న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ ఇంధన దిగ్గజం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ) తాజాగా ముంబై, పరిసర ప్రాంతాల్లో ఇంటి వద్దకే బల్క్‌గా డీజిల్ డెలివరీ సేవలు ప్రారంభించింది. ఇందుకోసం యాప్ ఆధారిత డీజిల్ డోర్ డెలివరీ సేవల సంస్థ హమ్‌సఫర్ ఇండియా, ఒకారా ఫ్యూయెలాజిక్స్‌తో చేతులు కలిపింది. త్వరలో మహారాష్ట్రలోని పుణె, నాగ్‌పూర్, నాసిక్ తదితర నగరాలకు ఈ సర్వీసులు విస్తరించనున్నట్లు ఐవోసీ చీఫ్ జనరల్ మేనేజర్ (మహారాష్ట్ర ఆఫీస్) రాజేశ్ సింగ్ తెలిపారు. డీజిల్ పంపిణీలో ఇదొక వినూత్న విధానమని ఆయన వివరించారు.
వ్యవసాయ రంగం, ఆస్పత్రులు, హౌసింగ్ సొసైటీలు, భారీ యంత్రాల కేంద్రాలు, మొబైల్ టవర్లు మొదలైన వాటికి ఇది ప్రయోజనకరంగా ఉంటుందన్నారు. ఇప్పటిదాకా భారీ మొత్తంలో డీజిల్ కొనుక్కునే (బల్క్) వినియోగదారులు బ్యారెళ్లలో రిటైల్ అవుట్‌లెట్ల నుంచి కొనుగోలు చేయాల్సి వచ్చేదని సింగ్ తెలిపారు. దీని వల్ల గమ్యస్థానానికి చేరేలోగా డీజిల్‌లో కొంత భాగం కారిపోవడం తదితర సమస్యల వల్ల నష్టపోవాల్సి వచ్చేదని ఆయన వివరించారు. డీజిల్ డోర్ డెలివరీతో ఇలాంటి సమస్యలను పరిష్కరించవచ్చని, బల్క్ కస్టమర్లకు చట్టబద్ధంగా డీజిల్ సరఫరా సాధ్యపడుతుందని సింగ్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment