ఓ వ్యక్తి ఆన్‌లైన్ క్రైంకు పాల్పడ్డాడు.అమెజాన్‌లో ఖరీదైన వస్తువుల్ని బుక్ చేయడం, వాటిని రిసీవ్ చేసుకున్న తర్వాత పార్ట్ పార్ట్‌లుగా ఓపెన్ చేసి ఒరిజినల్ పార్ట్స్ బదులు డమ్మీ పార్ట్స్‌ను అమర్చేవాడు.ఆ ఒరిజినల్ భాగాల్ని అమ్మేసేవాడు.విలాసవంతంగా బతికేవాడు.హీరో సల్మాన్ దుల్కర్ సినిమాని తలపించేలా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఐదేళ్లు ఇలాగే చేశాడు.చివరికి..
కనులు కనులను దోచాయంటే సినిమాకు మించి
దేసింగ్ పెరియసామి డైరెక్షన్‌లో తెరకెక్కిన లవ్ అండ్ క్రైమ్ థిల్లర్ చిత్రం 'కనులు కనులను దోచాయంటే'. ఈ సినిమాలో ఆన్‌లైన్ క్రైం చేసి విలాసవంతంగా జీవించే కేరక్టర్‌లో దుల్కర్ సల్మాన్ రియలస్టిక్‌గా నటించాడు. ఈ సినిమా చూసిన వాళ్లెవ్వరైనా ఇలా కూడా ఆన్‌లైన్ క్రైం చేయొచ్చా' అని అనుకునేంతలా క్యురియాసిటీని పెంచుతుంది.
అచ్చం అలాగే అమెరికాకు చెందిన 'హడ్సన్ హామ్రిక్' అమెజాన్‌లో 2016 - 2020 మధ్య కాలంలో అమెజాన్‌లో ఖరీదైన ఆపిల్,ఆసుస్, ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్, గిటార్స్, టూల్స్, కంప్యూటర్స్, గృహోపకరాణలు ఇలా మొత్తం 270 ప్రాడక్ట్‌లను బుక్ చేశాడు. బుక్ చేసిన 250 వస్తువుల్ని ఓపెన్ చేయడం..అందులోని విలువైన భాగాల్ని తొలగించి, వాటి స్థానంలో నకిలీ భాగాల్ని అమర్చేవాడు. అనంతరం తాను బుక్ చేసిన ప్రాడక్ట్‌లు బాగలేవని, లేదంటే తాను బుక్ చేసిన ప్రాడక్ట్ వేరే కలర్ అంటూ వాటిని రిటర్న్ చేశాడు. వీటికి సంబంధించి దాదాపు 300 మోసపూరిత లావాదేవీలు నిర్వహించాడు. ఈ ఫ్రాడ్ మొత్తం వ్యాల్యూ $290,000 (ఇండియన్ కరెన్సీలో రూ.2,18,60,055.00) గా ఉందని ఫెడర్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(ఎఫ్‌బీఐ) అధికారులు గుర్తించారు.
20ఏళ్లు జైలు శిక్ష
అయితే నిందితుడి నుంచి రిటర్న్ వస్తున్న ప్రాడక్ట్‌లలో ఏదో మోసం జరుగుతుందని అమెజాన్ గుర్తించి ఎఫ్‌బీఐ అధికారులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ దర్యాప్తులో భారీ కుంభకోణం జరిగినట్లు గుర్తించారు.
నిందితుడు హడ్సన్ హామ్రిక్ చేసిన ఈ ఫ్రాడ్‌పై నార్త్ కరొలినాలోని షార్లెట్ నగరానికి చెందిన వెస్ట్రన్ డిస్ట్రిక్ నార్త్ కరొలినా న్యాయస్థానం ఈ ఏడాది అక్టోబర్ 5న విచారణ చేపట్టింది. విచారణ సందర్భంగా నిందితుడు చేసిన మోసానికి 20ఏళ్ల జైలు శిక్షతో పాటు $250 000 (ఇండియన్ కరెన్సీలో రూ.18,775,625) ఫైన్ విధిస్తూ జిల్లా ప్రధాన న్యాయ మూర్తి విలియం టి. స్టెట్జర్ తీర్పిచ్చారు.
చదవండి: ఈ ల్యాప్ ట్యాప్‌పై అదిరిపోయే డిస్కౌంట్లు, ఎక్ఛేంజ్ ఆఫర్ కూడా..
Comments
Please login to add a commentAdd a comment