లాలూ యాదవ్ కూతుళ్ళ పేర్ల వెనుక ఇంత హిస్టరీ ఉందా? | Do You Know The History Behind The Names Of Lalu Prasad Yadav Daughters, More Details Inside | Sakshi
Sakshi News home page

Lalu Yadav Daughters Names Secret: లాలూ యాదవ్ కూతుళ్ళ పేర్ల వెనుక ఇంత హిస్టరీ ఉందా?

Published Fri, May 17 2024 3:57 PM | Last Updated on Fri, May 17 2024 5:32 PM

History Behind The Names of Lalu Prasad Yadav Daughters

దేశంలో సార్వత్రిక ఎన్నికల పోరు జోరుగా సాగుతున్న తరుణంలో.. బీహార్‌లో మరో వారసత్వ పోరుకు తెరలేచింది. బీహార్‌ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన.. లాలూ ప్రసాద్‌ యాదవ్‌.. ఇప్పుడు తన కూతుళ్లను ఎన్నికల బరిలో నిలిపారు. వారే మిసా భారతి.. రోహిణి ఆచార్య. అసలు మిసా అంటే ఏమిటి..? రోహిణికి లాలూ ఆ పేరు ఎందుకు పెట్టారనే మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం.

బీహార్‌లో ఎన్డీఏ వర్సెస్ ఇండియా కూటమి మధ్య పోటీ నెలకొంది. ఈ ఎన్నికల్లో లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తెలు మీసా భారతి, రోహిణి ఆచార్య  పోటీ చేస్తున్నారు. దీంతో వీరి గురించి సోషల్‌ మీడియాలో జోరుగా చర్చలు సాగుతున్నాయి. వీరి పేర్ల వెనుక ఉన్న అర్థం ఏంటి..? అసలు లాలు యాదవ్‌ ఆ పేరు పెట్టడం వెనుక ఏమైనా స్టోరీ ఉందా అని నెటిజన్లు సోషల్ మీడియాలో తెగ సర్చ్ చేసేస్తున్నారు.

మిసా భారతి
1976 దేశంలో ఎమర్జెన్సీ విధించిన నాటి రోజులు. అప్పటి ప్రభుత్వం పలువురు నేతలను జైల్లో పెట్టింది. వారిలో  లాలూ ప్రసాద్ యాదవ్ కూడా ఉన్నారు. లాలూ ప్రసాద్ జైల్లో ఉన్నప్పుడే ఆయన భార్య రబ్రీదేవి కుమార్తెకు జన్మనిచ్చింది. అయితే.. ఎమర్జెన్సీ సమయంలో ప్రభుత్వాన్ని వ్యతిరేకించిన నేతలను, కార్యకర్తలను జైలులో పెట్టే చట్టాన్ని 'మిసా' అని పిలుస్తారు. దీంతో తానున్న పరిస్థితులను గుర్తు చేసుకుంటూ తన మొదటి  కుమార్తెకు లాలూ ప్రసాద్‌ యాదవ్‌ 'మిసా భారతి' అని పేరు పెట్టారు

రోహణి ఆచార్య
ఇక.. తన రెండో కూతురు రోహణి ఆచార్యకు ఒక వైద్యురాలి పేరు వచ్చేలా పెట్టారు లాలూ ప్రసాద్‌ యాదవ్‌. 1979లో లాలూ యాదవ్ భార్య రబ్రీ దేవి మరోసారి తల్లి అయ్యారు. అయితే.. ఆమెకు డెలివరీకి ముందు అనారోగ్య సమస్యలు తలెత్తాయి. దీంతో రబ్రీదేవీకి శస్త్రచికిత్స చేయాలని వైద్యులు నిర్ణయించారు. ఆపరేషన్‌ గురించి తెలిసి భయపడిన లాలూ యాదవ్‌కు డాక్టర్‌ కమలా ఆచార్య ధైర్యం చెప్పారు. ఆ తరువాత రబ్దీదేవికి విజయవంతంగా ఆపరేషన్ పూర్తి చేశారు.

ఆపరేషన్ పూర్తయిన తరువాత.. ఆపరేషన్‌కు అయిన ఖర్చును కూడా లాలూ యాదవ్‌ నుంచి తీసుకునేందుకు డాక్టర్‌ కమలా ఆచార్య ఒప్పుకోలేదు. అంతే కాకుండా రెండో కుమార్తె పుట్టిన నక్షత్రం రోహిణి కావడంతో.. డాక్టర్ పేరు, రోహిణి నక్షత్రం వచ్చేలా 'రోహిణి ఆచార్య' అని పేరుపెట్టారు. ప్రస్తుతం ఈ ఇద్దరు లోక్‌సభ ఎన్నికల్లో బరిలో నిలిచారు. మిసా భారతి పాటలీపుత్ర నుంచి పోటీ చేస్తుండగా.. రోహిణి ఆచార్య బీహార్‌లోని సారణ్‌ నుంచి బీజేపీ అభ్యర్థి రాజీవ్ ప్రతాప్‌పై పోటీ చేస్తున్నారు.

2013లో వరకు లాలూ ప్రసాద్‌ యాదవ్‌ సారణ్‌ సేట్‌కు ప్రాతినిథ్యం వహించారు. ఇప్పుడు అదే స్థానం నుంచి తన చిన్న కూతురు రోహిణి ఆచార్యను బరిలోకి దించారు. ఇక్కడ మే 20న పోలింగ్‌ జరగనుండగా.. పాటలీపుత్రలో జూన్‌ 1న పోలింగ్‌ జరగనుంది. పాటలిపుత్ర నుంచి పోటీ చేస్తున్న మిసా భారతి ఇప్పటికే రాజ్యసభ ఎంపీగా ఉన్నారు. అయితే.. లాలూ కూతుళ్లు ఇద్దరు ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడం మాత్రం ఇదే తొలిసారి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement