డీజిల్‌కు తగ్గిన డిమాండ్: ఐఓసీ | Diesel demand drops for first time in a decade: IOC | Sakshi
Sakshi News home page

డీజిల్‌కు తగ్గిన డిమాండ్: ఐఓసీ

Published Fri, Dec 6 2013 1:08 AM | Last Updated on Fri, Sep 28 2018 3:27 PM

డీజిల్‌కు తగ్గిన డిమాండ్: ఐఓసీ - Sakshi

డీజిల్‌కు తగ్గిన డిమాండ్: ఐఓసీ

న్యూఢిల్లీ: దశాబ్దం కాలంలో మొదటిసారి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డీజిల్‌కు డిమాండ్ పడిపోయింది. 3వ ప్రపంచ ఇంధన సదస్సులో పాల్గొన్న ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) చైర్మన్ ఆర్‌ఎస్ బుటోలా ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. నెలవారీ పెరుగుతున్న ధరలు, విద్యుత్ వినియోగం పెరగడం ప్రధాన కారణాలని ఈ సందర్భంగా బుటోలా వివరించారు.  2003-04 నుంచి గత ఆర్థిక సంవత్సరం వరకూ వార్షిక ప్రాతిపదికన నుంచి 6 నుంచి 8% శ్రేణిలో వృద్ధిని నమోదుచేసుకుంటూ వచ్చింది. ఏ  కాలంలోనూ అమ్మకాల్లో క్షీణత నమోదు కాలేదు.  అయితే గత ఆర్థిక సంవత్సరం (2012-13) తొలి ఏడు నెలల కాలంతో(ఏప్రిల్-అక్టోబర్) పోల్చితే అమ్మకాలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2013-14) ఇదే కాలంలో 0.8% తగ్గి 39.46 మిలియన్ టన్నులుగా నమోదయ్యాయని చెప్పారు.
 
 పెట్రోలియంలో 10 శాతం వృద్ధి: కాగా ఇదే కాలంలో పెట్రోలియం వినియోగం మాత్రం 10 శాతం మేర పెరిగి 9.05 మిలియన్ టన్నులుగా నమోదయ్యింది.  గత ఆర్థిక సంవత్సరం మొత్తంలో డిజిల్ అమ్మకాలు 6.68 శాతం వృద్ధితో 69.08 మిలియన్ టన్నులుగా నమోదయ్యింది. 2003-04లో ఈ వినియోగం 37.07 మిలియన్ టన్నులు. ఈ ఏడాది జనవరి నుంచి డీజిల్ ధరలు రూ.6.62 పెరిగాయి. మరోవైపు ఆర్థిక సంవత్సరం మొదటి ఏడు నెలల కాలంలో మొత్తం ఇంధన డిమాండ్‌ను పరిశీలిస్తే- ఇది స్వల్పంగా 90.23 మిలియన్ టన్నుల నుంచి 90.57 మిలియన్ టన్నులకు పెరిగింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement