Kitchens
-
వంటకాలను చిటికెలో చేసే 'రోబో చెఫ్'
ఇది రోబో చెఫ్. ఎలాంటి వంటకాలనైనా చిటికెలో వండి వడ్డిస్తుంది. కెనడియన్ స్టార్టప్ కంపెనీ ‘రోబో ఈట్జ్’ ఈ రోబో చెఫ్‌ను రూపొందించింది. రెస్టరెంట్ నిపుణులు, ఏరోస్పేస్ ఇంజినీర్ల సంయుక్త కృషితో ‘రోబో ఈట్జ్’ ఈ రోబో చెఫ్‌ను విజయవంతంగా తయారు చేసింది.వంటగదిలోని ప్రతి పనిని ఇది స్వయంగా చేస్తుంది. ఇందులో నిక్షిప్తమైన 80 రకాల పదార్థాలు, దినుసులను ఉపయోగించి ఎలాంటి వంటకాన్నైనా సిద్ధం చేసేస్తుంది. ఇది వెయ్యి రకాల వంటకాలను వండి పెడుతుంది. వంటకం తయారైన తర్వాత తినేటంత వరకు తాజాదనం చెడకుండా ఉండేలా వేడి పదార్థాలను వేడిగాను, చల్లని పదార్థాలను చల్లగాను నిల్వచేసి ఉంచుతుంది.కార్పొరేట్ వంటగదుల్లోను, రెస్టరెంట్ల వంటగదుల్లోను, ఫాస్ట్‌ఫుడ్ చెయిన్స్ వంటగదుల్లోను ఉపయోగించడానికి అనువుగా ఈ రోబో చెఫ్‌ను తీర్చిదిద్దారు. ఇటీవల కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ షో (సీఈఎస్)లో దీని పనితీరును ప్రదర్శించారు. అంతర్జాతీయ శాస్త్రవేత్తల నుంచి దీని పనితీరుకు ప్రశంసలు లభించాయి. -
క్లౌడ్ కిచెన్
ఒకరి వద్ద ఉద్యోగిగా పనిచేయడం కన్నా.. ఏదైనా చిన్న వ్యాపారం చేసి తన కాళ్లపై తాను నిలబడాలనుకుంటోంది ప్రస్తుత తరం. అలాంటి వారే ‘స్టార్టప్ కంపెనీ’ అనే పేరుతో వివిధ రకాల వ్యాపారాలను ప్రారంభిస్తున్నారు. ఇందులోంచి పుట్టిందే క్లౌడ్ కిచెన్ కాన్సెప్‌్ట. ఇప్పుడు దేశవ్యాప్తంగా అత్యంత ట్రెండింగ్, సక్సెస్ఫుల్ బిజినెస్ అంటే ఇదే. 2015లో మొదటి క్లౌడ్ కిచెన్‌ను ప్రారంభమైంది. 2016లో ఇది ఓ వ్యాపారంగా మారింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 3,500కి పైగా క్లౌడ్ కిచెన్ స్టార్టప్‌లు నడుస్తున్నాయి. త్వరలో మరిన్ని మార్కెట్లోకి రానున్నాయి. జాతీయ క్లౌడ్ కిచెన్ బిజినెస్ మార్కెట్ విలువ ఈ ఏడాది చివరి నాటికి రూ.25వేల కోట్లకు చేరుకుంటుందని అంచనా.క్లౌడ్ కిచెన్ అంటే..సాధారణంగా ఒక పెద్ద రెస్టారెంట్గానీ, హోటల్గానీ పెట్టాలనుకుంటే పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టాలి. రెస్టారెంట్ డిజైన్ చేయించుకోవాలి. అది వాణిజ్య ప్రదేశంలో ఉండాలి. అందువల్ల అద్దె కూడా ఎక్కువగా చెల్లించాలి. కానీ, ఈ క్లౌడ్ కిచెన్ కాన్సెప్్టలో కేవలం ఒక మంచి వంటగది ఏర్పాటుచేసుకుంటే సరిపోతుంది. రెస్టారెంట్లో ఏ విధంగా కిచెన్ ఏర్పాటుచేస్తారో అలాగే ఇంటి వద్ద కూడా కిచెన్ ఏర్పాటుచేసుకోవచ్చు. ఫుడ్ ఆర్డర్లను మీరు ఆన్లైన్ ద్వారా పొందవచ్చు. ఇందుకోసం స్విగ్గి, జొమాటో వంటి ఆన్లైన్ ఫుడ్ డెలివరీ యాప్‌లతో ఒప్పందం చేసుకుంటే సరిపోతుంది. అంతేకాదు.. కిచెన్ సమీపంలోని ఐదు కిలోమీటర్ల పరిధిలో ఫోన్ ద్వారా ఆర్డర్లు తీసుకుని సొంత డెలివరీ బాయ్స్ ద్వారా ఫుడ్ చేరవేస్తే మరింత లాభం వచ్చే అవకాశం ఉంది.రెస్టారెంట్ పరిశ్రమలో ఇప్పుడు కొత్త ట్రెండ్ నడుస్తోంది. డైన్–ఇన్ కంటే డోర్‌స్టెప్ ఫుడ్ డెలివరీని కస్టమర్లు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. దీంతో క్లౌడ్ కిచెన్ల హవా పెరిగింది. వీటిని డార్క్ కిచెన్లు, గోస్ట్ కిచెన్లు, వర్చువల్ రెస్టారెంట్లు, శాటిలైట్ రెస్టారెంట్లు అని కూడా పిలుస్తారు. ప్రస్తుతం ఇవి జనాదరణ పొందుతుండడంతో చాలా రెస్టారెంట్లు ఇప్పుడు డైన్–ఇన్ రెస్టారెంట్ కల్చర్ నుంచి డోర్ డెలివరీ సెటప్ వైపు మొగ్గుచూపుతున్నాయి. తక్కువ నిర్వహణ ఖర్చులతో ఎక్కువ లాభాలు పొందడమే ఈ క్లౌడ్ కిచెన్ల ప్రత్యేకత. –సాక్షి, అమరావతిఅనుమతులు తప్పనిసరి..⇒ క్లౌడ్ కిచెన్ నిర్వహణ కోసం స్థానికంగా మున్సిపాలిటీ నుంచి అనుమతి తీసుకోవాలి. ⇒ అలాగే, సంస్థను రిజిస్టర్ చేయించుకోవడంతోపాటు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ లైసెన్స్, జీఎస్టీ రిజి్రస్టేషన్, హెల్త్ లైసెన్స్, ఫైర్ అండ్ సేఫ్టీ లైసెన్స్, ట్రేడ్ లైసెన్స్ అవసరం. ⇒ ఇలా కేవలం రూ.50 వేల నుంచి రూ.5 లక్షలు పెట్టుబడితో క్లౌడ్ కిచెన్‌ను ప్రారంభించవచ్చు. ⇒కాస్త భారీస్థాయిలో అయితే రూ.30 లక్షలు పెట్టుబడి పెట్టాలి. అధ్యయనం ముఖ్యం.. క్లౌడ్ కిచెన్ వ్యాపారాన్ని ప్రారంభించడానికి ముఖ్యమైంది అధ్యయనం. కిచెన్ పెట్టాలనుకుంటున్న ప్రాంతంలో ఎలాంటి ఫుడ్‌కు డిమాండ్ ఉంది? ప్రజల ఇష్టాయిష్టాలు, ఆహారపు అలవాట్లు, ఇప్పటికే ఎలాంటి ఫుడ్ ఎంత ధరలో అందుబాటులో ఉంది.. దాని ధరలు ఎలా ఉన్నాయి.. వంటి వివరాలను తెలుసుకుని దానిబట్టి ప్రజలు ఎక్కవగా ఇష్టపడే ఆహారాన్నే రుచికరంగా, నాణ్యతతో, తక్కువ ఖర్చులో అందించాలి. క్లౌడ్ కిచెన్‌కు లొకేషన్‌తో సంబంధంలేదు. కానీ, రోడ్డుకు కొంచెం దగ్గరగా ఉంటే మంచిది. 500 చదరపు అడుగుల స్థలం సరిపోతుంది. డెలివరీ చేసే వాహనాల పార్కింగ్‌కు స్థలం ఉండేలా చూసుకోవాలి. సోషల్ మీడియాయే ప్రచారాస్త్రం.. ప్రస్తుత ట్రెండ్ ప్రకారం.. వ్యాపారం ఏదైనాసరే సోషల్ మీడియా పేజీ ఉండాల్సిందే. ఎందుకంటే దీనిద్వారా మరింత మంది కస్టమర్లు రావచ్చు. ఫేస్బుక్, ఇన్‌స్ట్రాగామ్, యూట్యూబ్, ట్విట్టర్లలో అకౌంట్లు ఓపెన్ చేయాలి. రెగ్యులర్‌గా అప్డేట్స్ ఇస్తుంటే. ఆటోమెటిగ్గా ఈ బిజినెస్ గురించి జనాలకు తెలుస్తుంది.ఖర్చు తక్కువ.. క్లౌడ్ కిచెన్ కాన్సెప్‌్టతో వ్యాపారాన్ని తొలుత హైదరాబాద్‌లో మొదలుపెట్టాలనుకున్నాం. కానీ, విజయవాడ వాసులు ఆహార ప్రియులు కావడంతో ఇక్కడే ఏర్పాటుచేసుకున్నాం. మా దగ్గర నాణ్యత ఉన్న ఆహారాన్ని బాక్స్‌లో ప్యాక్‌చేసి ఇస్చ్తాం. ఉ.11 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకూ ఆహారాన్ని ఆన్లైన్ ద్వారా డెలివరీ ఇస్తున్నాం. సాధారణ రెస్టారెంట్‌తో పోలి్చతే దాదాపు 30–50 శాతం ఖర్చులు తక్కువ. అందువల్లే ధరలు తగ్గించి ఇవ్వగలుగుతున్నాం. – ప్రసాద్, క్లౌడ్ కిచెన్ నిర్వాహకుడు, విజయవాడ -
ఫ్యామిలీ వ్యాన్ లైఫ్
ఒక ఎస్యువి ఉంటే భ్రమణకాంక్ష ఉన్న జీవిత భాగస్వామి దొరికితే ఆ వెహికల్‌నే ఇల్లుగా మార్చుకుని దేశంలోని అందమైన ప్రకృతిని చూస్తూ గడిపేయవచ్చా? చిక్కి, కపిల్ అనే దంపతులు తమ ఇద్దరు పిల్లలతో ప్రయాణాలకు తగ్గట్టుగా మార్చుకున్న వాహనంలో ఇలాగే తిరుగుతున్నారు. వైరల్ అయిన వారి ‘ఫ్యామిలీ వ్యాన్ లైఫ్’ గురించి... తిరిగే వాళ్లు ఎలాగైనా తిరుగుతారు. కాని కొందరు స్పెషల్. సొంతగా క్రెటా, మహింద్రా 400, ట్రైబర్... లాంటి పెద్ద బండి ఉంటే దానిని కస్టమైజ్డ్ ఇంటీరియర్స్‌తో క్యాంపర్ వ్యాన్‌గా మార్చుకుని కుటుంబం మొత్తం తిరిగే బృందాలు ఇప్పుడు ఇండియాలో పెరిగాయి. క్యాంపర్ వ్యాన్ ఉంటే రిజర్వేషన్లు అక్కర్లేదు. హోటల్ రూమ్‌లు అవసరం లేదు. సమయానికి చేరుకోకపోతే ఫ్లయిట్ మిస్ అవుతామన్న ఆందోళనా లేదు. బండే బస. బండే ప్రయాణ సాధనం. చిక్కి, కపిల్ అనే దంపతులు తమ ఇద్దరు పిల్లలతో సొంత ఫ్యామిలీ వ్యాన్‌లో దేశమంతా తిరుగుతూ, ‘ఘుమ్మక్కడ్ బగ్స్’ పేరుతో యూట్యూబ్ చానల్లో వీడియోలు పోస్ట్ చేస్తూ పాపులర్ అయ్యారు. వీరికి ఐదు లక్షల మంది ఫాలోయెర్స్ ఉన్నారు. మహింద్రా 500 వాహనం డిక్కీని వీరు పూర్తి స్థాయి కిచెన్‌గా తయారు చేయించుకున్నారు. లోపలి సీట్లను బెడ్స్‌గా మార్చుకునేలా ఆల్టర్ చేయించారు. ఇవి కాకుండా హాల్ట్ చేసిన చోట బండి మీద టాప్ టెంట్ వేసుకుంటారు. బండికి ఆనుకుని చేంజింగ్ రూమ్ ఫాలిథిన్ కవర్స్‌తో ఏర్పాటు చేసుకుంటారు. దూరంగా గుంత తవ్వి చుట్టూ పాలిథిన్ çకవర్స్‌తో లావెటరీ ఏర్పాటు చేసుకుంటారు. బండిలోనే గ్యాస్, వంట దినుసులు, కూరగాయలు అన్నీ పెట్టుకునే వీలుంటుంది. కపిల్ బండి నడిపితే ఆగిన చోటల్లా చకచకా వంట ముగిస్తుంది చిక్కి. బయటి తిండి వల్ల ఆరోగ్యం పాడవడం ఒక్కటే కాదు.. సమయానికి తిండి దొరక్కపోతే ఇబ్బంది కనుక ఈ ఏర్పాటు. అందుకే వీరు దిగులూ చింతా లేకుండా తిరుగుతూ ఉంటారు. వీరి పాపులారిటీ చూసి మరికొన్ని కుటుంబాలు తమ క్యాంపర్ వ్యాన్లతో వీరిని కలుస్తుంటాయి. అందరూ కలిసి గ్రూప్ క్యాంపింగ్ చేసి సరదాగా వొండుకుంటూ, ప్రకృతిని చూస్తూ. అక్కడే నిద్రపోతూ హాయిగా గడిపేస్తుంటారు. జీవితం అంటే అందమైన ప్రయాణం. చిక్కి, కపిల్ వీడియోల మీద ఆదాయం గడించడమే కాదు... గ్రూప్ క్యాంపింగ్ నిర్వహిస్తూ అలా కూడా డబ్బు గడిస్తున్నారు. టెన్ టు ఫైవ్ ఆఫీసుకు వెళుతూ సంపాదించేవారు ఎక్కువ మందైతే ఇలా రోజుకో కొత్త ప్రాంతంలో గడుపుతూ సంపాదించడం భిన్నమే కదా. -
వంటకం చెబితే వండి తెచ్చిస్తారు..
మనకెన్నో వంటకాలు తెలిసి ఉండొచ్చు. అయితే అవి వండుకునేందుకు అవసరమైన కిచెన్ అనుబంధ వస్తువులు లేకపోవచ్చు. అలాగే పలు రెస్టారెంట్స్ తమ కిచెన్స్‌ను నిర్వహించలేని పరిస్థితుల్లో ఆయా రెస్టారెంట్స్‌లో అందించే ప్రత్యేకమైన వంటకాలను అచ్చం అలాగే తయారు చేసి వినియోగదారులకు అందించే కొత్త తరహా ఫుడ్ డెలివరీ ట్రెండ్ నగరవాసుల్ని పలకరించనుంది.. డైన్ ఇన్ లేకుండా కేవలం డెలివరీకే పరిమితమైన క్లౌడ్ కిచెన్ పోకడలో ఇది మరో వినూత్న శైలి అంటున్నారు సంబంధిత రంగ నిపుణులు. క్లౌడ్..కొత్త ట్రెండ్.. ఫుడ్ బిజినెస్‌లో క్లౌడ్ కిచెన్...వేళ్లూనుకుంటున్న ట్రెండ్. డార్క్ కిచెన్, ఘోస్ట్ కిచెన్, వర్చ్యవల్ కిచెన్స్, శాటిలైట్ కిచెన్స్ ఇలా పేరేదైనా... ఎలాంటి డైన్ ఇన్ సదుపాయం లేకుండా కేవలం డెలివరీ ఓన్లీ రెస్టారెంట్‌గా ఉండేవే ఇవి. కరోనా కాలంలో ఖర్చులు తగ్గించుకుని కొంతకాలం పాటు మనుగడ సాగించాలంటే క్లౌడ్ కిచెన్ ఒక్కటే మార్గమంటున్నారు ఆతిథ్య రంగంలోని ఔత్సాహికులు. క్లౌడ్ కిచెన్...విన్.. కరోనా కారణంగా దేశవ్యాప్తంగా 30%కు పైగా రెస్టారెంట్లు మూతపడ్డాయని హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అంచనా. పేరొందిన రెస్టారెంట్ గ్రూప్స్ కూడా నిర్వహణ భారంతో సతమతమవుతున్నాయి. ఇది క్లౌడ్ కిచెన్ల వెల్లువకు కారణంగా మారింది. గత 2019 నాటికి దేశంలో 5వేలకు పైగా క్లౌడ్ కిచెన్లు ఉండగా , ప్రస్తుతం అవి 50నుంచి 60% వృద్ధిని నమోదు చేస్తున్నాయని రెడ్‌సీర్ కన్సల్టింగ్ అంటుంటే, గ్రాస్ మర్చండైజ్ విలువ పరంగా 2019లో 400 మిలియన్ డాలర్లు ఉంటే 2024 నాటికి 3బిలియన్ డాలర్ల పరిశ్రమగా ఇది నిలువనుందనీ అంచనా వేస్తున్నాయి మరికొన్ని సంస్థలు. ఈ నేపధ్యంలో ఇదే ట్రెండ్‌ను మరింత ముందుకు తీసుకెళ్లి... Mవంటకం మీది... వంటగది మాది, పేరు మీది... మీ తరపున వినియోగదారులకు వండి అందించేది మేము అంటూ వినూత్న ఆఫర్‌తో ముందుకొచ్చింది డెలీ 360. వంట మీది...వడ్డనమాది.. మీ స్వంత వంటకాలను మీరు వినియోగడారులకు అందించవచ్చు.. అయితే వండే శ్రమ మాదే అంటూ ఆఫర్ చేస్తున్నారు డెలీ 360. అంతేకాదు వండిన ఫుడ్ డెలివరీ కోసం తమ డెలివరీ ప్లాట్‌ఫామ్‌నూ వినియోగించుకోవచ్చంటున్నారు. కాన్సెప్ట్ ఏదైనా అందుకనువైన కిచెన్ సేవలను తామందించగలమని చెబుతూ తమ క్లౌడ్ కిచెన్‌తో మార్కెటింగ్ అవకాశాలనూ అధికంగా అందిస్తున్నామంటున్నారు. రెస్టారెంట్ల సిగ్నేచర్ రెసిపీలను కూడా ఔట్ సోర్సింగ్ చేస్తున్నారు. ‘‘రెస్టారెంట్ల తరపున మేము వండినప్పటికీ రుచి పరంగా ఎలాంటి మార్పు ఉండదు. ఎందుకంటే, మా చెఫ్‌లు పూర్తి సుశిక్షితులు. వంటకాలలో వాడే పదార్థాల సేకరణ, ఆ వంటకాల తయారీలో వాటిని వాడే విధానం అంతా అసలైన రెస్టారెంట్‌ను అచ్చంగా అనుసరించే ఉంటుండటం వల్ల రుచి, నాణ్యత పరంగా ఎలాంటి వ్యత్యాసం ఉండదని కెలీ 360 వ్యవస్థాపకులు శివ తేజేశ్వర్‌రెడ్డి. భోజనప్రియులూ సూచించవ్చు.. మీరు కోరుకోండి... మేము వండి వడ్డిస్తామంటూ రెస్టారెంట్స్‌కు మాత్రమే కాక భోజనప్రియులకూ ఆఫర్ ఇస్తోంది డెలీ 360. ఇండియన్, చైనీస్, కాంటినెంటల్, దక్షిణ భారత, అరేబియన్, ఓరియెంటల్ రుచులను ఆఫర్ చేస్తున్న డెలీ, క్లౌడ్ కిచెన్‌లో సరికొత్త పోకడలకు శ్రీకారం చుట్టింది. వినియోగదారులు కోరుకున్న వంటకాన్ని కోరుకున్న శైలిలో.. కోరుకున్న సమయానికి డెలివరీ పొందేలా డెలీ 360 సేవలు అందిస్తోంది. -
ఒకే దేశం–ఒకే రేషన్ కార్డు
సాక్షి, న్యూఢిల్లీ: ఒకే దేశం–ఒకే రేషన్ కార్డు పథకం జూలై 31కల్లా దేశవ్యాప్తంగా అమలు కావాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు రాష్ట్రాలకు ఆదేశాలిచ్చింది. వలస కార్మికుల డాటా బేస్ నిమిత్తం జాతీయ స్థాయిలో వర్కర్ రిజిస్ట్రేషన్ పోర్టల్ ఏర్పాటు చేయాలని కేంద్రానికి ఆదేశించింది. ‘వలస కార్మికుల సమస్యలు, కష్టాలు’పై సుమోటో కేసును విచారించిన జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ వినీత్ శరణ్, జస్టిస్ ఎంఆర్ షాల ధర్మాసనం మంగళవారం ఈ మేరకు 80 పేజీల తీర్పు వెలువరించింది. ప్రతి వారికీ ఆహారంతోపాటు కనీస అవసరాలను పొందే హక్కుతోపాటు, రాజ్యాంగంలోని ఆరి్టకల్ 21 ప్రకారం జీవించే హక్కు ఉందని ధర్మాసనం పేర్కొంది. అసంఘటిత రంగ కార్మికుల కోసం జాతీయ స్థాయి డేటాబేస్ ఏర్పాటు చేయాలని 2018లో అత్యున్నత న్యాయస్థానం ఆదేశించిందని ఈ సందర్భంగా ధర్మాసనం గుర్తు చేసింది. ఈ విషయంలో కేంద్ర కారి్మక శాఖ కనబరుస్తున్న ఉదాసీనత, నిర్లక్ష్య వైఖరి క్షమించరాదని కూడా ధర్మాసనం వ్యాఖ్యానించింది. వలస కారి్మకులకు రేషన్ సరుకుల పంపిణీకి తగిన పథకం తీసుకు రావాలని రాష్ట్రాలకు సూచించింది. ఆయా రాష్ట్రాల పథకాలన్నీ జూలై 31 కల్లా అమలులోకి రావాలని, అదే రోజుకల్లా వన్ నేషన్–వన్ రేషన్ అమలులోకి తీసుకురావాలని పేర్కొంది. రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలు కాంట్రాక్టర్లను వీలైనంత త్వరగా సిద్ధం చేసి కార్మికుల రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలంది. రెండు పూటలా ఆహారం దొరకని వలస కార్మికులకు సామూహిక వంటశాలలు ఏర్పాటు చేయాలని, ఆయా పథకాలన్నీ కరోనా మహమ్మారి ఉన్నంత వరకూ కొనసాగించాలని పేర్కొంది. వలస కార్మికులకు రేషన్ సరఫరా నిమిత్తం తగిన పథకం రాష్ట్రాలు తీసుకురావాలి. ఆ మేరకు కేంద్రం అదనపు ఆహారధాన్యాలను రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలకు అందజేయాలి. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు దీనికి సంబంధించి తగిన పథకాన్ని జూలై 31లోగా తీసుకొచ్చి అమలు చేయాలని తెలిపింది. చదవండి: ఆకలి మంటల్లో కార్మికులు! -
ఇంటి ఎంపికలో వంట గదే కీలకం!
