
పారిస్: లైంగిక వ్యాధుల బాధితుల సంఖ్య విపరీతంగా పెరగడంతో ఫ్రాన్స్ ప్రభుత్వం కొత్త ఆలోచన చేసింది. లైంగిక సాంక్రమిక వ్యాధుల (ఎస్‌టీడీ) నియంత్రణకు దేశంలో 25 ఏళ్లు, అంతకంటే తక్కువ వయసు వారికి 2023 జనవరి నుంచి ఉచితంగా కండోమ్స్ అందిస్తామని అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ శుక్రవారం ప్రకటించారు. వాటిని ఏ ఫార్మసీలోనైనా పొందొచ్చని చెప్పారు. పురుషులకు మాత్రం వాటిని ఉచితంగా ఇవ్వబోరు. ఫ్రాన్స్‌లో అదుపులోలేని ద్రవ్యోల్బణం కారణంగా ఖర్చులు పెరిగిపోయిన ఈ తరుణంలో అవాంఛిత గర్భం దాలిస్తే, అమ్మాయిలు, మహిళల ఆర్థిక కష్టాలు మరింత ఎక్కువయ్యే అవకాశముందని, అందుకే వారికే వీటిని ఉచితంగా అందివ్వనున్నారని తెలుస్తోంది.
హెచ్‌ఐవీ, ఇతర లైంగిక వ్యాధుల నిర్ధారణ పరీక్షలు విస్తృత స్థాయిలో చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఫ్రాన్స్‌లో 2020, 2021 ఏడాదిలో లైంగిక సాంక్రమిక వ్యాధు(ఎస్‌టీడీ)లు ఏకంగా 30 శాతం పెరిగాయి. 2018లో ఫ్రాన్స్ ఒక పథకం తెచ్చింది. పౌరులు కండోమ్స్ కొనుగోలు చేస్తే వాటికయిన ఖర్చును ప్రభుత్వం తిరిగి చెల్లిస్తుంది. ఈ ఏడాది తొలినాళ్లలో 26 ఏళ్లలోపు మహిళలకు గర్భనిరోధకాలు ఉచితంగా పంపిణీచేసింది. డాక్టర్ ప్రిస్రిప్షన్ లేకుండానే 26 ఏళ్లలోపు మహిళలకు ఉచితంగా లైంగికవ్యాధి నిర్ధారణ పరీక్షలు చేస్తారు. ఫ్రాన్స్‌లో అబార్షన్ ఉచితంగా చేస్తారు.
ఇదీ చదవండి: నమ్మకమే మార్గం.. మోసమే లక్ష్యం
Comments
Please login to add a commentAdd a comment