మనకెన్నో వంటకాలు తెలిసి ఉండొచ్చు. అయితే అవి వండుకునేందుకు అవసరమైన కిచెన్ అనుబంధ వస్తువులు లేకపోవచ్చు. అలాగే పలు రెస్టారెంట్స్ తమ కిచెన్స్‌ను నిర్వహించలేని పరిస్థితుల్లో ఆయా రెస్టారెంట్స్‌లో అందించే ప్రత్యేకమైన వంటకాలను అచ్చం అలాగే తయారు చేసి వినియోగదారులకు అందించే కొత్త తరహా ఫుడ్ డెలివరీ ట్రెండ్ నగరవాసుల్ని పలకరించనుంది.. డైన్ ఇన్ లేకుండా కేవలం డెలివరీకే పరిమితమైన క్లౌడ్ కిచెన్ పోకడలో ఇది మరో వినూత్న శైలి అంటున్నారు సంబంధిత రంగ నిపుణులు.
క్లౌడ్..కొత్త ట్రెండ్..
ఫుడ్ బిజినెస్‌లో క్లౌడ్ కిచెన్...వేళ్లూనుకుంటున్న ట్రెండ్. డార్క్ కిచెన్, ఘోస్ట్ కిచెన్, వర్చ్యవల్ కిచెన్స్, శాటిలైట్ కిచెన్స్ ఇలా పేరేదైనా... ఎలాంటి డైన్ ఇన్ సదుపాయం లేకుండా కేవలం డెలివరీ ఓన్లీ రెస్టారెంట్‌గా ఉండేవే ఇవి. కరోనా కాలంలో ఖర్చులు తగ్గించుకుని కొంతకాలం పాటు మనుగడ సాగించాలంటే క్లౌడ్ కిచెన్ ఒక్కటే మార్గమంటున్నారు ఆతిథ్య రంగంలోని ఔత్సాహికులు.
క్లౌడ్ కిచెన్...విన్..
కరోనా కారణంగా దేశవ్యాప్తంగా 30%కు పైగా రెస్టారెంట్లు మూతపడ్డాయని హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అంచనా. పేరొందిన రెస్టారెంట్ గ్రూప్స్ కూడా నిర్వహణ భారంతో సతమతమవుతున్నాయి. ఇది క్లౌడ్ కిచెన్‌ల వెల్లువకు కారణంగా మారింది. గత 2019 నాటికి దేశంలో 5వేలకు పైగా క్లౌడ్ కిచెన్‌లు ఉండగా , ప్రస్తుతం అవి 50నుంచి 60% వృద్ధిని నమోదు చేస్తున్నాయని రెడ్‌సీర్ కన్సల్టింగ్ అంటుంటే, గ్రాస్ మర్చండైజ్ విలువ పరంగా 2019లో 400 మిలియన్ డాలర్లు ఉంటే 2024 నాటికి 3బిలియన్ డాలర్ల పరిశ్రమగా ఇది నిలువనుందనీ అంచనా వేస్తున్నాయి మరికొన్ని సంస్థలు.
ఈ నేపధ్యంలో ఇదే ట్రెండ్‌ను మరింత ముందుకు తీసుకెళ్లి... Mవంటకం మీది... వంటగది మాది, పేరు మీది... మీ తరపున వినియోగదారులకు వండి అందించేది మేము అంటూ వినూత్న ఆఫర్‌తో ముందుకొచ్చింది డెలీ 360.
వంట మీది...వడ్డనమాది..
మీ స్వంత వంటకాలను మీరు వినియోగడారులకు అందించవచ్చు.. అయితే వండే శ్రమ మాదే అంటూ ఆఫర్ చేస్తున్నారు డెలీ 360. అంతేకాదు వండిన ఫుడ్ డెలివరీ కోసం తమ డెలివరీ ప్లాట్‌ఫామ్‌నూ వినియోగించుకోవచ్చంటున్నారు. కాన్సెప్ట్ ఏదైనా అందుకనువైన కిచెన్ సేవలను తామందించగలమని చెబుతూ తమ క్లౌడ్ కిచెన్‌తో మార్కెటింగ్ అవకాశాలనూ అధికంగా అందిస్తున్నామంటున్నారు. రెస్టారెంట్ల సిగ్నేచర్ రెసిపీలను కూడా ఔట్ సోర్సింగ్ చేస్తున్నారు.
‘‘రెస్టారెంట్‌ల తరపున మేము వండినప్పటికీ రుచి పరంగా ఎలాంటి మార్పు ఉండదు. ఎందుకంటే, మా చెఫ్‌లు పూర్తి సుశిక్షితులు. వంటకాలలో వాడే పదార్థాల సేకరణ, ఆ వంటకాల తయారీలో వాటిని వాడే విధానం అంతా అసలైన రెస్టారెంట్‌ను అచ్చంగా అనుసరించే ఉంటుండటం వల్ల రుచి, నాణ్యత పరంగా ఎలాంటి వ్యత్యాసం ఉండదని కెలీ 360 వ్యవస్థాపకులు శివ తేజేశ్వర్‌రెడ్డి.
భోజనప్రియులూ సూచించవ్చు..
మీరు కోరుకోండి... మేము వండి వడ్డిస్తామంటూ రెస్టారెంట్స్‌కు మాత్రమే కాక భోజనప్రియులకూ ఆఫర్ ఇస్తోంది డెలీ 360. ఇండియన్, చైనీస్, కాంటినెంటల్, దక్షిణ భారత, అరేబియన్, ఓరియెంటల్ రుచులను ఆఫర్ చేస్తున్న డెలీ, క్లౌడ్ కిచెన్‌లో సరికొత్త పోకడలకు శ్రీకారం చుట్టింది. వినియోగదారులు కోరుకున్న వంటకాన్ని కోరుకున్న శైలిలో.. కోరుకున్న సమయానికి డెలివరీ పొందేలా డెలీ 360 సేవలు అందిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment