
ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయేల్ మాక్రాన్(ఫైల్ ఫొటో)
పారిస్ : ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ (42) కరోనా వైరస్ బారిన పడ్డారు. వైరస్ లక్షణాలు కనిపించడంతో పరీక్షలు చేయించుకోగా ఆయనకు పాటిజివ్‌గా నిర్థారణ అయింది. దీంతో మాక్రాన్ వారంపాటు ఐసోలేషన్‌లో ఉండనున్నారు. ఈ మేరకు ఎలీసీ ప్యాలెస్ అధికారిక ప్రకటన విడుదల చేసింది. కాగా ఫ్రాన్స్‌లో కరోనా కేసులు పెరుగుతుండటంతో వారం పాటు రాత్రిపూట కర్ఫ్యూ విధించారు. ఇక కరోనా వ్యాప్తి మొదలైన నాటి నుంచి దేశంలో ఇప్పటివరకు రెండు మిలియన్ల మందికి వైరస్ సోకింది. మహమ్మారి బారిన పడి 59,400 మందికి పైగా మరణించారు.(చదవండి: ఫ్రాన్స్‌లో భద్రతా బిల్లుపై జనాగ్రహం)
Comments
Please login to add a commentAdd a comment