condoms supply
-
అక్కడ 25 ఏళ్లలోపు మహిళలకు కండోమ్స్ ఫ్రీ
పారిస్: లైంగిక వ్యాధుల బాధితుల సంఖ్య విపరీతంగా పెరగడంతో ఫ్రాన్స్ ప్రభుత్వం కొత్త ఆలోచన చేసింది. లైంగిక సాంక్రమిక వ్యాధుల (ఎస్టీడీ) నియంత్రణకు దేశంలో 25 ఏళ్లు, అంతకంటే తక్కువ వయసు వారికి 2023 జనవరి నుంచి ఉచితంగా కండోమ్స్ అందిస్తామని అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ శుక్రవారం ప్రకటించారు. వాటిని ఏ ఫార్మసీలోనైనా పొందొచ్చని చెప్పారు. పురుషులకు మాత్రం వాటిని ఉచితంగా ఇవ్వబోరు. ఫ్రాన్స్‌లో అదుపులోలేని ద్రవ్యోల్బణం కారణంగా ఖర్చులు పెరిగిపోయిన ఈ తరుణంలో అవాంఛిత గర్భం దాలిస్తే, అమ్మాయిలు, మహిళల ఆర్థిక కష్టాలు మరింత ఎక్కువయ్యే అవకాశముందని, అందుకే వారికే వీటిని ఉచితంగా అందివ్వనున్నారని తెలుస్తోంది. హెచ్ఐవీ, ఇతర లైంగిక వ్యాధుల నిర్ధారణ పరీక్షలు విస్తృత స్థాయిలో చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఫ్రాన్స్‌లో 2020, 2021 ఏడాదిలో లైంగిక సాంక్రమిక వ్యాధు(ఎస్టీడీ)లు ఏకంగా 30 శాతం పెరిగాయి. 2018లో ఫ్రాన్స్ ఒక పథకం తెచ్చింది. పౌరులు కండోమ్స్ కొనుగోలు చేస్తే వాటికయిన ఖర్చును ప్రభుత్వం తిరిగి చెల్లిస్తుంది. ఈ ఏడాది తొలినాళ్లలో 26 ఏళ్లలోపు మహిళలకు గర్భనిరోధకాలు ఉచితంగా పంపిణీచేసింది. డాక్టర్ ప్రిస్రిప్షన్ లేకుండానే 26 ఏళ్లలోపు మహిళలకు ఉచితంగా లైంగికవ్యాధి నిర్ధారణ పరీక్షలు చేస్తారు. ఫ్రాన్స్‌లో అబార్షన్ ఉచితంగా చేస్తారు. ఇదీ చదవండి: నమ్మకమే మార్గం.. మోసమే లక్ష్యం -
క్వారంటైన్ పూర్తి చేశాక కండోమ్ బహుమతి
పట్నా : క్వారంటైన్ గడువు పూర్తి చేసుకున్న వలస కార్మికుల్లో ఇప్పటి వరకు 17 లక్షల కండోమ్‌లను పంపిణీ చేసినట్లు ఉపముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోదీ బుధవారం ప్రకటించారు. కుటుంబ నియంత్రణను ప్రోత్సహించడానికి వైద్య ఆరోగ్యశాఖ ఇలా వినూత్న పద్దతిని ప్రారంభించిందన్నారు. ఇతర రాష్ర్టాల నుంచి లక్షలాది మంది వలస కూలీలు వచ్చారని, 14 రోజుల పాటు క్వారంటైన్లో ఉన్న కార్మికులకు గర్భనిరోధక మందులు, కండోమ్‌లతో కూడిన కిట్లను ప్రభుత్వం బహుమతిగా ఇచ్చిందని చెప్పారు. దీనికి సంబంధించి ఏప్రిల్ నెలలోనే 2.14 లక్షల కండోమ్‌లు పంపిణీ చేయగా, మే నెలలో 15.39 లక్షల కండోమ్‌లను పంపిణీ చేసినట్లు వివరించారు. అంతేకాకుండా రాష్ర్టంలోని అన్ని ప్రాథమిక కేంద్రాల్లో కండోమ్ సహా గర్భనిరోధక మందులు అందుబాటులో ఉంచామని, ఎవరికైనా అవసరం ఉంటే ఆయా కేంద్రాలను సంప్రదించవచ్చని తెలిపారు. డోర్ డెలివరీ ద్వారా ఇప్పటికే 11 లక్షల గర్భనిరోధక మందులు పంపిణీ చేశామని పేర్కొన్నారు. (పెళ్లి పీటలెక్కనున్న కేరళ సీఎం కుమార్తె) క్వారంటైన్లో ఉన్న వలస కూలీల కోసం బట్టలు, దోమతెరలు లాంటి ఇతర వస్తువులకి కలిపి రాష్ర్ట ప్రభుత్వం ఒక్కొక్కరిపై 5300 రూపాయిలు ఖర్చుచేసిందని సుశీర్ కుమార్ పేర్కొన్నారు. క్వారంటైన్ తర్వాత కూడా అదనంగా వెయ్యి రూపాయల నగదును అందించామని చెప్పారు. బాలికలు, మహిళా విద్యను ప్రోత్సహించేందుకు రాష్ర్ట ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల ద్వారా దశాబ్ధ కాలంలోనే బీహార్‌లో సంతానోత్పత్తి రేటు 4.3 నుంచి 3.2 శాతానికి తగ్గిందని మోదీ అన్నారు. (ఊరట : యాక్టివ్ కేసుల కంటే రికవరీలు అధికం ) -
జికాను అడ్డుకునే కండోమ్‌లు ఇస్తారట!
రియో డి జెనిరోలో ఈ సంవత్సరం జరగనున్న ఒలింపిక్స్‌లో పాల్గొనే ఆస్ట్రేలియా క్రీడాకారులకు జికా వైరస్‌ను అడ్డుకునే కండోమ్‌లు ఇవ్వబోతున్నారట. ఇందుకోసం ప్రపంచంలోనే నెంబర్ 2 కండోమ్ తయారీ కంపెనీ ఆన్సెల్ లిమిటెడ్‌తో ఆస్ట్రేలియా ఔషధ తయారీ కంపెనీ స్టార్ఫార్మా హోల్డింగ్స్ లిమిటెడ్ ఒప్పందం చేసుకుంది. మొత్తం ఆస్ట్రేలియా అథ్లెట్లు అందరికీ స్టార్ ఫార్మా వాళ్ల వివాజెల్తో లూబ్రికేట్ చేసిన డ్యూయల్ ప్రొటెక్షన్ కండోమ్స్ ఇస్తామని చెబుతున్నారు. శృంగారం ద్వారా జికా వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉందని, తాము తయారుచేసిన వివాజెల్ ఈ వైరస్‌ను సమర్థంగా అడ్డుకుంటుందని స్టార్ ఫార్మా సీఈవో జాకీ ఫైర్లీ తెలిపారు. ఇప్పటికే ఒలింపిక్ గ్రామానికి కొన్ని కండోమ్‌లను పంపామని, వీటితోపాటు ఇప్పుడు కొత్తవాటిని కూడా పంపుతామని ఆస్ట్రేలియా ఒలింపిక్ కమిటీ తెలిపింది. వీటితోపాటు ఒలింపిక్ గ్రామంలో కొన్ని కండోమ్ డిస్పెన్సింగ్ మిషన్లను ఏర్పాటు చేస్తున్నారు. వాటిద్వారా 3.50 లక్షల పురుషుల కండోమ్‌లు, లక్ష మహిళల కండోమ్‌లు అథ్లెట్లకు ఉచితంగా అందిస్తారు. రియో నుంచి తిరిగి వచ్చే అథ్లెట్లకు తప్పనిసరిగా రక్తపరీక్షలు చేయించాలన్న నిబంధనలు ఉన్నట్లు వచ్చిన కథనాలను ఏఓసీ ఖండించింది.