online fraudster
-
ఇన్‌స్టాగ్రామ్‌లో ఖాతాలు తెరిచి.. 60 మంది యువతులను మభ్యపెట్టి..
సాక్షి, హైదరాబాద్ : అందమైన అమ్మాయిగా, ఆగర్భ శ్రీమంతుడిగా ద్విపాత్రాభినయం చేస్తూ సోషల్‌మీడియా ద్వారా యువతులు, మహిళలను పరిచయం చేసుకుని మోసాలకు పాల్పడుతున్న జోగాడ వంశీకృష్ణను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారణ జరిపారు. ఇతడి వలలో పడిన నగర యువతి రూ.25 లక్షలు పోగొట్టుకుని ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. ఇటీవల సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేసిన వంశీకృష్ణను పీటీ వారెంట్‌పై కస్టడీలోకి తీసుకున్నారు. ఈ విచారణ పూర్తి కావడంతో సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు గురువారం తిరిగి జైలుకు తరలించారు. ఇతగాడు ఇప్పటి వరకు దాదాపు 60 మంది నుంచి రూ.4 కోట్ల వరకు దండుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఏపీలోని రాజమహేంద్రవరానికి చెందిన వంశీకృష్ణ బీటెక్ పూర్తి చేసి 2014లో నగరానికి వలసవచ్చి రెండేళ్ల పాటు కూకట్‌పల్లిలోని ఓ హోటల్లో, ట్రావెల్స్ కన్సల్టెన్సీలోనూ పని చేశాడు. క్రికెట్ బెట్టింగ్స్‌తో పాటు రేసులకు అలవాటు పడిన ఇతగాడు అందుకు కావాల్సిన డబ్బు కోసం మోసాలు చేయడం మొదలెట్టాడు. 2017లో తన గర్ల్‌ఫ్రెండ్ సుస్మితతో కలిసి పథక రచన చేసిన ఇతగాడు మల్టీ నేషనల్ కంపెనీల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ ప్రచారం చేసుకున్నాడు. దాదాపు 40 మంది యువతుల నుంచి రూ.1.8 కోట్లకు పైగా వసూలు చేశాడు. ఈ కేసుకు సంబంధించి అప్పట్లో సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. ఇతడిపై రాచకొండ కమిషనరేట్‌తో పాటు ఏపీలోని ఉభయ గోదావరి, కృష్ణా, విశాఖపట్నం జిల్లాలు, రాష్ట్రంలోని జోగులాంబ గద్వాల్, నిజామాబాద్, ఖమ్మం, కరీంనగర్ జిల్లాలోనూ కేసులు నమోదయ్యాయి. పంథా మార్చుకుని.. ♦ గడిచిన కొన్నాళ్లుగా వంశీకృష్ణ తన పంథా మార్చుకున్నాడు. యువతుల పేర్లతో ఇన్‌స్టాగ్రామ్‌లో ఖాతాలు తెరిచాడు. వీటి ద్వారానే అనేక మంది యువతులు, మహిళలను పరిచయం చేసుకున్నాడు. వారితో కొన్ని రోజులు చాటింగ్ చేసిన తర్వాత హర్షవర్ధన్ అనే సంపన్నుడు సేవా కార్యక్రమాలు చేయడంతో పాటు ఉపాధి అవకాశాలు కలి్పస్తున్నాడంటూ సమయం చూసుకుని చెప్పేవాడు. అతడి ఫోన్ నంబర్ అంటూ తనదే పంపేవాడు. దానికి కాల్ చేసిన వారితో హర్షవర్ధన్ మాదిరిగా సంభాంచేవాడు. ♦ తన వలలో పడిన సంపన్న వర్గాలకు చెందిన యువతుల నుంచి సేవా కార్యక్రమాలు, పేదలకు ఉపాధి కలి్పంచే అంశాల పేరుతో డబ్బు దండుకునే వాడు. ఇలా దాదాపు 60 మంది నుంచి రూ.4 కోట్ల వరకు కాజేశాడు. ప్రస్తుతం అమెరికాలో ఉంటున్న ఓ నగర యువతి ఇతడికి రూ.25 లక్షలు ఇచ్చి మోసపోయింది. ఆమె ఫిర్యాదుతో సిటీ సైబర్ క్రైమ్ ఠాణాలో కేసు నమోదైంది. 2016 నుంచి ఇతగాడు దాదాపు వెయ్యి మందికి పైగా మోసం చేసి ఉంటాడని అధికారులు చెబుతున్నారు. -
దుల్కర్ సల్మాన్ సినిమాను మించిన సీన్..5 ఏళ్లలో..
ఓ వ్యక్తి ఆన్లైన్ క్రైంకు పాల్పడ్డాడు.అమెజాన్‌లో ఖరీదైన వస్తువుల్ని బుక్ చేయడం, వాటిని రిసీవ్ చేసుకున్న తర్వాత పార్ట్ పార్ట్‌లుగా ఓపెన్ చేసి ఒరిజినల్ పార్ట్స్ బదులు డమ్మీ పార్ట్స్‌ను అమర్చేవాడు.ఆ ఒరిజినల్ భాగాల్ని అమ్మేసేవాడు.విలాసవంతంగా బతికేవాడు.హీరో సల్మాన్ దుల్కర్ సినిమాని తలపించేలా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఐదేళ్లు ఇలాగే చేశాడు.చివరికి.. కనులు కనులను దోచాయంటే సినిమాకు మించి దేసింగ్ పెరియసామి డైరెక్షన్లో తెరకెక్కిన లవ్ అండ్ క్రైమ్ థిల్లర్ చిత్రం 'కనులు కనులను దోచాయంటే'. ఈ సినిమాలో ఆన్లైన్ క్రైం చేసి విలాసవంతంగా జీవించే కేరక్టర్లో దుల్కర్ సల్మాన్ రియలస్టిక్‌గా నటించాడు. ఈ సినిమా చూసిన వాళ్లెవ్వరైనా ఇలా కూడా ఆన్లైన్ క్రైం చేయొచ్చా' అని అనుకునేంతలా క్యురియాసిటీని పెంచుతుంది. అచ్చం అలాగే అమెరికాకు చెందిన 'హడ్సన్ హామ్రిక్' అమెజాన్‌లో 2016 - 2020 మధ్య కాలంలో అమెజాన్‌లో ఖరీదైన ఆపిల్,ఆసుస్, ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్, గిటార్స్, టూల్స్, కంప్యూటర్స్, గృహోపకరాణలు ఇలా మొత్తం 270 ప్రాడక్ట్‌లను బుక్ చేశాడు. బుక్ చేసిన 250 వస్తువుల్ని ఓపెన్ చేయడం..అందులోని విలువైన భాగాల్ని తొలగించి, వాటి స్థానంలో నకిలీ భాగాల్ని అమర్చేవాడు. అనంతరం తాను బుక్ చేసిన ప్రాడక్ట్లు బాగలేవని, లేదంటే తాను బుక్ చేసిన ప్రాడక్ట్ వేరే కలర్ అంటూ వాటిని రిటర్న్ చేశాడు. వీటికి సంబంధించి దాదాపు 300 మోసపూరిత లావాదేవీలు నిర్వహించాడు. ఈ ఫ్రాడ్ మొత్తం వ్యాల్యూ $290,000 (ఇండియన్ కరెన్సీలో రూ.2,18,60,055.00) గా ఉందని ఫెడర్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(ఎఫ్‌బీఐ) అధికారులు గుర్తించారు. 20ఏళ్లు జైలు శిక్ష అయితే నిందితుడి నుంచి రిటర్న్ వస్తున్న ప్రాడక్ట్‌లలో ఏదో మోసం జరుగుతుందని అమెజాన్ గుర్తించి ఎఫ్‌బీఐ అధికారులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ దర్యాప్తులో భారీ కుంభకోణం జరిగినట్లు గుర్తించారు. నిందితుడు హడ్సన్ హామ్రిక్ చేసిన ఈ ఫ్రాడ్‌పై నార్త్ కరొలినాలోని షార్లెట్ నగరానికి చెందిన వెస్ట్రన్ డిస్ట్రిక్ నార్త్ కరొలినా న్యాయస్థానం ఈ ఏడాది అక్టోబర్ 5న విచారణ చేపట్టింది. విచారణ సందర్భంగా నిందితుడు చేసిన మోసానికి 20ఏళ్ల జైలు శిక్షతో పాటు $250 000 (ఇండియన్ కరెన్సీలో రూ.18,775,625) ఫైన్ విధిస్తూ జిల్లా ప్రధాన న్యాయ మూర్తి విలియం టి. స్టెట్జర్ తీర్పిచ్చారు. చదవండి: ఈ ల్యాప్ ట్యాప్‌పై అదిరిపోయే డిస్కౌంట్లు, ఎక్ఛేంజ్ ఆఫర్ కూడా.. -
కొంపముంచిన ఆన్లైన్ లిక్కర్.. దెబ్బకు రూ. 70,000
హైదరాబాద్: ఉత్తర ప్రదేశ్‌కు చెందిన ఓ వ్యక్తి ఆన్లైన్లో మద్యం ఆర్డర్ పెట్టి రూ. 70,000 మోసపోయాడు. వివరాల్లోకి వెళితే.. అనురాగ్ ప్రశాంత్ వ్యాపారం నిమిత్తం జూన్ 14న హైదరాబాద్‌కు వచ్చి, బంజారా హిల్స్‌లోని రోడ్ నెం.1 లో స్టార్ హోటల్లో దిగాడు. అయితే మద్యం డోర్ డెలివరీ కోసం జూన్ 20న ఆన్లైన్లో వెతికాడు. ఈ క్రమంలో గూగుల్‌లో కనిపించిన ఓ గుర్తు తెలియని వ్యక్తి నెంబర్‌కి ఫోన్ చేసి మందు కావాలని అడిగాడు. అనురాగ్ చెప్పన వివరాల ప్రకారం.. అతడు ఉండే హోటల్‌కు మద్యం తీసుకువస్తానని మోసగాడు నమ్మించాడు. దీని కోసం ముందుగానే డబ్బులు చెల్లించాల్సిందిగా కోరాడు. ఈ క్రమంలో అనురాగ్ తన బ్యాంక్ ఖాతా, క్రెడిడ్ కార్డు, ఫోన్‌కి వచ్చిన ఓటీపీ వివరాలను మోసగాడితో పంచుకున్నాడు. అంతే అతని ఖాతా నుంచి రెండు విడతలుగా రూ.70,000 డెబిట్ అయ్యింది. వెంటనే అదే నెంబర్‌కు ఫోన్ చేయగా.. స్విచ్ ఆఫ్ వచ్చింది. దీంతో మోసపోయానని గ్రహించిన అనురాగ్ ఆ వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. చదవండి: దేశంలో 50 వేల దిగువన కరోనా కేసులు -
ఆన్లైన్ మోసగాడి అరెస్ట్
నెల్లూరు (వీఆర్సీ సెంటర్): సీఎం సహాయనిధి నుంచి నగదు సాయం ఇప్పిస్తానంటూ ఆపదలో ఉన్న వారి నుంచి నగదు వసూలు చేస్తున్న ఆన్లైన్ మోసగాడిని సీఎంవో అధికారుల ఫిర్యాదుతో నెల్లూరు నవాబుపేట పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. నెల్లూరు నగర డీఎస్పీ జె.శ్రీనివాసులురెడ్డి వివరాలు వెల్లడించారు. నెల్లూరులోని జాకీర్‌హుస్సేన్ నగర్‌కు చెందిన ఎస్కే సైలాఫ్ 17 ఏళ్ల కుమారుడు గౌస్ మొహిద్దీన్ మెదడు సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. చికిత్స నిమిత్తం రూ.4 లక్షలు అప్పు చేశాడు. వైద్యానికి ఆర్థిక సాయం చేయాలని సీఎం సహాయనిధికి దరఖాస్తు చేసుకున్నట్టు సైలాఫ్ ఫేస్బుక్లో పోస్టు పెట్టాడు. ఈ క్రమంలో చిత్తూరు జిల్లా పెద్దసముద్రం మండలం దువ్వూరు నారాయణపల్లికి చెందిన సందీప్‌రెడ్డి ఫేస్బుక్లో పరిచయమై బాధితుడికి ఫోన్ చేశాడు. రూ.10 వేలు ఇస్తే సీఎం సహాయనిధి నుంచి రూ.1.50 లక్షలు ఇప్పిస్తానని నమ్మించడంతో సైలాఫ్ ఆన్లైన్ ద్వారా రూ.3,600, మరోసారి రూ.1,500 పంపించాడు. కాగా సీఎం కార్యాలయ అధికారులు సైలాఫ్‌కు ఫోన్ చేసి అతడి కుమారుడి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. ఈ క్రమంలో తాను సందీప్‌రెడ్డికి నగదు ఇచ్చినట్లు చెప్పడంతో అధికారులు, బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఐ వేమారెడ్డి, ఎస్సైలు రమేష్‌బాబు, శివప్రకాష్ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి సందీప్‌రెడ్డిని అరెస్ట్ చేశారు. -
స్మార్ట్‌ఫోన్ ఆర్డర్ చేస్తే.. సోన్‌పాపిడి డబ్బా..
సాక్షి, బెంగళూరు: ఆన్లైన్ వంచకులు తీయని మాటలతో అమాయకులను బురిడీ కొట్టిస్తున్నారు. కారుచవగ్గా ఖరీదైన వస్తువులు మీవేనంటూ వచ్చే ఫోన్లకు జనం నిజమేనని నమ్మడం మోసగాళ్లకు కలిసొస్తోంది. చిత్రదుర్గం జిల్లా చెళ్లకెరె తాలూకాలోని గోపనహళ్లి గ్రామానికి చెందిన నరసింహమూర్తి ఇదేమాదిరి నష్టపోయాడు. దీపావళి పండుగ సందర్భంగా శాంసంగ్ గెలాక్సీ మొబైల్‌ఫోన్‌ను రూ. 1,700 కే అందిస్తున్నామని ఒక వ్యక్తి ఫోన్ చేశాడు. పోస్టల్ శాఖ నుంచి పార్శిల్ వస్తుందని, డబ్బు చెల్లించి తీసుకోవాలని సూచించగా నరసింహమూర్తి తక్కువధరకే స్మార్ట్‌ఫోన్ వస్తోందని మురిసిపోయాడు. (చదివింది ఏడు.. రూ. 20 కోట్లకు కుచ్చుటోపి) మిఠాయిపెట్టె, గిల్టు చైన్ బుక్ చేయగా గురువారం బెంగుళూరు హెబ్బాళ నుంచి గోపనహళ్లి తపాలా కార్యాలయానికి నరసింహమూర్తి పేరుమీద ఓ పార్శిల్ వచ్చింది. ఆయన రూ.1700 ఇచ్చి పార్సల్ తీసుకుని చూడగా, ఫోన్‌కు బదులు 50 రూపాయల సోన్ పాపిడి మిఠాయి పెట్టె, ఓ రోల్డ్ గోల్డ్ చైన్ కనిపించింది. దీంతో నరసింహమూర్తి నిర్ఘాంతపోయాడు. పోలీసులకు ఫిర్యాదు చేస్తానని తెలిపాడు. -
డేటింగ్ పేరుతో చీటింగ్
సాక్షి, హైదరాబాద్: స్థానిక వాణిజ్య ప్రకటనలు ఉచితంగా పొందుపరుచుకోవడానికి ఉద్దేశించిన ‘లొకంటో.కామ్’ అక్రమాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతోంది. ఈ సైట్‌ను వేదికగా చేసుకుని సైబర్ నేరగాళ్లు తాము టార్గెట్ చేసుకున్న వారిని నిలువునా ముంచుతున్నారు. ఈ నేరం వల్లోపడిన నగరానికి చెందిన ఓ డాక్టర్ నాలుగు నెలల్లో రూ.41.5 లక్షలు కోల్పోయాడు. ఎట్టకేలకు మోసపోయానని గుర్తించి శుక్రవారం సిటీ సైబర్ క్రైమ్ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. నగరంలోని పద్మారావ్‌నగర్‌కు చెందిన వ్యక్తి (57) వరంగల్‌లోని కాకతీయ వైద్య కళాశాల నుంచి వైద్యపట్టా పొందారు. ఆపై కేంద్ర ప్రభుత్వ సర్వీసులో వైద్యుడిగా ఎంపికై ప్రస్తుతం గుజరాత్లో విధులు నిర్వర్తిస్తున్నారు. లాక్డౌన్ ప్రారంభమైన నాటి నుంచి ఈయన నగరానికే పరిమితం అయ్యారు. ఈ వైద్యుడు జూన్‌లో లొకంటో సైట్‌ను బ్రౌజ్ చేస్తుండగా అందులో కనిపించిన ఓ ప్రకటనకు ఆకర్షితుడయ్యాడు. కొందరు సైబర్ నేరగాళ్లు ఇంటర్నెట్ నుంచి సంగ్రహించిన ఆకర్షణీయమైన యువతుల ఫొటోలు అందులో పోస్టు చేశారు. అందులో సెల్ నెంబర్లుకు ఇచ్చిన నేరగాళ్లు డేటింగ్‌పై ఆసక్తి ఉంటే కాల్ చేయాల్సిందిగా సూచించారు. ఈ ప్రకటన చూసిన వైద్యుడు వారికి కాల్ చేయగా..కొందరు వ్యక్తులు మాట్లాడారు. యాడ్‌లో పోస్టు చేసిన ఫొటోలు ఉన్న యువతులు డేటింగ్‌కు సిద్ధంగా ఉన్నారంటూ ఉచ్చులోకి దింపారు. వారిని కలుసుకోవాలంటే రిజిస్ట్రేషన్ చేసుకుని, కొంత మొత్తం అడ్వాన్స్‌గా చెల్లించాలంటూ తమ బ్యాంకు ఖాతా వివరాలు అందించారు. ఇలా ఈ ఏడాది జూన్ 6 నుంచి ఈ వైద్యుడు ‘చెల్లింపులు’ మొదలెట్టారు. రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించిన తర్వాత కథ వాట్సాప్‌లోకి మారింది. ఇతడు ఎంచుకున్న యువతులే చాట్ చేస్తున్నట్లు, మాట్లాడుతున్నట్లు సీన్ క్రియేట్ చేశారు. తనను కలుసుకోవాలంటే మరికొంత మొత్తం చెల్లించాలని చెప్పించారు. ఇక అప్పటి నుంచి సీన్ బ్యాంకు ఖాతాలకు బదులుగా పేటీఎం, గూగుల్ పే వంటి ఈ–వాలెట్స్‌కు మారింది. దఫదఫాలుగా నగదు వేయించుకుంటూ వెళ్లారు. ప్రతి సందర్భంలోనూ చెల్లించిన మొత్తంలో ‘చార్జీలు’ పోను మిగిలింది రిఫండ్ అంటూ చెప్పారు. ఏ దశలో అయినా డబ్బు డిపాజిట్ చేయడం/బదిలీ చేయడం ఆపేస్తే అప్పటి వరకు చెల్లించిన మొత్తం కూడా తిరిగి రాదంటూ బెదిరించారు. దీంతో నగర వైద్యుడు డబ్బు చెల్లిస్తూ పోయాడు. ఇలా నాలుగు నెల్లో రూ.41.5 లక్షలు చెల్లించేశాడు. తనకు వచ్చే జీతంలో దాచుకున్న దానితో పాటు అప్పులు చేసి, చివరకు ప్రావిడెంట్ ఫండ్ లోన్లు తీసుకుని గత నెల ఆఖరు వరకు డబ్బు చెల్లించేశాడు. నేరగాళ్లు ఇంకా డబ్బు డిమాండ్ చేస్తుండటంతో ఆలోచనలో పడ్డాడు. ఈ లోపు విషయం అతడి కుటుంబీలకు తెలియడంతో వారు అప్రమత్తమై ఇంక డబ్బు చెల్లించకుండా చూశారు. శుక్రవారం సిటీ సైబర్ క్రైమ్ ఏసీపీ కేవీఎం ప్రసాద్‌కు ఫిర్యాదు చేశారు. ఏసీపీ ఆదేశాల మేరకు కేసు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రాథమిక ఆధారాలను బట్టి ఈ నేరగాళ్లు పశ్చిమ బెంగాల్‌కు చెందిన వారిగా అనుమానిస్తున్నారు. లోకంటో సైట్ కేంద్రంగా జరుగుతున్న నేరాలను ఇటీవల పెరుగుతున్నాయని అధికారులు చెబుతున్నారు. ఖాతాలు మార్చి రూ.2.09 కోట్ల గోల్మాల్ సాక్షి, హైదరాబాద్: నగరానికి చెందిన ప్రముఖ డిజైనర్ స్టోన్స్ తయారీ సంస్థ పోకర్ణ ఇంజినీరింగ్ స్టోన్ లిమిటెడ్ (పీఈఎస్‌ఎల్) సంస్థ సైబర్ నేరగాళ్లకు టార్గెట్‌గా మారింది. ఈ సంస్థకు చెందిన అధికారిక మెయిన్ సర్వర్‌ను హ్యాక్ చేసిన ‘ఈ–క్రిమినల్స్’ వాటిలోని ఉత్తరప్రత్యుత్తరాలను సంగ్రహించారు. వీటి ఆధారంగా నకిలీ ఇన్వాయిస్లు, బోగస్ ఈ–మెయిల్ ఐడీలు సృష్టించి రూ.2.09 కోట్లు గోల్మాల్ చేశారు. నాలుగు నెలల కాలంలో, మూడు దఫాల్లో జరిగిన ఈ స్కామ్‌పై దాని యజమాని గౌతమ్ చాంద్ జైన్ శుక్రవారం సిటీ సైబర్ క్రైమ్ ఏసీపీ కేవీఎం ప్రసాద్‌కు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. సికింద్రాబాద్ కేంద్రంగా పనిచేసే పీఈఎస్‌ఎల్‌కు అంతర్జాతీయంగానూ క్లయింట్స్ ఉన్నారు. ఈ సంస్థ ప్రధానంగా అమెరికా, మెక్సికో, బెల్జియంలకు చెందిన కంపెనీలతో లావాదేవీలు చేస్తుంటుంది. ఈ క్రయవిక్రయాలకు సంబంధించి ఆయా కంపెనీల మధ్య ఈ–మెయిల్స్ రూపంలో ఉత్తరప్రత్యుత్తరాలు జరుగుతున్నాయి. ప్రతి కంపెనీ మెయిల్ రూపంలోనే ఇన్వాయిస్లను పంపి ఆ మేరకు అడ్వాన్స్‌ల్ని తీసుకుంటూ ఉంటుంది. కొందరు సైబర్ నేరగాళ్లు అకౌంట్ టేకోవర్ నేరానికి తెగబడ్డారు. ఇందులో భాగంగా పీఈఎస్‌ఎల్ సంస్థకు చెందిన అధికారిక ఈ–మెయిల్ అకౌంట్‌ను హ్యాకింగ్ చేసి అందులో ఉన్న ఉత్తరప్రత్యుత్తరాలను పరిశీలించారు. ఈ నేపథ్యంలో పీఈఎస్‌ఎల్‌కు, అమెరికా, మెక్సికో, బెల్జియం సంస్థలకు మధ్య ఆర్థిక లావాదేవీలు ఉన్నట్లు గుర్తించారు. దీన్ని క్యాష్ చేసుకోవడానికి రంగంలోకి దిగిన సైబర్ నేరగాళ్ళు పీఈఎస్‌ఎల్ మెయిల్ ఐడీని పొందినదే మరోటి సృష్టించారు. ఇందులో కేవలం స్వల్పమార్పులు చేసి సాధారణంగా గుర్తుపట్టలేని విధంగా తయారు చేశారు. ఈ నకిలీ ఇన్వాయిస్లు మొత్తం యథాతధంగా ఉంచిన దుండగులు కేవలం బ్యాంకు ఖాతా వివరాలు ఉండే చోట మాత్రం అసలు వాటికి బదులుగా తమకు చెందిన ఖాతాల వివరాలు జొప్పించారు. అనివార్య కారణాల నేపథ్యంలో బ్యాంకు ఖాతా మార్చామని, ఈసారి నుంచి ఇందులోనే నగదు జమ చేయాలని ఆ మెయిల్లో కోరారు. నాలుగు నెలల క్రితం దీన్ని మెక్సికో, అమెరికా సంస్థలకు పంపాడు. ఈ మెయిల్ చూసిన ఆయా సంస్థలు నిజమని నమ్మి అడ్వాన్సులుగా 160665 డాలర్లు (రూ.1.17 కోట్ల), 56,000 డాలర్లు (40.91 లక్షలు) బదిలీ చేసేశాయి. తమ కు రావాల్సిన అడ్వాన్సుల కోసం పీఈఎస్‌ఎల్ సంస్థ ఆయా కంపెనీలను సంప్రదించగా విషయం తెలిసింది. దీంతో తాను మోసపోయామని గుర్తించిన ఆ రెండు సంస్థలూ అమెరికా, మెక్సికోల్లోని పోలీసు విభాగాలకు ఫిర్యాదులు చేయడంతో అక్కడే కేసులు నమోదు అయ్యాయి. అంతటితో ఆగని సైబర్ నేరగాళ్ళు బెల్జియం సంస్థకు చెందిన అధికారిక మెయిల్ ఐడీని పోలినది మరోటి తయారు చేశారు. మరో నకిలీ ఇన్వాయిస్ను సృష్టించిన దుండగులు దీని ఆధారంగా పీఈఎస్‌ఎల్ సంస్థకు మెయిల్ పంపారు. అందులో తమకు చెల్లించాల్సిన 59,826 యూరోలు (రూ.51.59 లక్షలు) కొత్తగా తెరిచిన ఖాతాకు బదిలీ చేయాల్సిందిగా కోరారు. పీఈఎస్‌ఎల్ సంస్థ అలానే చేయడంతో ఆ మొత్తమూ సైబర్ నేరగాళ్ళకు చేరింది. ఎట్టకేలకు జరిగిన మోసాలు తెలుసుకున్న పీఈఎస్‌ఎల్ యాజమాని సిటీ సైబర్ క్రైమ్ ఠాణాను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించిన ఇన్స్పెక్టర్ ఎన్.మోహన్‌రావు ఇది నైజీరియన్లు చేసిన నేరంగా ప్రాథమిక అంచనాకు వచ్చారు. -
మాజీ బాస్‌కు టోపీ.. రూ. 3 లక్షల షాపింగ్!
మాజీ బాస్ డెబిట్ కార్డు సమాచారం మొత్తాన్ని దొంగిలించి.. దాంతో ఏకంగా రూ. 3 లక్షల వరకు ఆన్లైన్ షాపింగ్ చేసిన ప్రబుద్ధుడిని హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు పట్టుకున్నారు. అతడు కొన్నవాటిలో దాదాపు రూ. 1.50 లక్షల విలువైన ఎలక్ట్రానిక్ వస్తువులు, దుస్తులు, రెండు సెల్ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బాధితుడు ఫిర్యాదు చేయడంతో.. ఈ-కామర్స్ వెబ్సైట్లు కూడా అతడు ఆర్డర్ చేసిన వస్తువులను డెలివరీ ఇవ్వకుండా ఆపేసి.. ఆ డబ్బును సదరు అకౌంటుకు తిప్పి పంపుతున్నాయి. తన ఖాతాలోంచి జనవరి 31 నుంచి ఫిబ్రవరి 5వ తేదీ వరకు దాదాపు రూ. 3 లక్షల మేర ఆన్లైన్ లావాదేవీలు జరిగినట్లు అకౌంటు బ్యాలెన్స్‌లో ఉందని శాంతినగర్ కాలనీలోని స్నిపర్ ఎలక్ట్రానిక్స్ అధినేత ఖాజా సల్మాన్ వాసిఫ్ పోలీసులకు ఈనెల 6వ తేదీన ఫిర్యాదుచేశారు. అయితే అసలు తాను ఆన్లైన్లో ఏమీ కొనలేదని, డెబిట్ కార్డు కూడా తన దగ్గరే ఉందని చెప్పారు. దాంతో సీసీఎస్‌లోని సైబర్ క్రైం పోలీసు స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఈ కామర్స్ వెబ్సైట్ల నుంచి సేకరించిన సమాచారం ప్రకారం నిందితుడి మొబైల్ నెంబరు, అతడికి వస్తువులు డెలివరీ చేసిన చిరునామా పట్టుకున్నారు. అతడి మొబైల్ సిగ్నల్ శంకర్‌పల్లిలో ట్రేస్ అయింది. వాటి ద్వారా నిందితుడు శ్రీకాంత్ రెడ్డి (19)ని అరెస్టు చేశారు. శ్రీకాంత్ రెడ్డి స్నైపర్ ఎలక్ట్రానిక్స్‌లో ఆఫీస్ బోయ్‌గా పనిచేసేవాడు. యజమాని డెబిట్ కార్డు నెంబరు, సీవీవీ నెంబరు, ఎక్స్పైరీ డేట్ లాంటివాటిని జాగ్రత్తగా రాసుకుని, 2015 డిసెంబర్లో ఉద్యోగం మానేశాడు. తర్వాత ఫ్లిప్‌కార్ట్, ఎమెజాన్, మైంత్రా, జబాంగ్, జాపర్, షాప్‌క్లూస్ లాంటి ఈ కామర్స్ యాప్‌లను తన మొబైల్లో ఇన్స్టాల్ చేసుకున్నాడు. ఇక తన మాజీ బాస్ డెబిట్ కార్డుతో ఎడాపెడా కొనుగోళ్లు మొదలుపెట్టాడు. పోలీసులను తప్పుదోవ పట్టించడానికి తన పేరు, చిరునామా తప్పుగా ఇచ్చాడు. డెలివరీ బోయ్ కాల్ చేయగానే తానే స్వయంగా వెళ్లి వాటిని తీసుకునేవాడు. అయితే ఫోన్ నెంబరు మాత్రం అదే ఉండటంతో పోలీసులు అతడిని పట్టుకున్నారు.