
ఇక్కడ కల్లు కూడా డోర్‌డెలవరీ
కరీంనగర్‌లోనూ పాలు, నీళ్ల మాదిరిగానే కల్లును సైతం ఇంటింటికీ తెచ్చి విక్రయిస్తున్నారు. మినరల్ వాటర్ తెచ్చుకునే బబూల్స్‌లో కల్లు తీసుకొచ్చి లీటర్, రెండు లీటర్ల బాటిళ్లలో నింపి విక్రయిస్తున్నారు. రెండు లీటర్ల బాటిల్‌కు రూ.100 చొప్పున విక్రయిస్తున్నారు. ఆ ఊరుది..ఈ ఊరుది అంటూ కల్లుకు పేరున్న ప్రాంతాల పేరు చెబుతూ విక్రయిస్తుండడం కొసమెరుపు.