ఇది రోబో చెఫ్. ఎలాంటి వంటకాలనైనా చిటికెలో వండి వడ్డిస్తుంది. కెనడియన్ స్టార్టప్ కంపెనీ ‘రోబో ఈట్జ్’ ఈ రోబో చెఫ్‌ను రూపొందించింది. రెస్టరెంట్ నిపుణులు, ఏరోస్పేస్ ఇంజినీర్ల సంయుక్త కృషితో ‘రోబో ఈట్జ్’ ఈ రోబో చెఫ్‌ను విజయవంతంగా తయారు చేసింది.
వంటగదిలోని ప్రతి పనిని ఇది స్వయంగా చేస్తుంది. ఇందులో నిక్షిప్తమైన 80 రకాల పదార్థాలు, దినుసులను ఉపయోగించి ఎలాంటి వంటకాన్నైనా సిద్ధం చేసేస్తుంది. ఇది వెయ్యి రకాల వంటకాలను వండి పెడుతుంది. వంటకం తయారైన తర్వాత తినేటంత వరకు తాజాదనం చెడకుండా ఉండేలా వేడి పదార్థాలను వేడిగాను, చల్లని పదార్థాలను చల్లగాను నిల్వచేసి ఉంచుతుంది.
కార్పొరేట్ వంటగదుల్లోను, రెస్టరెంట్ల వంటగదుల్లోను, ఫాస్ట్‌ఫుడ్ చెయిన్స్ వంటగదుల్లోను ఉపయోగించడానికి అనువుగా ఈ రోబో చెఫ్‌ను తీర్చిదిద్దారు. ఇటీవల కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ షో (సీఈఎస్)లో దీని పనితీరును ప్రదర్శించారు. అంతర్జాతీయ శాస్త్రవేత్తల నుంచి దీని పనితీరుకు ప్రశంసలు లభించాయి.
Comments
Please login to add a commentAdd a comment