హైదరాబాద్: ఉత్తర ప్రదేశ్‌కు చెందిన ఓ వ్యక్తి ఆన్‌లైన్‌లో మద్యం ఆర్డర్ పెట్టి రూ. 70,000 మోసపోయాడు. వివరాల్లోకి వెళితే.. అనురాగ్ ప్రశాంత్ వ్యాపారం నిమిత్తం జూన్ 14న హైదరాబాద్‌కు వచ్చి, బంజారా హిల్స్‌లోని రోడ్ నెం.1 లో స్టార్ హోటల్‌లో దిగాడు. అయితే మద్యం డోర్ డెలివరీ కోసం జూన్ 20న ఆన్‌లైన్‌లో వెతికాడు. ఈ క్రమంలో గూగుల్‌లో కనిపించిన ఓ గుర్తు తెలియని వ్యక్తి నెంబర్‌కి ఫోన్ చేసి మందు కావాలని అడిగాడు. అనురాగ్ చెప్పన వివరాల ప్రకారం.. అతడు ఉండే హోటల్‌కు మద్యం తీసుకువస్తానని మోసగాడు నమ్మించాడు.
దీని కోసం ముందుగానే డబ్బులు చెల్లించాల్సిందిగా కోరాడు. ఈ క్రమంలో అనురాగ్ తన బ్యాంక్ ఖాతా, క్రెడిడ్ కార్డు, ఫోన్‌కి వచ్చిన ఓటీపీ వివరాలను మోసగాడితో పంచుకున్నాడు. అంతే అతని ఖాతా నుంచి రెండు విడతలుగా రూ.70,000 డెబిట్ అయ్యింది. వెంటనే అదే నెంబర్‌కు ఫోన్ చేయగా.. స్విచ్ ఆఫ్ వచ్చింది. దీంతో మోసపోయానని గ్రహించిన అనురాగ్ ఆ వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
చదవండి: దేశంలో 50 వేల దిగువన కరోనా కేసులు
కొంపముంచిన ఆన్‌లైన్ లిక్కర్.. దెబ్బకు రూ. 70,000
Published Sat, Jun 26 2021 11:53 AM | Last Updated on Sat, Jun 26 2021 11:57 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment