Fuel At Door Delivery Service In Hyderabad, Details Inside - Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో ఇక ఇంటి వద్దకే ఇంధనం!

Published Sat, Jun 25 2022 10:46 AM | Last Updated on Sat, Jun 25 2022 1:44 PM

Fuel at Door Delivery In Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఆధునిక సాంకేతిక పరి జ్ఞానం అందు బాటులోకి రావడంతో వినియోగ దారులకు కావాల్సిన ఆహా రం, కూరగాయలు, గృహోపకరణాలు తదితర వస్తువులన్నీ ఇంటి ముంగిటే వాలిపోతున్నాయి. ఇదేవిధంగా హైదరాబాద్‌లో డీజిల్, పెట్రోల్‌ కూడా ఇంటి వద్దకే రానున్నాయి. మొబైల్‌ యాప్‌ సహా యంతో గోఫ్యూయెల్‌ ఇండియా అనే సంస్థ ఇంటి వద్దకే డీజిల్, పెట్రోల్‌ను సరఫరా చేయనున్నాయి. శుక్రవారం గోఫ్యూయెల్‌ ఆధ్వర్యంలో ఫ్రాంచైజీ భాగస్వాములైన హెచ్‌పీసీఎల్‌ సీజీఎం హరిప్రసాద్‌ సింగు పల్లి, సుస్మిత ఎంటర్‌ప్రైజెస్‌తో కలిసి తమ కార్యకలాపాలను ఆవిష్కరించారు.

సంస్థ కోఫౌండర్‌ ఆదిత్య మీసాల మాట్లా డుతూ.. ఇప్పటికే ఈ సేవలు చెన్నైలో అందుబాటులోకి వచ్చాయన్నారు. విని యోగదారులు యాప్‌లో ఆర్డర్‌ చేస్తే ఇంధనాన్ని వారు కోరుకున్న చోటుకు అందిస్తామని తెలి పారు. జూలై–సెప్టెంబర్‌లో గువాహటి, సేలంలో కార్యకలా పాలను ప్రారంభిస్తామని, 2024 నాటికి దేశమంతటా 1,000 వాహనాలతో విస్తరించడానికి ప్రణాళికలు రూపొం దించామని చెప్పారు. అపార్ట్‌మెంట్లు, పరిశ్రమలు, ఆసు పత్రులు, మాల్స్, బ్యాంకులు, గిడ్డంగులు తదితర స్థలా లకూ సరఫరా చేస్తామన్నారు.  
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement