పెద్దశంకరంపేట : బాలల హక్కులను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని జోగిపేట జూనియర్ సివిల్ జడ్జి రమాకాంత్ అన్నారు. శుక్రవారం పేట పోలీస్‌స్టేషన్‌లో బాలల సహాయ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. బాలల దినోత్సవం సందర్భంగా ఈ కేంద్రాలను ఏర్పాటు చేయడం శుభ పరిణామమన్నారు. సమాజంలో బాల నేరస్తులు ఉండరాదన్నారు. బాలలను నేరస్తులుగా చూడొద్దని, వారిపై నేరస్తులన్న ముద్ర వేయకుండా చర్యలు తీసుకోవాలని ఆయన పోలీసులను కోరారు.
మెగా లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోండి : డిసెంబర్ 6న దేశ వ్యాప్తంగా నిర్వహిస్తున్న మెగా లోక్ అదాలత్ సద్వినియోగం చేసుకోవాలని జడ్జి రమాకాంత్ పిలుపునిచ్చారు. అన్ని కోర్టుల్లో ఈ అదాలత్ ద్వారా పెండింగ్ కేసులను రాజీ చేసుకునే అవకాశం ఉందన్నారు. కార్యక్రమంలో జోగిపేట సీఐ రఘు, పేట ఎస్‌ఐ మహేష్ గౌడ్, న్యాయవాదులు భాస్కర్, లింగం, ఎస్‌హెచ్‌ఓ లక్ష్మణ్, చిరంజీవి, విఠల్ గౌడ్, ప్రేమ్, శ్రీనివాస్‌గౌడ్ తదితరులున్నారు.
బాలల హక్కులను కాపాడాల్సిన బాధ్యత అందరిదీ
Published Fri, Nov 14 2014 11:38 PM | Last Updated on Sat, Sep 2 2017 4:28 PM
Advertisement
Advertisement