మెట్రో నగరాల్లో గృహ కొనుగోలులో వంట గది కీలకంగా మారింది. అందుబాటు ధర, అభివృద్ధి చెందే ప్రాంతం, వసతులు మాత్రమే కాదండోయ్.. ఇంట్లోని వంట గది శైలి కూడా ఆధునికంగా ఉండాలంటున్నారు కొనుగోలు దారులు. అందుకే సాధారణ కిచెన్స్ స్థానంలో ఇప్పుడు ఓపెన్ కిచెన్స్ ట్రెండ్ నడుస్తోంది. లివింగ్, డైనింగ్రూమ్లతో వంట గది కలిసి ఉండటమే దీని ప్రత్యేకత! సాక్షి, హైదరాబాద్ : నగరంలోని నిర్మాణ సంస్థలు 1,000 చ.అ. పైన ఉండే ప్రతి ఫ్లాట్‌లోనూ ఓపెన్ కిచెన్స్ ఏర్పాటుకే ప్రాధాన్యమిస్తున్నాయి. హాలుకు అనుసంధానంగా అడ్డుగా గోడలు లేకుండా ఓపెన్ కిచెన్స్‌ను ఏర్పాటు చేస్తారు. అంటే లివింగ్ రూమ్, డైనింగ్ రూమ్‌కు కిచెన్ కలిసే ఉంటుందన్నమాట. ముచ్చటిస్తూ వంటలు.. ఓపెన్ కిచెన్స్‌లో సానుకూల, ప్రతికూల రెండు రకాల అంశాలూ ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అవేంటంటే.. ♦ వంట చేస్తూనే ఇతర గదుల్లో ఉన్నవారితో, ఇంటికి వచ్చిన అతిథులతో సంభాషించవచ్చు. హాల్లో ఉండే టీవీలోని కార్యక్రమాలనూ వీక్షించొచ్చు. ♦ ఓపెన్ కిచెన్ కాబట్టి శుభ్రంగా ఉంచేందుకు శ్రద్ధ తీసుకుంటారు. ఇంటిని అందంగా అలంకరించే కసరత్తును వంట గది నుంచి మొదలుపెడతారు. ♦ ఘుమఘుమలు ఇల్లంతా పరుచు కుంటాయి. దీంతో కుటుంబ సభ్యుల మూడ్‌ను ఇవి మారుస్తాయి. ♦ ఇంట్లో చిన్నారులు ఉంటే వంట గది నుంచి కూడా వీరిపై పర్యవేక్షణకు వీలుంటుంది. ♦ వంట పాత్రలు బయటికి కన్పిస్తుంటాయి. కాబట్టి ఇది కొందరికి నచ్చదు. ♦ డిష్వాషర్, మిక్సీల శబ్దాలు ఇతర గదుల్లో విన్పించి అసౌకర్యంగా ఉంటుంది. ♦ దూరపు బంధువులు, అంతగా పరిచయం లేనివారు వచ్చినప్పుడు వారి ముందు వంట చేయడం కొంత మందికి అంతగా నప్పదు. సంప్రదాయ వంట గది.. వీటిని పాత రోజుల నుంచి చూస్తున్నవే. వంట గది ప్రత్యేకంగా ఉంటుంది. ఏకాంతంగా వంట చేయాలని కోరుకునే వారు సంప్రదాయ శైలిలో ఉండే వంటిల్లునే ఇష్టపడతారు. ♦ గదికి అన్ని వైపులా గోడలుంటాయి. అరలు ఎక్కువ ఏర్పాటుకు వీలుండటంతో పాత్రలన్నింటిని చక్కగా సర్దేయవచ్చు. ♦ వంటింట్లోని శబ్ధాలు, వాసనలు బయటికి రావు. ఇతరులకు ఇబ్బంది కలగకుండా ఉంటుంది. ♦ చుట్టూ గోడలు ఉండటంతో ఇరుకిరుగ్గా, చీకటిగా ఉంటుంది. ఒకేసారి ఎక్కువ మంది తిరిగేందుకు వీలుండదు. ♦ ఇల్లు డిజైన్ సమయంలోనే ఎలాంటి వంట గది కావాలో నిర్ణయించుకోవాలి. ఎందుకంటే ఒకసారి వంట గదిని నిర్మించేశాక మళ్లీ ఓపెన్ కిచెన్‌లా మార్చాలంటే మరింత ఖర్చు అవుతుంది. -
హోటళ్లపై కొనసాగుతున్న GHMC దాడులు
-
మిథ్యాన్నమే!
ఉడికీ ఉడకని మధ్యాహ్న భోజనం... సాక్షి, మహబూబ్‌నగర్: విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజన పథకం నీరుగారిపోతుంది. వంట ఏజెన్సీలకు ఈ ఏడాది ఇప్పటి వరకు నిధులు రాకపోవడంతో నిర్వాహకులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. రెండు నెలలుగా ప్రభుత్వం పైసలివ్వకపోవడంతో విద్యార్థులకు ఉడకని అన్నం... నీళ్ల చారే దిక్కైంది. మెనూ ప్రకారం విద్యార్థులకు ఎక్కడా భోజనం అందించడంలేదు. ఉడికీ ఉడకని అన్నం నీళ్లచారుతో నిర్వాహకులు సరిపెడుతున్నారు. వారానికి ఒకసా రి ఇవ్వాల్సిన గుడ్డు, అరటిపండు సంగతే పట్టించుకోవడం లేదు. భోజనం తర్వాత కనీసం తాగడానికి మంచి నీళ్లు కూడా లేక విద్యార్థులు అనేక అవస్థలు పడుతున్నారు. కొన్ని పాఠశాలల్లో మధ్యాహ్న భోజన సమయంలో ఆవరణలో విద్యార్థులు భోజనం చేస్తుండగా వారి వద్దకు పందులు, కుక్కలు పెద్ద ఎత్తున తరలివస్తున్నాయి. బుధవారం ‘సాక్షి’ విజిట్‌లో అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. రూ.8 కోట్ల బకాయిలు జిల్లాలో మొత్తం 3,799 పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తున్నారు. పాఠశాలలో హాజరు శాతాన్ని పెంచుతూ, డ్రాపవుట్ శాతం తగ్గించడం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా మధ్యాహ్న భోజన పథకాన్ని నిర్వహిస్తున్నాయి. ఈ పథకం కింద అన్ని పాఠశాలల పరిధిలో దాదాపు 4,48,227 మంది విద్యార్థులకు భోజనం పెడుతున్నట్లు అధికార గణాంకాలు సూచిస్తున్నాయి. వీటి నిర్వహణకు ప్రతి నెల రూ.5కోట్ల నిధులను ప్రభుత్వాలు మంజూరు చేస్తున్నాయి. కానీ ఈసారి మాత్రం అందుకు భిన్నంగా స్కూళ్లు ప్రారంభమైన నాటి నుంచి నిధులు రాలేదు. కేవలం 9, 10 తరగతుల విద్యార్థుల కోసం మాత్రం రాష్ట్ర ప్రభుత్వ నిధులు *కోటిన్నర మంజూరయ్యాయి. ఒకటి నుంచి 8 తరగతుల విద్యార్థుల అమలు కోసం 8కోట్ల రూపాయలు ఇప్పటి దాకా మంజూరు కాలేదు. ప్రభుత్వం నుంచి కేవలం బియ్యం మాత్రమే అందుతుండటంతో, మిగతా వంట సరకుల కోసం నిర్వాహకులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. కిరాణషాపులలో అప్పు పుట్టకపోవడంతో చాలా చోట్ల నీళ్ల చారుతో సరిపెడుతున్నారు. ఇరుకు గదులతో ఇక్కట్లు.. జిల్లాలోని చాలా పాఠశాలల్లో ఇప్పటికీ వంటగదులు లేవు. దీంతో నిర్వాహకులు ఆరుబయటే వంట చేస్తున్నారు. జిల్లాకు ఇప్పటి వరకు రెండు విడతలుగా 4,660 గదుల నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయి. వీటిలో కేవలం 1,107 మాత్రమే పూర్తయ్యాయి. 500వరకు వివిధ దశలలో కొనసాగుతున్నాయి. మిగతావి పనులు చేపట్టిన దాఖలాలే లేవు. కొన్ని చోట్ల కిచెన్ షెడ్లు ఇరుకుగా ఉండటం వల్ల వంట ఏజెన్సీ మహిళలు ఆరుబయటే వంటలు చేస్తుండటంతో పొగ కమ్ముకుని విద్యార్థులకు ఇబ్బందులు కలుగుతున్నాయి. చాలా పాఠశాలల్లో తాగునీటి సౌకర్య లేకపోవడంతో వంట ఏజెన్సీలు, విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. అపరిశుభ్ర వాతావరణంలో తినలేమంటూ కొందరు విద్యార్థులు ఇళ్లనుంచే భోజనం తెచ్చుకుంటున్నారు. ఉపాధ్యాయులు నచ్చచెబుతున్నా కొన్ని చోట్ల సామాజిక అంతరాలను సాకుగా చూపుతూ కొందరు విద్యార్థులు ఈ పథకానికి దూరంగా ఉంటున్నారు. వంట ఎవరు చేయాలనే అంశంపై ఏజెన్సీల నడుమ గొడవలు జరిగి అధికారుల దృష్టిని వెళ్లిన దాఖలా కూడా వుంది. వంట ఏజెన్సీల నియామకంలో రాజకీయ జోక్యం కూడా ఉండటంతో సిగపట్లకు దారితీస్తోంది.