ప్రముఖ టెక్ దిగ్గజం హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ టెక్ నిరుద్యోగులకు దీపావళి పండుగ సందర్భంగా శుభవార్త తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా పలు సంస్థలు క్లౌడ్‌లోకి మారేందుకు సిద్ద పడుతున్న ఈ సమయంలో దానికి సంబంధించిన సేవలను వేగంగా అందించేందుకు అమెజాన్ వెబ్ సర్వీసెస్ బిజినెస్ యూనిట్(ఏడబ్ల్యూఎస్ బీయూ)ను బుధవారం (నవంబర్ 3)న ప్రారంభించింది. ఈ ప్రత్యేక వ్యాపార యూనిట్ కోసం ఏడబ్ల్యుఎస్ ఇంజనీరింగ్, సొల్యూషన్స్, బిజినెస్ టీమ్‌లు సహకరిస్తాయని ఒక ప్రకటన తెలిపింది. "ప్రస్తుతం ఏడబ్ల్యుఎస్ టెక్నాలజీ కోసం దాదాపు 10వేల మంది సిబ్బందికి హెచ్‌సీఎల్ శిక్షణ ఇచ్చింది. భవిష్యత్తులో ఈ సంఖ్యను 20,000 మందికి పైగా నిపుణులకు పెంచాలని యోచిస్తున్నట్లు" సంస్థ తెలిపింది.
కొత్త వ్యాపార యూనిట్ మెయిన్ ఫ్రేమ్ అప్లికేషన్లను ఆధునికీకరించడానికి, క్లౌడ్ టెక్నాలజీ ప్రాజెక్టులను దక్కించుకోవడానికి, లక్ష్యాలను సాధించడానికి నిపుణులు అవసరం అని సంస్థ తెలిపింది. హెచ్‌సీఎల్ అనేది ఎడబ్ల్యుఎస్ ప్రీమియర్ కన్సల్టింగ్ పార్టనర్. ఇది మౌలిక సదుపాయాల కల్పన, అప్లికేషన్లు & డేటాను ఆధునీకరించడంలో, వినియోగదారులకు అత్యుత్తమ సేవలందించడం కోసం తీసుకొచ్చినట్లు పేర్కొంది. హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ & హెడ్(ఎకోసిస్టమ్స్) కళ్యాణ్ కుమార్ మాట్లాడుతూ.. "కంపెనీ #HCLCloudSmart వ్యూహంలో ఏడబ్ల్యూఎస్ బీయూ ఒక ముఖ్యమైన భాగం. వినియోగదారులకు పోటీదారుల కంటే ముందుగా బలమైన క్లౌడ్ వ్యవస్థల నిర్మాణం, సేవలు అందించడంలో ఇది సహాయపడుతుంది" అని అన్నారు.
(చదవండి: ప్రతి నెల రూ.1500 పొదుపు చేస్తే.. రూ.35 లక్షలు మీ సొంతం!)
Comments
Please login to add a commentAdd a comment