క్యాన్సర్‌ బారిన సుశీల్ కుమార్ మోదీ! | Sushil Kumar Modi Diagnosed With Cancer, Says Wont Be Part Of Lok Sabha Polls - Sakshi
Sakshi News home page

Sushil Kumar Modi: క్యాన్సర్‌ బారిన సుశీల్ కుమార్ మోదీ!

Published Wed, Apr 3 2024 12:36 PM | Last Updated on Wed, Apr 3 2024 1:11 PM

Sushil Kumar Modi Diagnosed With Cancer - Sakshi

బీహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోదీ తాను గత ఆరు నెలలుగా క్యాన్సర్‌తో పోరాడుతున్నట్లు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో స్వయంగా తెలియజేశారు. సుశీల్ కుమార్ మోదీ బీహార్ ఉప ముఖ్యమంత్రిగానే కాకుండా రాజ్యసభ ఎంపీగా కూడా పనిచేశారు. ఆయన తన 33 సంవత్సరాల రాజకీయ జీవితంలో  రాజ్యసభ, లోక్‌సభ, శాసన మండలి, శాసనసభతో సహా మొత్తం నాలుగు సభలలో సభ్యునిగా కొనసాగారు. ఐదేళ్లపాటు శాసనమండలిలో ప్రతిపక్ష నేతగా కూడా వ్యవహరించారు. 

సుశీల్ కుమార్ మోదీ బీహార్ ఉప ముఖ్యమంత్రిగానూ, ఆర్థిక మంత్రిగా కూడా ఉన్నారు. నాటి ఎమర్జెన్సీ రోజ్లులో 19 నెలల పాటు జైలు జీవితం గడిపారు. ఆయన వరుసగా 15 ఏళ్లపాటు ఎమ్మెల్యేగా  ఉన్నారు. తొమ్మిదేళ్ల పాటు శాసన మండలి సభ్యునిగా ఉన్నారు. లోక్‌సభలో భాగల్‌పూర్ పార్లమెంటరీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. రాజ్యసభ సభ్యుడైన తర్వాత, సభలోని లా అండ్ జస్టిస్ కమిటీకి ఛైర్మన్‌గానూ వ్యవహరించారు.

తాను ఆరు నెలలుగా క్యాన్సర్‌తో బాధపడుతున్నానని సుశీల్ కుమార్ మోదీ ఆ పోస్ట్‌లో  పేర్కొన్నారు. ఇప్పుడు తన అనారోగ్యం గురించి ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. తాను లోక్‌సభ ఎన్నికల కోసం ఏమీ చేయలేనని, అన్ని విషయాలు ప్రధానికి తెలియజేశానని దానిలో పేర్కొన్నారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement