Immanuel Macron
-
భారత్‌లో ఆ దేశాధ్యక్షుడు.. కీలక ప్రకటన చేసిన టీసీఎస్
భారత గణతంత్ర దినోత్సవ ముఖ్య అతిథిగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ దేశంలో పర్యటిస్తున్న వేళ దేశీయ ఐటీ దిగ్గజం టీసీఎస్ కీలక ప్రకటన చేసింది. ఫ్రాన్స్‌లో వచ్చే మూడేళ్లలో ఉద్యోగుల సంఖ్యను రెట్టింపు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు టీసీఎస్ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. అతిపెద్ద భారతీయ ఐటీ సేవల సంస్థ టీసీఎస్‌కు ప్రస్తుతం ఫ్రాన్స్‌లోని నాలుగు ప్రధాన కేంద్రాల్లో 1,600 మంది ఉద్యోగులు ఉన్నారు. టీసీఎస్‌కు యూరప్‌లో వేగంగా అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో ఫ్రాన్స్ కూడా ఒకటి. యూరప్‌లోని ఇతర దేశాల కంటే ఫ్రాన్స్‌లో కంపెనీ వేగంగా వృద్ధి చెందుతోందని టీసీఎస్ యూరోపియన్ బిజినెస్ హెడ్ సప్తగిరి చాపలపల్లి పీటీఐతో పేర్కొన్నారు. ఫ్రాన్స్‌లో టీసీఎస్ మూడు దశాబ్దాలకు పైగా ఉనికిలో ఉందని రానున్న రోజుల్లో వ్యాపారాన్ని మరింత వేగవంతంగా వృద్ధి చేసేందుకు గ్రౌండ్‌వర్క్ సిద్ధమైనట్లు సప్తగిరి చెప్పారు. స్థానిక ఆర్థిక వ్యవస్థకు కీలకమైన అన్ని ప్రధాన రంగాలలో 80 ఫ్రెంచ్ క్లయింట్లతో టీసీఎస్ పని చేస్తోందని, పారిస్‌లో ఒక ఆవిష్కరణ కేంద్రాన్ని కూడా నడుపుతోందని వివరించారు. టీసీఎస్‌కు ఫ్రాన్స్‌లో ఉన్న 1,600 మంది ఉద్యోగుల్లో ఎక్కువ మంది పారిస్‌లో ఉన్నారు. వీరిలో 60 శాతం వరకు ఫ్రెంచ్ పౌరులు. కాగా అక్కడే ప్రధాన కార్యాలయం ఉన్న ప్రత్యర్థి కంపెనీ క్యాప్‌జెమినీ ఫ్రెంచ్ మార్కెట్లో బలంగా ఉంది. అయితే టీసీఎస్ తన సొంత బలంతో అభివృద్ధి చెందుతుందని టీసీఎస్ యూరోపియన్ బిజినెస్ హెడ్ పేర్కొన్నారు. -
అక్కడ 25 ఏళ్లలోపు మహిళలకు కండోమ్స్ ఫ్రీ
పారిస్: లైంగిక వ్యాధుల బాధితుల సంఖ్య విపరీతంగా పెరగడంతో ఫ్రాన్స్ ప్రభుత్వం కొత్త ఆలోచన చేసింది. లైంగిక సాంక్రమిక వ్యాధుల (ఎస్టీడీ) నియంత్రణకు దేశంలో 25 ఏళ్లు, అంతకంటే తక్కువ వయసు వారికి 2023 జనవరి నుంచి ఉచితంగా కండోమ్స్ అందిస్తామని అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ శుక్రవారం ప్రకటించారు. వాటిని ఏ ఫార్మసీలోనైనా పొందొచ్చని చెప్పారు. పురుషులకు మాత్రం వాటిని ఉచితంగా ఇవ్వబోరు. ఫ్రాన్స్‌లో అదుపులోలేని ద్రవ్యోల్బణం కారణంగా ఖర్చులు పెరిగిపోయిన ఈ తరుణంలో అవాంఛిత గర్భం దాలిస్తే, అమ్మాయిలు, మహిళల ఆర్థిక కష్టాలు మరింత ఎక్కువయ్యే అవకాశముందని, అందుకే వారికే వీటిని ఉచితంగా అందివ్వనున్నారని తెలుస్తోంది. హెచ్ఐవీ, ఇతర లైంగిక వ్యాధుల నిర్ధారణ పరీక్షలు విస్తృత స్థాయిలో చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఫ్రాన్స్‌లో 2020, 2021 ఏడాదిలో లైంగిక సాంక్రమిక వ్యాధు(ఎస్టీడీ)లు ఏకంగా 30 శాతం పెరిగాయి. 2018లో ఫ్రాన్స్ ఒక పథకం తెచ్చింది. పౌరులు కండోమ్స్ కొనుగోలు చేస్తే వాటికయిన ఖర్చును ప్రభుత్వం తిరిగి చెల్లిస్తుంది. ఈ ఏడాది తొలినాళ్లలో 26 ఏళ్లలోపు మహిళలకు గర్భనిరోధకాలు ఉచితంగా పంపిణీచేసింది. డాక్టర్ ప్రిస్రిప్షన్ లేకుండానే 26 ఏళ్లలోపు మహిళలకు ఉచితంగా లైంగికవ్యాధి నిర్ధారణ పరీక్షలు చేస్తారు. ఫ్రాన్స్‌లో అబార్షన్ ఉచితంగా చేస్తారు. ఇదీ చదవండి: నమ్మకమే మార్గం.. మోసమే లక్ష్యం -
కరోనా బారిన ఇమాన్యుయేల్ మాక్రాన్
పారిస్ : ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ (42) కరోనా వైరస్ బారిన పడ్డారు. వైరస్ లక్షణాలు కనిపించడంతో పరీక్షలు చేయించుకోగా ఆయనకు పాటిజివ్‌గా నిర్థారణ అయింది. దీంతో మాక్రాన్ వారంపాటు ఐసోలేషన్‌లో ఉండనున్నారు. ఈ మేరకు ఎలీసీ ప్యాలెస్ అధికారిక ప్రకటన విడుదల చేసింది. కాగా ఫ్రాన్స్‌లో కరోనా కేసులు పెరుగుతుండటంతో వారం పాటు రాత్రిపూట కర్ఫ్యూ విధించారు. ఇక కరోనా వ్యాప్తి మొదలైన నాటి నుంచి దేశంలో ఇప్పటివరకు రెండు మిలియన్ల మందికి వైరస్ సోకింది. మహమ్మారి బారిన పడి 59,400 మందికి పైగా మరణించారు.(చదవండి: ఫ్రాన్స్‌లో భద్రతా బిల్లుపై జనాగ్రహం) -
నా పిల్లలకు ఈ మాట చెప్పండి..
పారిస్/నైస్: మతోన్మాద శక్తులను శక్తులను ఉపేక్షించే ప్రసక్తే లేదని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయేల్ మాక్రాన్ హెచ్చరించారు. తమ దేశం విలువలను విడనాడదని, అయితే అదే సమయంలో తీవ్రవాద చర్యలను ఖండిస్తుందని పేర్కొన్నారు. విపత్కర పరిస్థితుల్లో ప్రజలంతా ఐకమత్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. కాగా నైస్ సిటీలోని నాట్రిడేమ్ చర్చిలో ఓ దుండగుడు కత్తితో దాడి చేయడంతో ముగ్గురు మహిళలు మరణించిన విషయం విదితమే. వీరిలో ఓ మహిళ తల తెగిపడటంతో ఘటనాస్థలం హాహాకారాలతో దద్దరిల్లింది. ట్యునీషియా నుంచి ఫ్రాన్స్‌కు వలస వచ్చిన వ్యక్తే ఈ ఘాతుకానికి పాల్పడినట్లుగా భావిస్తున్నట్లు స్థానిక మీడియా వెల్లడించింది.(చదవండి: సెకండ్ వేవ్ మొదలైంది.. మళ్లీ లాక్డౌన్ ) ఇక ఈ దారుణ ఘటనలో మృతి చెందిన ముగ్గురిలో ఒకరు బ్రెజిలియన్(44) అని పేర్కొంది. చర్చి నుంచి రెస్టారెంటుకు పరుగులు తీస్తున్న క్రమంలో దుండగుడి దాడిలో తీవ్రంగా గాయపడిన ఆమె.. ‘‘నేను వాళ్లను ఎంతగానో ప్రేమిస్తున్నానని నా పిల్లలకు చెప్పండి’’అంటూ ప్రాణాలు విడిచిందని మీడియా తెలిపింది. కాగా ఈ ఘటనను తీవ్రంగా ఖండించిన నైస్ నగర మేయర్ క్రిస్టియన్ ఎస్ట్రోసీ, పోలీసులతో జరిగిన పెనుగులాటలో దుండగుడు గాయపడ్డాడని తెలిపారు. ఆస్పత్రికి తరలిస్తున్న సమయంలోనూ అతడు దేవుడి పేరిట నినాదాలు చేశాడని చెప్పుకొచ్చారు. కాగా ఓవైపు కరోనా విజృంభణ, మరోవైపు వరుస తీవ్రవాద చర్యలతో ఫ్రాన్స్ ప్రజలు వణికిపోతున్నారు. దేశంలో సెకండ్ వేవ్ మొదలైన నేపథ్యంలో రెండో దఫా లాక్డౌన్ విధించిన విషయం తెలిసిందే.(చదవండి: ఫ్రాన్స్ చర్చిలో కత్తితో దాడి) మాక్రాన్ వ్యాఖ్యలపై ఆగ్రహం! అక్టోబర్ మొదటి వారంలో మహమ్మద్ ప్రవక్త వివాదాస్పద కార్టూన్లను విద్యార్ధులకు చూపిస్తున్నారన్న ఆరోపణలతో ఓ ముస్లిం యువకుడు ఒక ఫ్రెంచ్ టీచర్‌ను హతమార్చిన విషయం విదితమే. ఈ విషయంపై స్పందించిన ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్.. “ ఫ్రాన్స్‌లోని 60 లక్షలమంది ముస్లింలు ప్రధాన జీవన స్రవంతి నుంచి దూరంగా జరుగుతున్నట్లు కనిపిస్తోంది. అసలు ఇస్లాం మతమే సంక్షోభంలో ఉంది’’ అని వ్యాఖ్యానించారు. దీంతో ఇస్లాం దేశాలు మాక్రాన్‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తాయి. మాక్రాన్ వ్యాఖ్యలకు నిరసనగా ఫ్రాన్స్‌లో తయారైన వస్తువుల నిషేధానికి పిలుపునిచ్చాయి. ఈ మేరకు అంతర్జాతీయ మీడియా కథనం వెలువరించింది. -
సెకండ్ వేవ్ మొదలైంది.. మళ్లీ లాక్డౌన్
పారిస్: మహమ్మారి కరోనా అత్యంత ప్రభావిత దేశాల్లో ఒకటైన ఫ్రాన్స్‌లో మరోసారి లాక్డౌన్ విధించారు. కోవిడ్-19 వ్యాప్తిని కట్టడి చేసేందుకు డిసెంబరు 1 వరకు నిబంధనలు అమల్లో ఉంటాయని ఆ దేశ అధ్యక్షుడు ఇమాన్యుయేల్ మాక్రాన్ బుధవారం ప్రకటించారు. దేశంలో వైరస్ వేగంగా విస్తరిస్తోందని, పరిస్థితులు చేయి దాటిపోయే పరిస్థితి కనిపిస్తోందని, ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ.. ‘‘యూరప్‌లోని ఇతర దేశాల మాదిరిగానే ఫ్రాన్స్‌లో కూడా సెకండ్ వేవ్ మొదలైంది. మొదటి దశ కంటే ఇది మరింత తీవ్రంగా ఉండవచ్చు. ఇప్పటికే, కరోనా సోకి తీవ్ర అస్వస్థతకు గురైన 3 వేల మందికి పైగా పేషెంట్లకు మెరుగైన చికిత్స అందించేందుకు ఆస్పత్రుల్లో బెడ్లు అందుబాటులో లేవు. నవంబరు 15 నాటికి సుమారు 9 వేల మందికి ఐసీయూలో చేర్పించి చికిత్స అందించాల్సిన పరిస్థితి వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ ఇప్పటికైనా మనం జాగ్రత్తపడకపోతే సమీప కాలంలో 4 లక్షలకు పైగా అదనపు మరణాలు నమోదయ్యే అవకాశం ఉంది’’ అని హెచ్చరించారు. రాజధాని నగరం పారిస్ సహా ఇతర ప్రధాన పట్టణాల్లో రెండువారాల క్రితమే కర్ప్యూ విధించినా కరోనా కేసుల(సెకండ్‌వేవ్)ను కట్టడి చేయలేకపోయామని, సెకండ్‌వేవ్‌లో ఇప్పటికే దేశంలో 35 వేలకు పైగా కరోనా మరణాలు సంభవించాయని పేర్కొన్నారు. (చదవండి: కరోనా: భారత్‌కు ‘సెకండ్‌వేవ్’ భయం!) ఎకానమీకి నష్టం కలగకుండా చర్యలు ఇక లాక్డౌన్ నిబంధనల నేపథ్యంలో గురువారం రాత్రి నుంచి అత్యవసరాలు మినహా మిగతా వ్యాపార సంస్థలన్నీ మూసివేయాలని, ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావాలంటే తప్పనిసరిగా సంబంధిత అధికారుల నుంచి రాతపూర్వక అనుమతులు తీసుకోవాల్సి ఉంటుందని మాక్రాన్ స్పష్టం చేశారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని ప్రజలకు ఈ సందర్భంగా మరోసారి విజ్ఞప్తి చేశారు. కోవిడ్-19 వ్యాప్తిని కట్టడి చేసే క్రమంలో ఆర్థిక కార్యకాలపాలకు భంగం కలగకుండా చర్యలు తీసుకుంటామని, వ్యాపార వర్గాలను ఆదుకునేందుకు అదనపు ఆర్థిక ప్యాకేజీ ప్రకటించే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఒకవేళ లాక్డౌన్ విధించిన రెండు వారాల్లో మహమ్మారి వ్యాప్తి తగ్గినట్లయితే మరిన్ని సడలింపులు కల్పిస్తామని, క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకలు కుటుంబాలతో కలిసి జరుపుకొనే పరిస్థితులు రావాలని మాక్రాన్ ఆకాంక్షించారు. ఇక వర్క్‌ఫ్రం హోంకు అనుమతించిన సంస్థలు వాటిని పొడిగిస్తే బాగుంటుందన్నారు. అదే విధంగా విద్యాసంస్థలు ఆన్లైన్ క్లాసులను కొనసాగించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. కాగా ది సాంటే పబ్లిక్ ఫ్రాన్స్ హెల్త్ ఏజెన్సీ వివరాల ప్రకారం, బుధవారం ఒక్కరోజే ఈ యూరప్ దేశంలో కొత్తగా 244 కరోనా మరణాలు సంభవించాయి. 36,000 వేల మందికి పైగా ఈ మహమ్మారి బారిన పడ్డారు. -
భారత్‌కు ఫ్రాన్స్ భారీ రుణ సాయం!
పారిస్/న్యూఢిల్లీ: భారత్‌కు 200 మిలియన్ యూరోల మేర రాయితీలతో కూడిన రుణాన్ని మంజూరు చేసేందుకు ఫ్రాన్స్ ముందుకు వచ్చింది. కోవిడ్-19, భయంకర ఉంపన్ తుపాను కారణంగా నష్టపోయిన బలహీన వర్గాలను ఆదుకునేందుకు ఈ మేరకు సాయం అందిస్తున్నట్లు ఫ్రాన్స్ దౌత్యవర్గాలు వెల్లడించాయి. కాగా ఉంపన్ తుపాను భారత్‌లో విధ్వంసం సృష్టించిన నేపథ్యంలో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్ భారత ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. తుపాను బాధితులకు సహాయం చేస్తామని ఆయన స్నేహహస్తం అందించారు. ఈ నేపథ్యంలో ఫ్రెంచ్ అభివృద్ధి సంస్థ భారత్‌లోని కోవిడ్-19, తుపాను బాధితులను ఆదుకునేందుకు 200 మిలియన్ యూరోల రుణసాయం అందించనుందని ఫ్రాన్స్ అధికారులు వెల్లడించారు. (పాకిస్తాన్‌కు సాయం నిలిపివేయండి: అల్తాఫ్) ఇక రుణ మంజూరుకు సంబంధించిన ప్రక్రియ పూర్తైందని.. భారత్‌లోని బలహీన వర్గాలకు సామాజిక రక్షణ కల్పించేందుకు ప్రపంచ బ్యాంకు అందించిన సాయానికి ఇది ఊతంలా నిలుస్తుందని వారు అభిప్రాయపడ్డారు. కాగా కరోనా వ్యాపిస్తున్న తరుణంలో మార్చి 31న ప్రధాని మోదీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ ఫోన్లో సంభాషించుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో వివిధ అంశాల్లో ఇరు దేశాలు పరస్పరం సహాయం అందించుకోవాల్సిన ఆవశ్యకత గురించి చర్చించారు. ఫ్రాన్స్ ప్రారంభించిన కోవిడ్ టూల్స్ ఆక్సిలేటర్(ఏసీటీ- ఏ) ఇనిషియేటివ్(జీ-20)కు మద్దతు పలకాల్సిందిగా మాక్రాన్ ఈ సందర్భంగా భారత్‌ను కోరినట్లు సమాచారం.(చదవండి: చైనాకు మద్దతు పలికిన నేపాల్!) -
ఫ్రాన్స్ అధ్యక్షుడిగా మేక్రన్ ఎన్నిక
-
ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రన్‌కు మోదీ అభినందన
న్యూఢిల్లీ: ఫ్రాన్స్ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన ఇమ్మాన్యుయేల్ మేక్రన్‌కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. ’ భవిష్యత్‌లో ఫ్రాన్స్-భారత్‌ల మధ్య బంధం మరింత బలపడుతుందని తాను నమ్ముతున్నట్లు’ ఆయన ఈ సందర్భంగా ట్విట్ చేశారు. కాగా ఫ్రాన్స్ అధ్యక్షుడి ఎన్నికల్లో మేక్రాన్‌తో పాటు మరీన్ లీ పెన్లు పోటీ పడిన విషయం తెలిసిందే. మాక్రన్‌కు 66.06 శాతం, లీ పెన్కు 33.9 శాతం ఓట్లు పోల్ అయ్యాయి. దీంతో లీ పెన్‌పై ఆది నుంచి ఆధిక్యంలో ఉన్న మేక్రాన్ ఎన్నిక లాంఛనప్రాయమైంది. దీంతో 39 ఏళ్ల మేక్రానే ఫ్రాన్స్ అధ్యక్షుల్లో పిన్న వయస్కులు కావడం విశేషం. యూరోపియన్ యూనియన్‌కు అనుకూలంగా వ్యవహరించే ఆయన ఎన్ మార్చ్ అనే రాజకీయ ఉద్యమాన్ని ప్రారంభించారు. కార్మిక చట్టాలను సరళీకరించడం, వెనుకబడిన ప్రాంతాల్లో విద్యా సౌకర్యాలను పెంచడం, స్వయం ఉపాధి పొందుతున్న వారికి రక్షణ కల్పించడం అనే హామీలతో మేక్రాన్ ఎన్నికల ప్రచారం చేశారు. మరోవైపు బ్రిటిన్ ప్రధాని థెరిస్సా మే, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో పాటు పలువురు ప్రపంచ దేశాల నేతలు నుంచి మేక్రాన్‌కు అభినందనలు వెల్లువెత్తాయి. అలాగే ప్రస్తుత ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండె, కెనడా ప్రధానితో పాటు, హిల్లరీ క్లింటన్ కూడా మెక్రాన్‌కు శుభాకాంక్షలు తెలిపారు. -
ఫ్రాన్స్ అధ్యక్షుడిగా మేక్రన్!: ఎగ్జిట్ పోల్స్
పారిస్: ఫ్రాన్స్ అధ్యక్షుడిగా ఇమ్మాన్యుయేల్ మేక్రన్ ఎన్నిక లాంఛనమేనని ఎగ్జిట్ పోల్ సర్వేలు తేల్చిచెప్పాయి. ఆదివారం జరిగిన రెండో రౌండ్ పోలింగ్‌లో మేక్రన్, మరీన్ లీ పెన్లు అధ్యక్ష పదవి కోసం పోటీ పడ్డారు. పోలైన ఓట్లలో 50 శాతానికి పైగా సాధించిన వారిని అధ్యక్ష పదవి వరించనుంది. మాక్రన్‌కు 65.5 శాతం, లీ పెన్కు 34.5 శాతం ఓట్లు పోలవుతాయని మెజార్టీ సర్వేలు స్పష్టం చేశాయి. మొదటి దశ ఎన్నికల్లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన మేక్రన్, మరీన్ లీ పెన్లు రెండో రౌండ్‌కు అర్హత సాధించిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికలు యూరప్ భవిష్యత్తుకు అత్యంత కీలకం కావడంతో ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది.