diagnose diseases
-
క్యాన్సర్ బారిన సుశీల్ కుమార్ మోదీ!
బీహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోదీ తాను గత ఆరు నెలలుగా క్యాన్సర్‌తో పోరాడుతున్నట్లు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో స్వయంగా తెలియజేశారు. సుశీల్ కుమార్ మోదీ బీహార్ ఉప ముఖ్యమంత్రిగానే కాకుండా రాజ్యసభ ఎంపీగా కూడా పనిచేశారు. ఆయన తన 33 సంవత్సరాల రాజకీయ జీవితంలో రాజ్యసభ, లోక్‌సభ, శాసన మండలి, శాసనసభతో సహా మొత్తం నాలుగు సభలలో సభ్యునిగా కొనసాగారు. ఐదేళ్లపాటు శాసనమండలిలో ప్రతిపక్ష నేతగా కూడా వ్యవహరించారు. సుశీల్ కుమార్ మోదీ బీహార్ ఉప ముఖ్యమంత్రిగానూ, ఆర్థిక మంత్రిగా కూడా ఉన్నారు. నాటి ఎమర్జెన్సీ రోజ్లులో 19 నెలల పాటు జైలు జీవితం గడిపారు. ఆయన వరుసగా 15 ఏళ్లపాటు ఎమ్మెల్యేగా ఉన్నారు. తొమ్మిదేళ్ల పాటు శాసన మండలి సభ్యునిగా ఉన్నారు. లోక్‌సభలో భాగల్పూర్ పార్లమెంటరీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. రాజ్యసభ సభ్యుడైన తర్వాత, సభలోని లా అండ్ జస్టిస్ కమిటీకి ఛైర్మన్‌గానూ వ్యవహరించారు. తాను ఆరు నెలలుగా క్యాన్సర్‌తో బాధపడుతున్నానని సుశీల్ కుమార్ మోదీ ఆ పోస్ట్‌లో పేర్కొన్నారు. ఇప్పుడు తన అనారోగ్యం గురించి ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. తాను లోక్‌సభ ఎన్నికల కోసం ఏమీ చేయలేనని, అన్ని విషయాలు ప్రధానికి తెలియజేశానని దానిలో పేర్కొన్నారు. पिछले 6 माह से कैंसर से संघर्ष कर रहा हूँ । अब लगा कि लोगों को बताने का समय आ गया है । लोक सभा चुनाव में कुछ कर नहीं पाऊँगा । PM को सब कुछ बता दिया है । देश, बिहार और पार्टी का सदा आभार और सदैव समर्पित | — Sushil Kumar Modi (मोदी का परिवार ) (@SushilModi) April 3, 2024 -
బీపీని కరెక్ట్‌గానే చెక్ చేస్తున్నారా? రోజూ మాత్రలు వేసుకోనవసరం లేదా..?
ఇప్పుడు ఎవర్నీ కదలించినా బీపీ ఉందని చెబుతుంటారు. నిజానికి అంతమందికి బీపీ ఉందా? కరెక్ట్‌గానే వైద్యులు చెక్ చేస్తున్నారా?. అస్సలు బీపీకి ప్రతి రోజు మాత్రలు వేసుకోవాల్సిందేనా? అధ్యయనాలు ఏం చెబుతున్నాయి తదితరాల గురించే ఈ కథనం!. రక్తపోటు లేదా బీపీ అనేది సర్వసాధారణమైన వ్యాధిలా అయిపోయింది. దేని గురించి అయినా ఆస్పత్రికి వెళ్తే..ముందుగా బీపీ చెక్ చేయడం కామన్ కూడా. నిజంగా కరెక్ట్‌గానే చెక్ చేస్తున్నారా? అంటే?. అదంతా అవాస్తమనే చెబుతున్నాయి తాజా అధ్యయనాలు. ఏటా 10 లక్షల మందికిపైగా అధిక రక్తపోటు ఉందని నిర్థారణ అవుతోంది. కానీ ఇదంతా వాస్తవం కాదని, వేలాది మందికిపైగా బీపీని తప్పుగా నిర్ధారణ అవుతున్నట్లు కొలంబస్‌లోని ఒహియో స్టేట్ పరిశోధకులు చెబుతున్నారు. ఈ మేరకు కొలంబస్‌లోని ఒహియా యూనివర్సిటీ పరిశోధకులు అమెరికన్ హార్ట్ అసోసియేషన్ అండ్ అమెరికన్ కాలేజ్ ఆఫ్ కార్డియాలజిస్ట్‌లతో కలసి జరిపిన తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఈ బీపీ పరీక్షలు చాలా తప్పు విధానంలో నిర్వహిస్తున్నట్లు పరిశోధనల్లో తేలింది. అందుకోసం ఒహియో పరిశోధకులు దాదాపు 150 సముహాల వారిగా పెద్దవాళ్లను తీసుకుని జరిపిన అధ్యయనంలో ఈ షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి. రోగిని ఆమోదయోగ్యమైన కూర్చిలో కూర్చొబెట్టి గుండె స్థానానికి సమాంతర స్థాయిలో చేయిని ఉంచి రీడింగ్‌ని తీసుకోవాలి కానీ అలా జరగడం లేదని పరిశోధనల్లో తేలింది. చాలమంది పేషెంట్లకు తప్పుగా బీపీని రికార్డు చేస్తున్నారని. ఇది అత్యంత ప్రమాదకరమని అన్నారు. ఒకవేళ పేషెంట్‌కి బీపీ నార్మల్‌గా ఉన్నా..ట్యాబ్లెట్లు ఇస్తే అది అధిక రక్తపోటుకి లేదా వివిధ దుష్ప్రభావాలకు దారితీసే ప్రమాదం ఉంటుందని హెచ్చరిస్తున్నారు పరిశోధకులు. తమ అధ్యయనంలో చాలామందికి తప్పుగా బీపీని గుర్తించారని, పైగా అధికంగా మందులను కూడా వైద్యులు సూచించినట్లు వెల్లడైందని పరిశోధకులు తెలిపారు. ఈ కారణాల వల్లే యూఎస్‌లో దాదాపు సగం మందికి పైగా పెద్దలు అధిక రక్తపోటుతో బాధపడుతున్నట్లు చెప్పుకొచ్చారు. చాలావరకు బీపీకి మందులను కూడా విపరీతంగా వాడాల్సిన అవసరం లేకుండా ఆరోగ్యకరమైన రీతిలో తగ్గించుకోవచ్చని తెలిపారు పరిశోధకుఉల. తప్పుగా బీపీని రికార్డు చేయడం, దీనికి తోడు మందులను వాడించటం వల్ల చాలమంది ప్రజలు వివిధ రకాల అనారోగ్యాల బారిన పడుతున్నట్ల తెలిపారు. ఇక మందులు బీపీకి అదేపనిగా వాడాల్సిన అవసరం లేదా? విరామం ఇవ్వొచ్చా అంటే? అంతలా అవసరం లేదనే చెబుతున్నాయి అధ్యయనాలు. అంతేగాదు త్వరలో కంటిన్యూగా మందులు వాడాలసిన అవసరం లేకుండానే సరికొత్త ఔషధాన్ని అందుబాటులోకి తేనట్లు కూడా చెప్పుకొచ్చారు. బీపీకి రోజూ మందులు వేసుకోనక్కర్లేదా? బీపీ అనేది దీర్ఘకాలిక వ్యాధి. దీనికి ప్రతిరోజు టెన్షన్‌గా ఓ ట్యాబ్లెట్ వేసుకోవాల్సిందే అందరికీ తెసిందే. అందులోనూ హైబీపీ అంటే ఇక చెప్పాల్సిన అవసరం లేదు. రోజూకి కనీసం ఒకటి నుంచి రెండు ట్యాబ్లెట్లు తీసుకోవాల్సిందే. కానీ పరిశోధకులు కనిపెట్టిన ఈ కొత్త రకం ఔషధం 'జిలేబేసిరాన్' ఆ సమస్యలన్నింటికి చెక్ పెడుతుందట. కనీసం మూడు నుంచి ఆరు నెలల వరకు హైబీపీని సమర్ధవంతంగా నియంత్రించడమే గాక ప్రభావంతంగా పనిచేస్తుంది. దీని వల్ల తరుచుగా మందులు వేసుకోవడం, దాని వల్ల ఎదురయ్యే దుష్ప్రభావాల నుంచి రోగులకు ఉపశమనం లభించినట్లు అవుతుందని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. ఈ రక్తపోటు అదుపులో లేకపోతే రోగులు స్ట్రోక్, గుండెపోటు లేదా హృదయనాళాలకు సంబంధిత రుగ్మతల బారినపడి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంటుంది. అందువల్ల పేషెంట్లు బీపీ ట్యాబ్లెట్న్ కంప్లసరీ తమ పక్కనే పెట్టుకుంటుంటారు, టెన్షన్‌గా రోజూ వేసేసుకుంటారు. ఇక ఆ ఇబ్బంది నుంచి బయటపడొచ్చు ఈ సరికొత్త డ్రగ్‌తో. ఇది సమర్థవంతంగా హైబీపి నియంత్రించి సమ స్థాయలో ఉండేలా చేస్తుంది. మనం కనీసం మూడు నుంచి ఆరు నెలల వరకు మాత్రలు లేకుండా గడపొచ్చు. (చదవండి: మధుమేహాన్ని ఎలా నియంత్రించాలి? గ్లూకోజ్ స్థాయిలు పెరగకూడదంటే..) -
పాంక్రియాటైటిస్ నుంచి కోలుకోవడం సాధ్యమే..
పాంక్రియాటైటిస్ అంటే పాంక్రియాస్ గ్రంథి అనారోగ్యం పాలుకావడం, ఇరిటేషన్‌కు, వాపుకు లోను కావడం అన్నమాట. పాంక్రియాస్ అంటే క్లోమ గ్రంథి. మనకు చిరపరిచితమైన డయాబెటిస్ వ్యాధి ఈ గ్రంథి పనితీరు లోపించడం వల్లనే వస్తుంది. పాంక్రియాస్ పనితీరు లోపం నుంచి పాంక్రియాటైటిస్‌కు దారి తీయడానికి అనేక కారణాలుంటాయి. వాటిలో ఆల్కహాలు సేవనం మితిమీరడం వల్ల కలిగే గాల్‌స్టోన్స్ ప్రధాన కారణం. అయితే ఇది అప్పటికప్పుడు ఎదురయ్యే అనారోగ్య సూచన కాదు, దీర్ఘకాలికంగా కొనసాగడంతో పాంక్రియాస్ పూర్తిగా దెబ్బతినడం వల్ల ఎదురయ్యే సమస్య. పాంక్రియాటైటిస్... వస్తే ఏమవుతుంది? జీర్ణరసాలలోని ఆమ్లగుణాల కారణంగా పాంక్రియాస్ టిస్యూలు దెబ్బతింటాయి. పాంక్రియాస్ అతి సున్నితమై (ఓవర్ సెన్సిటైజ్), ఎర్రగా మారుతుంది. ఈ స్థితిలోకి మారిన పాంక్రియాస్ ఆమ్ల స్వభావం కలిగిన కణాలను, విషపూరితమైన వ్యర్థాలను విడుదల చేస్తుంది. అవి ఊపిరితిత్తులు, మూత్రపిండాలు, గుండెకు హాని కలిగిస్తాయి. పాంక్రియాటైటిస్‌లో అక్యూట్, క్రానిక్ దశలుంటాయి. ఎవరెవరికి వస్తుంది? పాంక్రియాటైటిస్ సమస్యను ఎక్కువగా దీర్ఘకాలంగా డయాబెటిస్తో బాధపడుతున్న మగవారిలోనే చూస్తుంటాం. గాల్‌స్టోన్స్ ఉన్న వారికి, మద్యపానం మితిమీరి తీసుకునే వారికి, ధూమపానం చేసేవారికి రిస్క్ ఎక్కువ. అలాగే ఒబేసిటీ, రక్తంలో ట్రై గ్లిజరైడ్స్ ఉన్న వారికి కూడా ప్రమాదం పొంచి ఉంటుంది. పాంక్రియాటైటిస్‌ను గుర్తించడం ఎలా? అక్యూట్ పాంక్రియాటైటిస్ని నిర్ధారించడానికి రక్తపరీక్ష చేస్తారు. ఇందులో జీర్ణక్రియకు దోహదం చేసే అమిలేజ్, లిపేజ్ అనే ఎంజైమ్‌ల స్థాయులను గుర్తిస్తారు. ఈ స్థాయులు ఎక్కువగా ఉంటే అక్యూట్ పాంక్రియాటైటిస్‌గా పరిగణిస్తారు. ∙అల్ట్రా సౌండ్ స్కానింగ్ లేదా కంప్యూటెడ్ టోమోగ్రఫీ (సీటీ స్కాన్) ఇమేజ్ ద్వారా పాంక్రియాస్ ఆకారాన్ని, సంభవించిన మార్పులను, గాల్ బ్లాడర్, బైల్ డక్ట్ (పైత్యరస నాళాలు)లను, వాటిలో ఏర్పడిన అపసవ్యతలను గమనిస్తారు. క్రానిక్ పాంక్రియాటైటిస్‌లో... సెక్రెటిన్: పాంక్రియాస్ పనితీరును క్షుణ్ణంగా పరిశీలించే పరీక్ష ►ఓరల్ గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ : ఇది పాంక్రియాస్ డ్యామేజ్ అయిందనే సందేహం వచ్చినప్పుడు చేస్తారు. చక్కెర స్థాయులను పాంక్రియాస్ ఎలా నిర్వహిస్తుందో తెలుసుకోవడం కోసం చక్కెర ద్రవం తాగక ముందు ఒకసారి, తాగిన తర్వాత ఒకసారి పరీక్షిస్తారు. స్టూల్ టెస్ట్ : ఆహారం ద్వారా అందిన కొవ్వులను కణాలుగా విభజించడంలో దేహం నిర్వీర్యమవుతున్నట్లు సందేహం కలిగినప్పుడు చేస్తారు. ∙ ఎండోస్కోపిక్ అల్ట్రాసౌండ్ : దీనినే ఎండోసోనోగ్రఫీ అని కూడా అంటారు. ఎండోస్కోప్ పరికరాన్ని గొంతులో నుంచి కడుపు, చిన్న పేవులు, పాంక్రియాస్ వరకు పంపిస్తారు. దానికి అమర్చిన కెమెరా ద్వారా పాంక్రియాస్, ట్యూబులు, లివర్, గాల్ బ్లాడర్, పైత్యరస నాళాలను పరిశీలిస్తారు. ∙ఈఆర్సీపీ (ఎండోస్కోపిక్ రెట్రోగ్రేడ్ కొలాంజియోపాంక్రియాటోగ్రఫీ) : ఇది కూడా ఎండోస్కోపీలాగానే చేస్తారు. అయితే ఇందులో పరీక్షతోపాటు పాక్షికంగా చికిత్స కూడా జరిగిపోతుంది. ఈ పరీక్షలో పాంక్రియాస్, వాటి ట్యూబుల లోపలి భాగాలను కూడా పరిశీలిస్తారు. పాంక్రియాస్లో కానీ బైల్ డక్ట్‌లో కానీ ఏదైనా అడ్డంకులు కనిపిస్తే వాటిని పరీక్ష సమయంలోనే తొలగిస్తారు. నివారణ ఎలా? ఆరోగ్యకరమైన జీవనవిధానమే ప్రధానం. క్రమం తప్పకుండా వ్యాయామం, ఆరోగ్యకరమైన ఆహారం, మందులు తీసుకుంటూ ధూమపానం, మద్యపానం మానేస్తే క్లోమం తిరిగి ఆరోగ్యవంతం అవుతుంది. పాంక్రియాస్... ఎక్కడ ఉంటుంది? ఇది పొట్టకు పై భాగంలో చిన్న పేగు మొదలయ్యే చోట ఉంటుంది. ఈ గ్రంథికు అనుసంధానమై ఉండే ట్యూబ్ ద్వారా జీర్ణరసాలు చిన్నపేగులోకి ప్రవహిస్తాయి. ఇది ఏయే పనులు చేస్తుంది? దీని ప్రధాన కర్తవ్యం జీర్ణరసాలను ఉత్పత్తి చేసి విడుదల చేయడం, ఇన్సులిన్ హార్మోన్‌ను విడుదల చేయడం. జీర్ణ రసాలు ఆహారంలోని కార్బొహైడ్రేట్లు, ప్రొటీన్లు, కొవ్వును వేరు చేసి జీర్ణప్రక్రియ సక్రమంగా జరగడానికి దోహదం చేస్తాయి. ఇన్సులిన్ రక్తంలో చక్కెర స్థాయులను క్రమబద్ధం చేస్తుంది. దేహానికి శక్తిని విడుదల చేస్తూ కొంత శక్తిని నిల్వ చేసుకుంటుంది. పాంక్రియాటైటిస్ లక్షణాలు ఇలా... పాంక్రియాటైటిస్ రకాన్ని బట్టి (అక్యూట్, క్రానిక్) లక్షణాలు కొద్దిగా మారుతుంటాయి. అక్యూట్ పాంక్రియాటైటిస్‌లో... ∙పొట్ట పై భాగం (అప్పర్ అబ్డామిన్)లో ఒక మోస్తరు నుంచి తీవ్రమైన నొప్పి మొదలవుతుంది. ఈ నొప్పి వెన్ను వరకు పాకుతుంది. ∙నొప్పి ఒక్కోసారి అకస్మాత్తుగా వచ్చి తగ్గుతుంది. కొన్నిసార్లు కొద్దిరోజులు కొనసాగుతుంది -
ఇక నుంచి కరోనాను నిమిషాల్లో గుర్తించవచ్చు.. ఎలాగంటారా..
లండన్: కరోనా మహమ్మారి ప్రపంచాన్ని కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది. ప్రస్తుతం థర్డ్‌వేవ్ విజృంభణకు ప్రపంచదేశాలు వణికిపోతున్నాయి. మరోవైపు కొత్తగా పుట్టుకొస్తున్న భిన్నరకాల వేరియంట్లు మానవ మనుగడకు ముప్పుగా పరిణమించాయి. అయితే, శాస్త్రవేత్తలు కరోనాను ఎదుర్కొవడానికి కొత్త కొత్త ప్రయోగాలు చేస్తున్నారు. వివిధ రకాల వ్యాక్సిన్లపై ఇప్పటికి ప్రయోగాలు నిర్వహిస్తున్నారు. ప్రపంచదేశాలు ప్రధానంగా.. కరోనాను గుర్తించడానికి ర్యాపిడ్ ఆంటిజెన్, ఆర్టీపీసీఆర్లను పరీక్షలు నిర్వహిస్తున్నాయి. వీటితో చాలా వరకు వ్యక్తిలో వైరస్ ఉన్నది.. లేనిది నిర్ధారణ అవుతుంది. కొన్నిసార్లు టెస్ట్‌ల సంఖ్య పెరగడంతో ఆర్టీపీసీఆర్ ఫలితాలు రావడానికి సమయం పడుతుంది. దీంతో ఆయా వ్యక్తులు ఫలితం వచ్చేవరకు ఒకింత ఒత్తిడికి లోనవుతున్నారు. తాజాగా, యూకేకు చెందిన శాస్త్రవేత్తలు ఒక తీపి కబురు అందించారు. ఇక నుంచి కరోనాను కేవలం కొన్ని నిమిషాల వ్యవధిలోనే నిర్ధారించవచ్చని తెలిపారు. దీనితో.. ఒక వ్యక్తి పాజిటివ్‌గా ఉన్నాడా లేదా అన్నదానిని ఎక్స్‌రే టెక్నిక్‌ను ఉపయోగించి కొన్ని నిమిషాల వ్యవధిలోనే సులభంగా గుర్తించవచ్చు. ఇది ఆర్టీపీసీఆర్ స్థానాన్ని భర్తీ చేస్తుందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు. యూకే శాస్త్రవేత్తల ప్రకారం.. కొత్త ఎక్స్‌రే విధానంలో ఖచ్చితంగా, తక్కువ సమయంలో కరోనాను నిర్ధారించవచ్చని తెలిపారు. దీనితో వేచి ఉండే సమయం తగ్గుతుందని పేర్కొన్నారు. దీని కోసం శాస్త్రవేత్తల బృందం కృత్రిమ మేధస్సును ఉపయోగించినట్లు తెలిపారు. దీనికోసం కరోనాతో బాధపడుతున్న వారు, నిమోనియాలో బాధపడుతున్నవారు, ఆరోగ్యవంతుల్లోని ఎక్స్‌రే స్కాన్లను పరిశీలించినట్లు పేర్కొన్నారు. దాదాపు 3000 ఎక్స్‌రేలను చూశామని, వీటిలో కరోనా నిర్ధారణ 98 శాతం ఖచ్చితత్వంతో నిర్ధారించిందని పేర్కొన్నారు. యూనివర్సిటీ ఆఫ్ ది వెస్ట్ స్కాట్లాండ్ (యూడబ్ల్యూఎస్)లో ఒక బృందం ఈ సాంకేతికతను అభివృద్ధి చేసింది. దీనితో ఇక నుంచి టెస్ట్‌ల సంఖ్య పెంచుకోవచ్చు. ప్రపంచంలో చాలా చోట్ల వైరస్ విజృంభణతో కరోనా కిట్ల కొరత నెలకొంది. ఈ శాస్త్రవేత్తల బృందానికి నాయకత్వం వహించిన ప్రొఫెసర్ నయీమ్ రంజాన్ మాట్లాడుతూ.. ఇది కరోనాను వెంటనే నిర్ధారిస్తుందని తెలిపారు.ఇది ఆర్టీపీసీఆర్కు ఒక మంచి ప్రత్యామ్నాయంగా మారుతుందని తెలిపారు. ప్రపంచంలో కేసులు పెరగడం, రోగ నిర్ధారణ సాధనాల తక్కువడా ఉండటం వలన పెద్ద సంఖ్యలో కొవిడ్ పరీక్షలు నిర్వహించలేకపోతున్నాయని పేర్కొన్నారు. అయితే, కొత్త ఎక్స్ రే విధానంతో సులభంగా కరోనాను గుర్తించవచ్చని తెలిపారు. అయితే, ఎక్స్‌రే రేటియేషన్తో మానవునిపై ఎలాంటి ప్రభావం ఉండదని స్పష్టం చేశారు. ఈ కిరణాల విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వివరణ ఇచ్చారు. వైద్యులు కొవిడ్ పరీక్షల కోసం తక్కువ మోతాదులో రేటియేషన్ ఉపయోగిస్తారని తెలిపారు. అయితే, ఈ కొత్త సాంకేతికను ప్రజలు ఎంత వరకు స్వీకరిస్తారనేది భవిష్యత్తులో తెలుస్తుందని ప్రొఫెసర్ రంజన్ అభిప్రాయపడ్డారు. చదవండి: ప్రధాని మోదీ అరుదైన రికార్డు.. బైడెన్ కంటే -
ఏ వ్యాధినైనా షెర్లాక్తో పట్టేయొచ్చు..!
బోస్టన్: మానవశరీరంలోని వ్యాధులను కచ్చితత్వంతో గుర్తించే ప్రత్యేకమైన కాగితాన్ని అమెరికాకు చెందిన మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎంఐటీ) శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. షెర్లాక్(స్పెసిఫిక్ హై సెన్సిటివిటీ రిపోర్టర్ అన్లాకింగ్)గా పిలుస్తున్న ఈ కాగితాన్ని ఆర్ఎన్ఏ శాంపిల్స్‌లో ముంచడం ద్వారా శరీరంలో ఏయే రోగాలున్నాయో వెంటనే తెలుసుకోవచ్చని ఎంఐటీకి చెందిన ఫెంగ్ జెహాంగ్ తెలిపారు. షెర్లాక్ ద్వారా ట్యూమర్ డీఎన్ఏ, ఊపిరితిత్తుల కేన్సర్, జికా, డెంగ్యూ వైరస్‌లను గుర్తించగలిగామని వెల్లడించారు. షెర్లాక్లో ప్రధానంగా సీఏఎస్ 13 అనే ఎడిట్‌చేసిన ప్రొటీన్ ఉంటుందని ఫెంగ్ తెలిపారు. ఏదైనా శాంపిల్స్లోకి సీఏఎస్ 13ను ముంచినప్పుడు అందులోని రోగకారక క్రిముల ఆధారంగా ఈ ప్రొటీన్ ఆర్ఎన్ఏలుగా విడిపోతుందన్నారు. తద్వారా రోగికి ఏ వ్యాధి సోకిందో వెంటనే తెలుసుకోవచ్చని వెల్లడించారు.