నవరాత్రి, దసరా, దీపావళి ఇలా వరుసగా పండుగల నేపథ్యంలో ఈ నెల 23వ తేదీ నుంచి ఫేవరేట్ ఈకామర్స్ ప్లాట్‌ఫామ్– జియోమార్ట్ ప్రత్యేక ఆఫర్లను అందించనుంది. ‘‘ఫెస్టివ్ రెడీ సేల్’ పేరుతో ఈ నెల 27వ తేదీ వరకూ ఆఫర్లు అందుబాటులో ఉంటాయి.
అన్ని కేటగిరీల ప్రొడక్టులపై విస్తృత శ్రేణిలో పొదుపు ఆఫర్లు లభిస్తాయని ఈ మేరకు వెలువడిన ఒక ప్రకటన పేర్కొంది. స్మార్ట్ బజార్, స్మార్ట్ సూపర్‌స్టోర్, స్మార్ట్ పాయింట్, రిలయన్స్ ఫ్రెష్‌సహా దేశ వ్యాప్తంగా 2,700 విస్తృతస్థాయి స్మార్ట్ స్టోర్స్ నెట్‌వర్క్ కస్టమర్లకు అందుబాటులో ఉంటుందని వివరించింది.
Comments
Please login to add a commentAdd a comment