గాయపడిన ప్రసాద్
తడ (నెల్లూరు జిల్లా): రేషన్ సరుకులు సరఫరా చేసేందుకు వెళ్లిన డోర్ డెలివరీ వాహన సిబ్బందిపై కొందరు టీడీపీ కార్యకర్తలు దాడికి తెగబడ్డారు. అడ్డుపడిన ఇద్దరు వలంటీర్లపై సైతం దాడి చేశారు. ఈ ఘటన శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా తడ మండలం వేనాడు పంచాయతీ మట్టిగుంటలో జరిగింది. పోలీసుల సమాచారం మేరకు శనివారం మట్టిగుంట సెంటర్‌లో బియ్యం పంపిణీ చేస్తున్న సమయంలో నెట్‌వర్క్ సమస్య తలెత్తింది.
ఎన్నికల వివాదాన్ని దృష్టిలో ఉంచుకున్న కొందరు టీడీపీకి చెందిన వ్యక్తులు దీనిని ఆసరాగా చేసుకుని డోర్ డెలివరీ వాహనం డ్రైవర్ ఆర్ముగం, సహాయకుడు తోట ప్రసాద్‌లపై దాడికి దిగారు. ఈ దాడిలో ప్రసాద్‌కు రక్త గాయాలయ్యాయి. అడ్డుకునేందుకు ప్రయత్నించిన వలంటీర్లు దేవి, సురేష్‌లపై కూడా దాడి చేసి బీభత్సం సృష్టించారు. స్థానికులు కలగజేసుకుని అడ్డుపడ్డారు. దీనిపై బాధితులు తడ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
చదవండి:
వైఎస్సార్‌సీపీ శ్రేణులపై జనసేన రాళ్ల దాడి
ప్రలోభాలతో ఓటర్లకు టీడీపీ ఎర
Comments
Please login to add a commentAdd a comment