పట్నా : క్వారంటైన్ గడువు పూర్తి చేసుకున్న వలస కార్మికుల్లో ఇప్పటి వరకు 17 లక్షల కండోమ్‌లను పంపిణీ చేసినట్లు ఉపముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోదీ బుధవారం ప్రకటించారు. కుటుంబ నియంత్రణను ప్రోత్సహించడానికి వైద్య ఆరోగ్యశాఖ ఇలా వినూత్న పద్దతిని ప్రారంభించిందన్నారు. ఇతర రాష్ర్టాల నుంచి లక్షలాది మంది వలస కూలీలు వచ్చారని, 14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉన్న కార్మికులకు గర్భనిరోధక మందులు, కండోమ్‌లతో కూడిన కిట్లను ప్రభుత్వం బహుమతిగా ఇచ్చిందని చెప్పారు. దీనికి సంబంధించి ఏప్రిల్ నెలలోనే 2.14 లక్షల కండోమ్‌లు పంపిణీ చేయగా, మే నెలలో 15.39 లక్షల కండోమ్‌లను పంపిణీ చేసినట్లు వివరించారు. అంతేకాకుండా రాష్ర్టంలోని అన్ని ప్రాథమిక కేంద్రాల్లో కండోమ్ సహా గర్భనిరోధక మందులు అందుబాటులో ఉంచామని, ఎవరికైనా అవసరం ఉంటే ఆయా కేంద్రాలను సంప్రదించవచ్చని తెలిపారు. డోర్ డెలివరీ ద్వారా ఇప్పటికే 11 లక్షల గర్భనిరోధక మందులు పంపిణీ చేశామని పేర్కొన్నారు.
(పెళ్లి పీటలెక్కనున్న కేరళ సీఎం కుమార్తె)
క్వారంటైన్‌లో ఉన్న వలస కూలీల కోసం బట్టలు, దోమతెరలు లాంటి ఇతర వస్తువులకి కలిపి రాష్ర్ట ప్రభుత్వం ఒక్కొక్కరిపై 5300 రూపాయిలు ఖర్చుచేసిందని సుశీర్ కుమార్ పేర్కొన్నారు. క్వారంటైన్ తర్వాత కూడా అదనంగా వెయ్యి రూపాయల నగదును అందించామని చెప్పారు. బాలికలు, మహిళా విద్యను ప్రోత్సహించేందుకు రాష్ర్ట ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల ద్వారా దశాబ్ధ కాలంలోనే బీహార్‌లో సంతానోత్పత్తి రేటు 4.3 నుంచి 3.2 శాతానికి తగ్గిందని మోదీ అన్నారు. (ఊరట : యాక్టివ్ కేసుల కంటే రికవరీలు అధికం )
Comments
Please login to add a commentAdd a comment