిపించాలని కోరింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement