Jiomart
-
రిలయన్స్ షాక్: ఉద్యోగాలు ఫట్; రానున్న కాలంలో వేలాది కోతలు!
సాక్షి, ముంబై: రిలయన్స్ ఇండస్ట్రీస్ కూడా వేలాది ఉద్యోగాలను తీసివేస్తున్న కంపెనీలో చేరబోతోంది. ఆసియా బిలియనీర్ ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ ఆన్లైన్ హోల్‌సేల్ ఫార్మాట్ జియోమార్ట్ వెయ్యి మందికి పైగా ఉద్యోగులను తొలగించినట్లు సమాచారం. రానున్న కాలంలో ఇది మరింత పెరగనుందనే అంచనాలు ఆందోళనకు దారి తీసింది. ది ఎకనామిక్ టైమ్స్ నివేదిక ప్రకారం రానున్న కాలంలో హోల్‌సేల్ విభాగం జియోమార్ట్ ఉద్యోగుల్లో మూడింట రెండు వంతు, సుమారు 15వేల మందిని తొలగించనుంది. అంతేకాదు స్థానిక పొరుగు దుకాణాలకు కిరాణా ,సాధారణ వస్తువులను సరఫరా చేసే150 ఫుల్ఫిల్మెంట్ కేంద్రాలలో సగానికి పైగా మూసివేయాలని కూడా జియోమార్ట్ యోచిస్తోంది. (అన్నీ సాహసాలే: ఆరు నెలలకే వేల కోట్ల బిజినెస్!) రిలయన్స్ రిటైల్ తన జియోమార్ట్ బిజినెస్-టు-బిజినెస్ వర్టికల్ను ఏకీకృతం చేయడం ప్రారంభించింది. 3,500 మంది ఉద్యోగులతో కూడిన మెట్రో శాశ్వత ఉద్యోగులను చేర్చుకున్న తరువాత, ఉద్యోగాల కోతతోపాటు, కంపెనీ మార్జిన్లను మెరుగు పర్చుకోవడానికి, నష్టాలను తగ్గించుకోవాలని చూస్తోంది. ఇటీవల మెట్రో క్యాష్ అండ్ క్యారీ కొనుగోలు చేసిన కంపెనీ తన కార్యకలాపాలసమీక్ష అనంతర తాజా నిర్ణయం వెలుగులోకి వచ్చింది. గత కొన్ని రోజులుగా కంపెనీ తన కార్పొరేట్ కార్యాలయంలోని 500 మంది ఎగ్జిక్యూటివ్‌లతో సహా 1,000 మందిని రాజీనామా చేయమని కోరింది. ఇప్పటికే పనితీరు మెరుగుదల ప్రణాళిక (PIP)లో ఉన్న వందలాది మంది ఉద్యోగులతో మరింత మందిని తొలగించాలని యోచిస్తోందని సమాచారం. ఆయా ఉద్యోగుల స్థిర వేతనాన్ని తగ్గించిన తర్వాత మిగిలిన సేల్స్ ఉద్యోగుల్ని వేరియబుల్ పే స్ట్రక్చర్‌లో ఉంచినట్టు తెలుస్తోంది. మరిన్ని బిజినెస్ వార్తలో కోసం చదవండి: సాక్షిబిజినెస్ -
జియోమార్ట్ ఫెస్టివల్ ఆఫర్.. అన్ని కేటగిరీల ప్రొడక్టులపై ఊహించని డిస్కౌంట్లు!
నవరాత్రి, దసరా, దీపావళి ఇలా వరుసగా పండుగల నేపథ్యంలో ఈ నెల 23వ తేదీ నుంచి ఫేవరేట్ ఈకామర్స్ ప్లాట్‌ఫామ్– జియోమార్ట్ ప్రత్యేక ఆఫర్లను అందించనుంది. ‘‘ఫెస్టివ్ రెడీ సేల్’ పేరుతో ఈ నెల 27వ తేదీ వరకూ ఆఫర్లు అందుబాటులో ఉంటాయి. అన్ని కేటగిరీల ప్రొడక్టులపై విస్తృత శ్రేణిలో పొదుపు ఆఫర్లు లభిస్తాయని ఈ మేరకు వెలువడిన ఒక ప్రకటన పేర్కొంది. స్మార్ట్ బజార్, స్మార్ట్ సూపర్‌స్టోర్, స్మార్ట్ పాయింట్, రిలయన్స్ ఫ్రెష్సహా దేశ వ్యాప్తంగా 2,700 విస్తృతస్థాయి స్మార్ట్ స్టోర్స్ నెట్వర్క్ కస్టమర్లకు అందుబాటులో ఉంటుందని వివరించింది. చదవండి: యూట్యూబ్ యూజర్లకు పండగే..45 శాతం ఆదాయం -
వచ్చేస్తోంది.. జియోమార్ట్ ఎక్స్‌ప్రెస్..
గ్రాసరీస్ హోం డెలివరీ సర్వీస్‌లపై బడా కంపెనీలు దృష్టి పెట్టాయి. ఇప్పటికే స్టార్టప్‌లు ఈ రంగంలో దూసుకుపోతుండగా మార్కెట్ బిగ్ ప్లేయర్స్ సైతం రంగంలోకి దిగేందుకు తహతహలాడుతున్నారు. అందులో భాగంగా జియో సంస్థ సైతం సన్నహకాలు జోరుగా సాగిస్తోంది. గ్రోసరీస్ డెలివరీ సర్వీసులను జియోమార్ట్ ఎక్స్‌ప్రెస్ పేరుతో మార్కెట్లోకి తెచ్చేందుకు రిలయన్స్ ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే ప్రయోగాత్మకంగా నవీ ముంబైలో ఈ సేవలు ప్రారంభించింది. ఈ ఏడాది చివరి నాటికి దేశవ్యాప్తంగా 200 నగరాలు, పట్టణాల్లో భారీ ఎత్తున గ్రాసరీస్ డెలివరీ చేయాలని డిసైడ్ అయ్యింది. జెప్టో, బ్లింకిట్ వంటి స్టార్టప్ సంస్థలు పది నిమిషాల్లో గ్రోసరీస్ డెలివరీ లక్ష్యంగా పని చేస్తున్నాయి. అయితే రిలయన్స్ సంస్థ ఇటువంటి టార్గెట్స్లను పెట్టుకోలేదు. 90 నిమిషాల్లో డెలివరీకే ప్రాధాన్యత ఇస్తోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా విస్తరించిన రిలయన్స్ మార్క్ట్ నెట్‌వర్క్‌ను ఉపయోగించుకుంటూ సేవలు అందించేందుకు రెడీ అవుతోంది. మార్కెట్ వర్గాల అంచనా ప్రకారం ఫ్రీ హోం డెలివరీకి కనీసం రూ.199 బిల్ చేయాల్సి ఉంటుంది. చదవండి: కొత్త బిజినెస్‌లోకి యాపిల్, గూగుల్ ఫ్యూచర్ ఏంటో! -
బిగ్ బాస్కెట్, జియో మార్ట్‌లకు పోటీగా...బిగ్ బజార్ భారీ స్కెచ్..!
కోవిడ్-19 రాకతో భారత్‌లో ఆన్లైన్ గ్రాసరీ డెలివరీ సేవలు భారీ ఎత్తున ఊపందుకున్నాయి. ఈ సేవలను అందించడంలో బిగ్ బాస్కెట్, ఇన్‌స్టామార్ట్, బ్లిన్క్ఇట్(గ్రోఫర్స్), జియో మార్ట్ లాంటి కంపెనీలు ఇప్పటికే ముందంజలో ఉన్నాయి. ఆన్లైన్ డెలివరీ సేవలను అందించడంలో ఫ్యుచర్ గ్రూప్‌కు చెందిన రిటైల్ చైన్ సంస్థ బిగ్ బజార్ భారీ ప్రణాళికలను సిద్ధమైన్నట్లు సమాచారం. బెంగళూరు కంపెనీతో భాగస్వామ్యం..! బిగ్ బజార్ ఆయా నగరాల్లో రెండు గంటల్లో కస్టమర్లకు గ్రాసరీ సేవలను అందిస్తోంది. మరింత వేగవంతమైన ఆన్లైన్ గ్రాసరీ సేవలను అందించేందుకుగాను బెంగళూరుకు చెందిన ఈవెంట్ మార్కెటింగ్ టెక్నాలజీ స్టార్టప్ ఎర్సెస్ లైవ్ (Ercess Live)తో బిగ్ బజార్ ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. వీరి మధ్య ఈ ఒప్పందం గత ఏడాది డిసెంబర్లోనే జరిగింది. ఈ ఒప్పందం ప్రకారం..ఎర్సెస్ లైవ్ ఆన్లైన్ గ్రాసరీ సేవల్లో భాగంగా బిగ్ బజార్‌కు స్ట్రాటిజిక్ వ్యూహాలను అందించనున్నట్లు సమాచారం. ఈ నెల జనవరిలో ఆన్లైన్ గ్రాసరీ సేవలను బిగ్ బజార్ మొదలుపెట్టనున్నట్లు తెలుస్తోంది. ముందుగా దక్షిణ భారత్‌లో తన కొత్త హోమ్ డెలివరీ సేవలను బిగ్ బజార్ ప్రారంభించనుంది. డంజోతో రిలయన్స్ భారీ డీల్..! దేశవ్యాప్తంగా ఆన్లైన్ కిరాణా వ్యాపారాన్ని మరింత వేగవంతం చేసేందుకుగాను ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన రిటైల్ చైన్ సంస్థ రిలయన్స్ రిటైల్ ఆన్లైన్ డెలివరీ ప్లాట్‌ఫాం డంజోతో కలిసే పనిచేసేందుకు సిద్దమైన విషయం తెలిసిందే. అందుకోసం డంజోలో 25.8 శాతం వాటాలను రిలయన్స్ కొనుగోలుచేసినట్లు తెలుస్తోంది. ఈ డీల్ విలువ సుమారు రూ. 1,488 కోట్లు. డంజో భాగస్వామ్యంతో జియో మార్ట్, రిలయన్స్ రిటైల్ సేవలను మరింత వేగవంతంగా అందిస్తామని రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ డైరెక్టర్ ఇషా అంబానీ తెలిపారు. ఇక దేశవ్యాప్తంగా ఆన్లైన్ గ్రాసరీ డెలివరీ సేవల్లో బిగ్ ప్లేయర్స్‌గా జియో మార్ట్, బిగ్ బాస్కెట్స్ ముందుస్థానంలో ఉన్నాయి. చదవండి: ఉచితంగా నెట్‌ఫ్లిక్స్, డిస్నీ+హాట్‌స్టార్, అమెజాన్ ప్రైమ్ సబ్స్క్రిప్షన్..! వీటితో పాటుగా మరో 14 ఓటీటీ సేవలు ఉచితం..! -
వాట్సాప్ ద్వారా నిత్యావసర సరుకులు డెలివరీ
నిత్యావసరాలు, కూరగాయలు మొదలైన వాటిని వాట్సాప్ ద్వారా ఆర్డరు చేస్తే ఇంటి వద్దకే అందించేలా రిటైల్ దిగ్గజం జియోమార్ట్ కొత్త సర్వీసు ప్రవేశపెడుతోంది. ఫ్యూయల్ ఫర్ ఇండియా పేరిట మెటా నిర్వహించిన కార్యక్రమంలో జియో ప్లాట్‌ఫామ్స్ డైరెక్టర్లు ఆకాశ్ అంబానీ, ఈషా అంబానీ దీన్ని ప్రయోగాత్మకంగా ప్రదర్శించారు. ‘బ్రెడ్, పండ్లు..కూరగాయలు, శీతలపానీయాలు ఇలా ఏ సరుకులైనా, ఆ రోజుకు కావాల్సినా లేక ఆ వారానికి కావాల్సినవైనా జియోమార్ట్‌కు వాట్సాప్ ద్వారా ఆర్డరు చేయొచ్చు. తరచుగా కావాలంటే సబ్స్క్రయిబ్ చేసుకోవచ్చు. మీ కొనుగోళ్ల చరిత్రను బట్టి వ్యక్తిగత సిఫార్సులు పొందవచ్చు‘ అని ఈషా అంబానీ పేర్కొన్నారు. ‘వాట్సాప్ ద్వారా కొనుగోలు ప్రక్రియ అత్యంత సరళంగా, సులభతరంగా ఉంటుంది‘ అని ఆకాశ్ తెలిపారు. రిలయన్స్ గ్రూప్‌లో భాగమైన రిలయన్స్ రిటైల్ నెట్వర్క్ ద్వారా ఆర్డర్ల డెలివరీ ఉంటుంది. దేశీయంగా రిటైల్ వ్యయాల్లో ఆహారం, కిరాణా సరుకుల వాటా భారీగా ఉంటుంది. 2025 నాటికి ఇది 1.3 లక్షల కోట్ల డాలర్ల స్థాయికి చేరవచ్చని బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ అంచనా. జియోమార్ట్ నెట్‌వర్క్‌లో ప్రస్తుతం 5 లక్షల పైచిలుకు రిటైలర్లు ఉన్నారని, ఈ సంఖ్య గణనీయంగా పెరుగుతోందని ఆకాష్ వివరించారు. వాట్సాప్‌తో రీచార్జ్ కూడా.. టెలికం దిగ్గజం రిలయన్స్ జియో ప్రీపెయిడ్ యూజర్లు సైతం త్వరలో వాట్సాప్ ద్వారా రీచార్జి చేయించుకోవచ్చని ఆకాశ్ పేర్కొన్నారు. చెల్లింపులతో పాటు మొబైల్ రీచార్జింగ్లకు కూడా వాట్సాప్ ఉపయోగపడనుండటం ఆసక్తికరమని ఆయన తెలిపారు. 2022లో జియో ఈ ఫీచర్‌ను ప్రవేశపెట్టనుంది. రీచార్జింగ్ ప్రక్రియను ఇది మరింత సులభతరం చేస్తుందని, రీచార్జ్ వంటి అవసరాల కోసం బైటికి వెళ్లలేని సీనియర్ సిటిజన్లులాంటి వారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఈషా అంబానీ తెలిపారు. 2021 సెప్టెంబర్ ఆఖరు నాటికి జియోకు 42.95 కోట్ల మంది యూజర్లు ఉన్నారు. -
జియో యూజర్లకు గుడ్‌న్యూస్..!
జియో యూజర్లకు గుడ్‌న్యూస్..! ప్రముఖ టెలికాం దిగ్గజ సంస్థలు ఎయిర్టెల్, వోడాఫోన్ ఐడియా టారిఫ్ రేట్లను పెంచడంతో జియో కూడా తన యూజర్లకు షాకిస్తూ టారిఫ్ ప్లాన్లను ధరలను పెంచింది. కాగా పెరిగిన ధరల నుంచి ఉపశమనం ఇస్తూ ..పలు ప్రీపెయిడ్ ప్లాన్స్‌పై క్యాష్‌బ్యాక్‌ను జియో అందిస్తోంది. 20 శాతం క్యాష్‌బ్యాక్..! రిలయన్స్ జియో తన మూడు ప్రీపెయిడ్ ప్లాన్స్ రీఛార్జీపై 20 శాతం జియోమార్ట్ క్యాష్‌బ్యాక్‌ను అందిస్తోంది. రూ.719, రూ.666, రూ. 299 ప్లాన్లతో రీఛార్జ్ చేసుకుంటే 20 శాతం సుమారు రూ.200 వరకు క్యాష్‌బ్యాక్‌ను యూజర్లు సొంతం చేసుకోవచ్చును. అన్ని రిలయన్స్ రిటైల్ స్టోర్లు , జియో మార్ట్, ఆజియో, రిలయన్స్ ట్రెండ్స్, నెట్‌మెండ్స్, రిలయన్స్ డిజిటల్లో ఈ క్యాష్‌బ్యాక్‌ను వాడవచ్చును. ఒక కస్టమర్ ప్రతి రోజు రూ.200 వరకు గెలుచుకునే అవకాశం ఉంది. క్యాష్‌బ్యాక్ ఎలా వస్తోందంటే..! ఆయా ప్లాన్లను రీఛార్జ్ చేసిన మూడు రోజులలోపు వినియోగదారుల ఖాతాకు క్యాష్‌బ్యాక్ క్రెడిట్ అవుతుంది. ఈ క్యాష్‌బ్యాక్‌ను వివిధ రిలయన్స్ రిటైల్ ఛానెళ్ల నుంచి రీడీమ్ చేసుకోవచ్చను. చదవండి: 15 నిమిషాల్లోనే సరుకులు డోర్ డెలివరీ: స్విగ్గీ -
మరిన్ని సంస్థల కొనుగోళ్లపై కన్నేసిన రిలయన్స్
కొత్తగా ప్రారంభించిన ఆన్లైన్ గ్రోసరీ ప్లాట్ఫార్మ్. జియోమార్ట్‌ను మరింత పటిష్టం చేసే ప్రయత్నాలను రిలయన్స్ ఇండస్ట్రీస్ ముమ్మరం చేసింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ సంస్థ ఇటీవలనే నెట్‌మెడ్స్ (ఆన్లైన్ ఫార్మసీ సంస్థ)ను కొనుగోలు చేసింది. జియోమార్ట్ కోసమే ఈ కొనుగోలు జరిగింది. జయోమార్ట్ కార్ట్‌లో ఆన్లైన్ ఫార్మసీతో పాటు భవిష్యత్తులో మరిన్ని విభాగాలు జత చేయాలని రిలయన్స్ ఇండస్ట్రీస్ యోచిస్తోంది. మరోవైపు 2019 నుంచి కొంటూ వస్తున్న వివిధ సంస్థలను (గ్రాబ్, ఫైండ్ తదితర సంస్థలు) పూర్తిగా రిలయన్స్ రిటైల్‌లో సమ్మిళితం చేసి జియోమార్ట్‌ను మరింత పటిష్టం చేయనున్నది. రిలయన్స్ రిటైల్‌కు ఇప్పటికే ట్రెండ్స్, డిజిటల్, జ్యూయల్ విభాగాలున్నాయి. ప్రస్తుతం రిలయన్స్ జియోమార్ట్ పండ్లు, కూరగాయలు, పాలు, పాల ఉత్పత్తులు, ఫాస్ట్ మూవింగ్ కన్సూమర్ గూడ్స్(ఎఫ్ఎమ్సీజీ) విక్రయిస్తోంది. త్వరలోనే మరిన్ని వ్యాపార విభాగాలు–ఫ్యాషన్, లైఫ్‌స్టైల్, ఎలక్ట్రానిక్స్ జత చేయనున్నది. ఫ్యాషన్ స్టార్టప్ జివామెలో రోనీ స్క్రూవాలకు ఉన్న 15 శాతం వాటాను రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన రిలయన్స్ బ్రాండ్స్ కొనుగోలు చేసింది. ఈ కంపెనీలో మరింత వాటాను కొనుగోలు చేసే ప్రయత్నాలు చేస్తోంది. ఆన్లైన్ ఫర్నీచర్ సంస్థ, అర్బన్ ల్యాడర్‌ను, గ్రోసరీ డెలివరీ సంస్థ మిల్క్ బాస్కెట్‌ను కూడా రిలయన్స్ కొనుగోలు చేయనున్నదని సమాచారం. (వాటా విక్రయం ఉండదని, త్వరలోనే ఐపీఓకు వస్తామని ఇటీవలే మిల్క్ బాస్కెట్ స్పష్టం చేసింది) ఆన్లైన్ సంబంధిత స్టార్టప్‌లను.. కుదిరితే పూర్తిగా కొనేయడమో లేదంటే ఎంతో కొంత వాటానైనా చేజిక్కించుకోవడమో... ఇది రిలయన్స్ జియోమార్ట్ వ్యూహం. నిధులు పుష్కలం... గత రెండు నెలల్లో 8.5 శాతం వాటా విక్రయం ద్వారా రిలయన్స్ రిటైల్ రూ.37,710 కోట్లు సమీకరించింది. జియోమార్ట్ విస్తరణ కోసం ఈ నిధులను వినియోగించుకోనున్నది. కరోనా కల్లోలం నేపథ్యంలో ఈ కామర్స్ సంస్థలు–అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌ల పంట పడింది. మరింత మార్కెట్ వాటా పెంచుకోవడం కోసం ఈ రెండు సంస్థలు భారీగా పెట్టుబడులు పెట్టనున్నాయి. భారత్‌లో ఇన్వెస్ట్ చేయడానికి అమెజాన్ సంస్థ వంద కోట్ల డాలర్లు కేటాయించింది. మరోవైపు ఫ్లిప్‌కార్ట్ సంస్థ 120 కోట్ల డాలర్ల నిధులు సమీకరించింది. సూపర్ మార్కెట్ల చెయిన్‌లో సంచలనం సృష్టించిన డీమార్ట్, దిగ్గజ వ్యాపార సంస్థ టాటా గ్రూప్(బిగ్‌బాస్కెట్‌లో టాటాలకు వాటా ఉంది) కూడా అన్లైన్ గ్రోసరీ మార్కెట్లోకి ప్రవేశించనున్నాయి. సగం సరుకులు జియోమార్ట్వే ఇటీవలే మొదలైనా జియోమార్ట్ అమెజాన్ ఇండియా, ఫ్లిప్‌కార్ట్‌లకు ధీటుగా వేగంగా వృద్ధి చెందే ఈ కామర్స్ ప్లాట్ఫార్మ్గా అవతరించనున్నది. కార్యకలాపాలు ప్రారంభించి కొద్ది కాలమే అయినప్పటికీ, రిలయన్స్ దన్నుతో ఈ సంస్థ దూసుకుపోతోంది. కొన్నేళ్లలో భారత్‌లో ఆన్లైన్లో అమ్ముడయ్యే మొత్తం సరుకుల్లో(వస్తువులు)సగం రిలయన్స్ జియోమార్ట్వే ఉండనున్నాయని అంతర్జాతీయ రీసెర్చ్ సంస్థ గోల్డ్‌మన్ శాక్స్ తన నివేదికలో వెల్లడించింది. ఈ కామర్స్ మార్కెట్లో ప్రస్తుతం జియోమార్ట్ వాటా 1 శాతంగానే ఉందని, ఐదేళ్లలో ఇది 31 శాతానికి ఎగబాకుతుందని గోల్డ్‌మన్ శాక్స్ అంచనా వేస్తోంది. వాట్సాప్ ద్వారా చెల్లింపులకు ఆమోదం లభించడం జియోమార్ట్‌కు మరింత కిక్‌ను ఇవ్వనున్నది. (వాట్సాప్ మాతృసంస్థ ఫేస్బుక్ ఇటీవలనే రిలయన్స్ జియోలో భారీగా పెట్టుబడులు పెట్టింది) ఇక జియోమార్ట్ 1,700 మంది మర్చంట్లతో భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది. 20 నగరాల్లో కిరాణా వ్యాపారులతో ఒప్పందాలు కుదుర్చుకుంది. మరోవైపు పోటీ సంస్థలు గ్రోఫర్స్, స్విగ్గీ స్టోర్స్, బిగ్‌బాస్కెట్ తదితర సంస్థల విస్తరణ అంతంతమాత్రంగానే ఉంది. ప్రస్తుతం జియోమార్ట్‌లో రోజుకు నాలుగు లక్షల ఆర్డర్లు వస్తున్నాయని అంచనా. లాక్డౌన్ ఆంక్షలు సడలించిన తర్వాత కూడా ఆన్లైన్ ద్వారా సరుకుల అమ్మకాలు జోరు తగ్గలేదు. ఆర్థిక మందగమన కాలంలో ఆకర్షణీయ డిస్కౌంట్లు ఇస్తుండటమే దీనికి ఒక కారణం. గ్రోఫర్స్, బిగ్ బాస్కెట్లతో పాటు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌ల గ్రోసరీ విభాగాల అమ్మకాలు అంతకంతకూ పెరుగుతుండటమే దీనికి నిదర్శనం. జోరుగా యాప్ డౌన్లోడ్లు... రిలయన్స్‌కు చెందిన జియోమార్ట్ (గ్రోసరీ), అజియో(దుస్తులు) యాప్‌ల డౌన్లోడ్స్ రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి. బిగ్‌బాస్కెట్, గ్రోఫర్స్ యాప్‌ల డౌన్లోడ్ల కంటే రెట్టింపు జియోమార్ట్ యాప్‌ల డౌన్లోడ్లు జరుగుతున్నాయి. డౌన్లోడ్లు జోరుగా ఉంటే లావాదేవీలు జరిగినట్లు కానప్పటికీ, భవిష్యత్తులో లావాదేవీలు పెరగడానికి ఈ డౌన్లోడ్లు ఒక సంకేతమని గోల్డ్‌మన్ శాక్స్ అంటోంది. సరైన బిజినెస్ మోడల్ లేదు...! ప్రస్తుతం ఈ గ్రోసరీ మార్కెట్లో బిగ్బాస్కెట్దే పై చేయి. తర్వాతి స్థానంలో గ్రోఫర్స్ ఉంది. ఫ్లిప్‌కార్ట్ సంస్థ సూపర్‌మార్ట్, ఫ్లిప్కార్ట్క్విక్ పేరుతో గ్రోసరీలను విక్రయిస్తోంది. అమెజాన్ సంస్థ ప్యాంట్రీ, ఫ్రెష్ సంస్థల ద్వారా సరుకులను అందిస్తోంది. ప్రస్తుతానికి జియోమార్ట్‌తో బిగ్‌బాస్కెట్‌కు, గ్రోఫర్స్‌కు ఎలాంటి ఇబ్బంది లేకున్నా, భవిష్యత్తులో మాత్రం ఈ రెండు కంపెనీలకు జియోమార్ట్ గట్టిపోటీనే ఇచ్చే అవకాశాలున్నాయి. భారీ డిస్కౌంట్లు ఇవ్వాల్సి రావడంతో మార్జిన్లు తక్కువగా ఉండటం, సరఫరా, డెలివరీ తదితర సమస్యలు ఉన్నాయి. ప్రస్తుతానికైతే ఏ సంస్థకూడా ఈ గ్రోసరీ సెగ్మెంట్లో సరైన ‘బిజినెస్ మోడల్’ను ఏర్పాటు చేయలేకపోయాయి. అయితే ఈ సంస్థల వద్ద పుష్కలంగా నిధులు ఉండటంతో ఇవి వివిధ రకాలైన ప్రయోగాలు చేస్తున్నాయి. -
రిలయన్స్ రిటైల్‌లో.. సిల్వర్ లేక్
డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు అనుబంధ విభాగమైన రిలయన్స్ రిటైల్‌లో పీఈ సంస్థ సిల్వర్ లేక్ స్వల్ప వాటాను కొనుగోలు చేయనుంది. 1.75 శాతం వాటాను సొంతం చేసుకునేందుకు సిల్వర్ లేక్ డీల్ కుదుర్చుకున్నట్లు ఆర్ఐఎల్ తాజాగా వెల్లడించింది. ఇందుకు సిల్వర్‌లేక్ రూ. 7,500 కోట్లు వెచ్చించనున్నట్లు తెలియజేసింది. ఈ డీల్‌తో రిలయన్స్ రిటైల్ విలువ రూ. 4.21 లక్షల కోట్లకు చేరినట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం డిజిటల్ అనుబంధ విభాగమైన రిలయన్స్ జియోలో సైతం సిల్వర్ లేక్ ఇన్వెస్ట్ చేసింది. నిధుల సమీకరణ డిజిటల్ అనుబంధ విభాగం రిలయన్స్ జియో బాటలో రిలయన్స్ రిటైల్లోనూ మైనారిటీ వాటా విక్రయం ద్వారా మరిన్ని నిధులు సమకూర్చుకునే ప్రణాళికల్లో ముకేశ్ అంబానీ ఉన్నట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. కంపెనీ వృద్ధి కోసం ఆర్ఐఎల్ వివిధ అవకాశాలను పరిశీలిస్తున్నట్లు తెలియజేశాయి. రిలయన్స్ జియోలో ఇప్పటికే సిల్వర్ లేక్ రూ. 10,202 కోట్లను ఇన్వెస్ట్ చేసిన విషయం విదితమే. రిలయన్స్ జియోలో ఇన్వెస్ట్ చేసిన సంస్థలకు రిలయన్స్ రిటైల్లోనూ వాటా కొనుగోలుకి వీలు కల్పిస్తున్నట్లు తెలుస్తోంది. రిలయన్స్ రిటైల్‌లో 10 శాతంవరకూ వాటాను విక్రయించే ప్రణాళికల్లో ముకేశ్ అంబానీ ఉన్నట్లు చెబుతున్నారు. కన్సాలిడేషన్ గత నెలలో కిశోర్ బియానీ సంస్థ ఫ్యూచర్ గ్రూప్‌నకు చెందిన రిటైల్, హోల్‌సేల్ బిజినెస్‌లను ముకేశ్ అంబానీ దిగ్గజం రిలయన్స్ రిటైల్ సొంతం చేసుకున్న విషయం విదితమే. ఇందుకు రూ. 24,713 కోట్ల డీల్‌ను కుదుర్చుకుంది. తద్వారా దేశీ రిటైల్ రంగంలో కన్సాలిడేషన్ ద్వారా రిలయన్స్ గ్రూప్.. రిటైల్ బిజినెస్‌ను మరింత పటిష్ట పరచుకోనున్నట్లు నిపుణులు తెలియజేశారు. మరోవైపు ఈకామర్స్ దిగ్గజాలు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్(వాల్‌మార్ట్)కు పోటీగా జియో మార్ట్ ద్వారా రిలయన్స్ రిటైల్ వేగంగా విస్తరిస్తున్నట్లు వివరించారు. 2006లో ప్రారంభమైన రిలయన్స్ రిటైల్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా 11,806 స్టోర్లను కలిగి ఉంది. -
నకిలీ జియోమార్ట్ : రిలయన్స్ అలర్ట్
సాక్షి, ముంబై: రిలయన్స్ రిటైల్ లిమిటెడ్ ఆన్లైన్ కిరాణా షాపింగ్ పోర్టల్ జియోమార్ట్ కు నకిలీ సెగ తగిలింది. దీంతో సంస్థ అధికారికంగా స్పందించింది. జియోమార్ట్ పేరు మీద ఫ్రాంఛైజీలను కోరుతున్న అక్రమార్కుల గురించి తమ దృష్టికి వచ్చిందని రిలయన్స్ రిటైల్ సంస్థ తాజాగా ప్రకటించింది. ప్రస్తుతం తాము ఎవరికీ డీలర్షిప్ లేదా ఫ్రాంఛైజ్‌లు ఇవ్వడం లేదని స్పష్టం చేసింది. అలాంటి నకిలీ వెబ్సైట్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలను హెచ్చరించింది. (చదవండి: జియో మార్ట్ దూకుడు: ఉచిత డెలివరీ ) జియోమార్ట్ బ్రాండ్ కింద ఆన్లైన్ కిరాణా సేవలను రిలయన్స్ ఇటీవల ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే జియోమార్ట్ పేరుతో నకిలీ వెబ్‌సైట్స్ రూపొందించి, రిలయన్స్ రీటైల్‌తో సంబంధం ఉన్న వ్యక్తులుగా నమ్మిస్తున్నారని, జియోమార్ట్ ఫ్రాంఛైంజీలు ఇస్తామని మోసాలకు పాల్పడుతున్నారని రిలయన్స్ రిటైల్ హెచ్చరించింది. అసలు జియోమార్ట్ పేరుతో డీలర్షిప్, ఫ్రాంఛైజ్ మోడల్ లాంటి సేవల్ని ప్రారంభించలేదని తెలియజేసింది. డీలర్షిప్, ఫ్రాంఛైజీల కోసం ఏ ఏజెంట్‌ను నియమించలేదని స్పష్టం చేసింది. ఫ్రాంఛైజీల పేరుతో డబ్బులు వసూలు చేయబోమని తెలిపింది. అలాగే అలాంటి వ్యక్తులతో జరిపే లావాదేవీలకు తాము బాధ్యత వహించమని ప్రజలు, తయారీదారులు, వ్యాపారులు, డీలర్లను హెచ్చరిస్తున్నామని కంపెనీ విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది. అంతేకాదు తమ ప్రతిష్టకు భంగం కలిగిస్తూ, తన బ్రాండ్‌ను దుర్వినియోగం చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించింది. రిలయన్స్ రీటైల్ పేర్కొన్న నకిలీ వెబ్‌సైట్స్ 1. jmartfranchise.in 2. jiodealership.com 3. jiomartfranchises.com 4. jiomartshop.info 5. jiomartreliance.com 6. jiomartfranchiseonline.com 7. jiomartsfranchises.online 8. jiomart-franchise.com 9. jiomartindia.in.net 10. jiomartfranchise.co జియోమార్ట్ ఫ్రాంఛైజ్ పేరుతో ఎవరైనా మిమ్మల్ని సంప్రదించినా, డబ్బులు అడిగినా అలాంటి వారిపై తమకు ఫిర్యాదు చేయాలని రిలయన్స్ రిటైల్ కోరింది. IP Legal, Reliance Retail Limited Building 30, C wing, CA 05, Reliance Corporate Park, Thane Belapur Road, Ghansoli, Navi Mumbai 400701 Email: IP.legal@ril.com -
త్వరలో రిలయెన్స్ 5జీ నెట్వర్క్
ముంబై: రిలయెన్స్ జియోతో టెలికాం మార్కెట్లో సంచలనాలు సృష్టిస్తు దిగ్గజ కంపెనీగా రిలయెన్స్ పేరు గాంచింది. ఈ నేపథ్యంలో రిలయెన్స్ జియో త్వరలోనే 5జీ టెక్నాలజీతో వినియోగదారులను ఆకట్టుకోనుంది. మౌళిక సదుపాయాల కల్పనకు అధిక పప్రాధాన్యత ఇవ్వనున్నట్లు జియో తెలిపింది. 5జీ టెక్నాలజీని వినియోగదారులకు అందించడానికి రిలయెన్స్ తీవ్రంగా కృషి చేస్తున్న నేపథ్యంలో టెక్నాలజీకి అయ్యే ఖర్చు తగ్గనున్నట్లు నిపుణులు తెలిపారు. టెక్నాలజీలో అగ్రస్థానంలో కొనసాగుతున్న జియో 5 జీని అతి త్వరలో తీసుకురానున్నట్లు సంస్థ ఉన్నతాధికారులు తెలిపారు. అయితే ఇటీవల కాలంలో రిలయెన్స్ సంస్థ జియో మార్ట్, జియో ఫైబర్, రిలయెన్స్ డిజిటల్ తదితర విభాగాలుగా వినియోగదారులకు మెరుగైన సేవలను అందిస్తుంది. కాగా రిలయోన్స్ దూకుడుతో ప్రపంచ దిగ్గజ కంపెనీలు రిలయెన్స్‌తో జత కట్టడానికి క్యూ కట్టాయి. ముఖ్యంగా ఐటీ దిగ్గజాలు గూగుల్, ఫేస్బుక్, క్వాల్కమ్ తదితర ఐటీ సంస్థలు ఇప్పటికే రిలయెన్స్‌తో కలిసి పనిచేయనున్నాయి. చదవండి: జియో మార్ట్ దూకుడు: ఉచిత డెలివరీ -
10 లక్షలకు పైగా డౌన్లోడ్లతో టాప్‌లో
సాక్షి, ముంబై: రిలయన్స్‌కు చెందిన రీటైల్ ప్లాట్‌ఫాం జియోమార్ట్ డౌన్లోడ్లలో దూసుకుపోతోంది. ఆండ్రాయిడ్, ఐఫోన్ యూజర్ల కోసం లాంచ్ చేసిన కొన్ని రోజుల్లోనే ఈ యాప్ 10 లక్షలకు పైగా డౌన్లోడ్లను సాధించింది. (జియో మార్ట్ దూకుడు: ఉచిత డెలివరీ) దేశవ్యాప్తంగా 200 నగరాల్లో బీటా మోడ్‌లో ప్లాట్‌ఫామ్ లభ్యతను ఆర్ఐఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముకేశ్ అంబానీ ప్రకటించిన కొన్ని రోజుల వ్యవధిలోనే జియోమార్ట్ ప్లాట్‌ఫాం తన ప్రత్యేకతను చాటుకుంటోంది. యాప్ బ్రెయిన్ డేటా ప్రకారం గూగుల్ ప్లే స్టోర్ ఆపిల్ యాప్‌స్టోర్‌లో రెండు, మూడు స్థానాలను ఆక్రమించి అత్యంత ప్రజాదరణ పొందిన యాప్ ఘనతను దక్కించుకుంది. ప్రస్తుతం, ఈ షాపింగ్ ప్లాట్‌ఫాం జియోమార్ట్ దేశవ్యాప్తంగా రోజువారీ రెండున్నర లక్షలకు పైగా ఆర్డర్లను పొందుతున్నట్టు సమాచారం. ఎక్కువ మంది వినియోగదారులను ఆకర్షించేందుకు ఆర్డర్ పరిధితో నిమిత్తం లేకుండా ఉచిత డెలివరీ అందిస్తోంది. అలాగే చెల్లింపుల్లో సోడెక్సో మీల్ కూపన్లను కూడా అంగీకరిస్తోంది. దీంతో జియోమార్ట్‌కు భారీ ఆదరణ లభిస్తోందని మార్కెట్‌వర్గాలు భావిస్తున్నాయి. (జియో మార్ట్ ఈ-కామర్స్ సేవలు షురూ) -
జియోమార్ట్‌లో అమెజాన్ వాటా కొనుగోలు..?
రిలయన్స్ ఇండస్ట్రీస్ రిటైల్ వ్యాపార విభాగంలో అమెరికా ఆధారిత ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ 9.9శాతం వాటాను కొనుగోలు చేసేందుకు చర్చలు జరుపుతోందని తెలుస్తోంది. జియోమార్ట్‌లో వ్యూహాత్మక వాటాను కొనుగోలుకు అమెజాన్ ఆసక్తి చూపుతున్నట్లు కొన్ని ఆంగ్లఛానెల్స్ వెల్లడించాయి. కరోనా లాక్ డౌన్ టైమ్ ను సద్వినియోగం చేసుకోనేందుకు ఈ మేలో వాల్‌మార్ట్, అమెజాన్ డాట్‌కామ్‌కు పోటీగా రిలయన్స్ జియోమార్ట్ ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. రిలయన్స్ ఇండస్ట్రీస్ రిటైల్ వ్యాపార విభాగంలో అలాగే అమెజాన్ కూడా భారత్‌లో స్మార్ట్ స్టోర్స్ సదుపాయాన్ని ప్రారంభించింది.భారత్‌లోని చిన్న కిరాణా నెట్వర్క్ స్టోర్లను చేరుకోవడం కోసం జియోమార్ట్ ఈ సాంకేతికతను వినియోగిస్తోంది. ఇప్పటికే జియోమార్ట్ తన కొనుగోలుదార్లు వాట్సప్ ద్వారా ఆర్డర్లు పెట్టడానికి వీలుగా ఒక ఫీచర్‌ను తీసుకొచ్చింది. ప్రస్తుతానికి నవీ ముంబయి, థానే, కల్యాణ్ వంటి ఎంపిక చేసిన ప్రాంతాలకే దీనిని పరిమితం చేసింది. త్వరలోనే దేశంలోని ఇతర ప్రాంతాలకూ విస్తరించనుంది. అయితే ఈ అంశం స్పందించేందుకు ఇరు కంపెనీల అధికార ప్రతినిధులు నిరాకరించారు. -
జియో మార్ట్ దూకుడు: ఉచిత డెలివరీ
సాక్షి, ముంబై: రిలయన్స్ జియోతో టెలికాం మార్కెట్లో సంచలనాలు నమోదు చేసిన రిలయన్స్ ఈ కామర్స్ విభాగం జియోమార్ట్ ద్వారా మరో సునామీ సృష్టించేందుకు మరింత దూకుడుగా సిద్ధమవుతోంది. భారతదేశంలోని 200 నగరాల్లో కిరాణా డెలివరీ సేవలను ప్రారంభించిన రెండు నెలల తరువాత, జియోమార్ట్ తాజాగా ఆండ్రాయిడ్, ఐఫోన్వినియోగదారులకోసం కొత్త యాప్‌ను ఆవిష్కరించింది. తద్వారా జియోమార్ట్ అన్ని ఆర్డర్లపై ఉచిత డెలివరీని కూడా అందిస్తోంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ జూలై15న కంపెనీ 43వ వార్షిక సర్వసభ్య సమావేశంలో జియోమార్ట్ ప్రధాన ప్రణాళికలను ఆవిష్కరించిన కొన్ని రోజుల తరువాత ఈ పరిణామం చోటుచేసుకుంది. వినియోగదారుల కోసం లాంచ్ చేసిన జియోమార్ట్ యాప్ ను గూగుల్ ప్లే స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోవచ్చని జియో ప్రకటించింది. రిలయన్స్ తన లాయల్టీ ప్రోగ్రామ్ రిలయన్స్ వన్ లేదా రోన్‌ను జియోమార్ట్‌కు కూడా విస్తరించింది. తద్వారా వినియోగదారులు అనేక బ్రాండ్లు, ఉత్పత్తులపై ప్రత్యేకమైన ఆఫర్లతో పాటు, రోన్ పాయింట్లను సంపాదించవచ్చని తెలిపింది. ఐదు శాతం డిస్కౌంట్ ను కూడా ఇస్తామని ప్రకటించింది. దీంతో గూగుల్ ప్లే స్టోర్‌లో ఈ యాప్ దూసుకుపోతోంది. ఇప్పటికే 10వేలకు పైగా డౌన్లోడ్లను సంపాదించింది. జియోమార్ట్ వెబ్ సైట్ ద్వారా ఇప్పటికే రోజుకు 2,50,000 ఆర్డర్లు వస్తున్నట్టు జియో వెల్లడించింది. అయితే కొన్ని సమస్యలున్నాయంటూ కొంతమంది యూజర్లు గగ్గోలు పెడుతున్నారు. జియోమార్ట్ ఇంతకుముందు750 రూపాయలు అంతకంటే ఎక్కువ ఆర్డర్లకు మాత్రమే ఉచిత డెలివరీని అందిస్తున్న సంగతి గమనార్హం. అమెజాన్ ప్రస్తుతం ఆర్డర్లకు 799 రూపాయలపైన ఉచిత డెలివరీని అందిస్తుండగా, ఫ్లిప్‌కార్ట్‌లో ఆర్డర్ ఇవ్వడానికి కనీస ఆర్డర్ విలువ 600 రూపాయలు. ఉచిత డెలివరీ కావాలంటే 1,200 రూపాయలు విలువైన వస్తువులను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. గ్రోఫర్స్ 800 లేదా అంతకంటే ఎక్కువ విలువైన ఆర్డర్లకు ఉచిత డెలివరీని అందిస్తుంది. పరిచయ ఆఫర్‌గా, జియోమార్ట్‌లో ప్రతి మొదటి ఆర్డర్‌తో కోవిడ్-19 ఎసెన్షియల్ కిట్‌ను అందిస్తామని ఏజీఎంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. -
జియో మార్ట్ ఈ-కామర్స్ సేవలు షురూ
సాక్షి, హైదరాబాద్ : నిత్యవసర వస్తువుల కొనుగోలు కోసం ఆన్లైన్ సన్‌కు జియో మార్ట్ శ్రీకారం చుట్టింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని పెద్ద నగరాలు, చిన్న పట్టణాల్లో ప్రజలకు నిత్యావసర కిరాణా వస్తువులను ఆన్లైన్లో కొనుగోలు చేసేందుకు రిలయన్స్ రిటైల్ తన ఆన్లైన్ ఇ-కామర్స్ వేదిక ‘జియో మార్ట్’ ను శనివారం ప్రయోగాత్మకంగా ప్రారంభించింది. ఈ రెండు రాష్ట్రాల్లో తొలుత ఎంపిక చేసిన 30 పట్టణాల్లో జియో మార్ట్ సేవలను అందుబాటులోకి తెచ్చినట్టు సంస్థ తెలియజేసింది. తెలంగాణలోని హైదరాబాద్, సికింద్రాబాద్, వరంగల్, నల్గొండ, కరీంనగర్, మహబూబ్‌నగర్, నిజామాబాద్, బోధన్, ఖమ్మం, పాల్వంచ, మిర్యాలగూడ, సిద్ధిపేట, మెదక్, సంగారెడ్డి లలో జియో మార్ట్ సేవలు అందుబాటులోకి వస్తాయి. ఆంధ్రప్రదేశ్ లో విజయవాడ, విశాఖపట్నం, రాజమహేంద్రవరం, చిత్తూరు, కాకినాడ, గుంటూరు, తిరుపతి, తాడేపల్లిగూడెం, తణుకు, కర్నూలు, వినుకొండ, ఉయ్యురు, అనంతపురం, నర్సరావుపేట, భీమవరం, విజయనగరంలో నివసించే వారు కిరాణా వంటి నిత్యావసర వస్తువులను జియో మార్ట్ నుంచి పొందవచ్చు. www.jiomart.com వెబ్సైట్ ద్వారా వినియోగదారులు తమ ప్రాంతంలో సర్వీసుల గురించి తెలుసుకోవచ్చు. ప్రజలకు తమకు అవసరమైన ఆహార, ఆహారేతర వస్తువులు, పండ్లు, కూరగాయలు, నూనెలు, పప్పులు లాంటి బ్రాండెడ్ ప్యాకేజ్డ్ ఫుడ్స్, పానీయాలు, అంట్లు శుభ్రం చేసుకునేవి లాంటి వస్తువులను అందుబాటులో ఉంటాయని ప్రకటించింది. వస్తువుల గరిష్ట అమ్మకం ధరకన్నా 5 శాతం తక్కువ ధరకు వస్తువులను అందిస్తామని సంస్థ పేర్కొంది. ఇక వస్తువుల డెలివరీ కూడా చెప్పిన గడువు కన్నా ముందుగానే తక్కువ సమయంలోనే డెలివరీ చేస్తామని తెలిపింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ గడిచిన ఏజీఎంలో ఈ –కామర్స్ ఫ్లాట్‌ఫామ్ జియో మార్ట్ గురించి ముకేశ్ అంబానీ ప్రస్తావించిన విషయం తెలిసిందే. ఆ క్రమంలోనే దేశ వ్యాప్తంగా 200 నగరాలు, పట్టణాల్లో జియోమార్ట్ సేవలు ప్రస్తుతం ప్రయోగాత్మకంగా అందుబాటులో తెచ్చింది. తర్వాత క్రమంలో మరిన్ని పట్టణాలు, నగరాలకు విస్తరిస్తామని జియోమార్ట్ ప్రకటించింది. చదవండి: జియో మార్ట్ వాట్సాప్ నంబరు ఇదే! -
ప్రత్యర్థులకు గుబులు: దూసుకొచ్చిన జియో మార్ట్
సాక్షి, ముంబై: ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ కు చెందిన ఆన్లైన్ రీటైల్ వెంచర్ జియో మార్ట్ ఆన్లైన్ గ్రాసరీ డెలీవరీ సేవలను ఇపుడు మరింత విస్తరించింది. గత నెల పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించిన ఈ సేవలను తాజాగా మరిన్ని నగరాల్లో ప్రారంభించింది. కరోనా వైరస్ కట్టడికి విధించిన లాక్ డౌన్ ఆంక్షల్లో కొంతమేర సడలింపుల నేపథ్యంలో జియోమార్ట్ కీలకమైన ఆన్ లైన్ గ్రాసరీ సేవల్లోకి మరింత వేగంగా దూసుకొస్తోంది. దేశవ్యాప్తంగా 200కి పైగా పట్టణాల్లో కిరాణా సామాగ్రిని ఇపుడు పంపిణీ చేయనుంది. ఈ మేరకు రిలయన్స్ మార్ట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ దామోదర్ మాల్ ఈ ప్రకటన చేశారు. రాజస్థాన్‌లోని నోఖా, తెలంగాణలోని బోధన్, తమిళనాడులోని నాగర్కాయిల్, ఆంధ్రాలోని తాడేపల్లిగూడెం, రాయగఢ్ (ఒడిశా), బెంగాల్‌లోని డార్జిలింగ్‌లో కంపెనీ సేవలను ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు. దీంతో ఈ సెగ్మెంట్ లో ఉన్న ప్రముఖ ఆన్ లైన్ డెలివరీ సంస్థలు అమెజాన్, ఫ్లిప్ కార్టులకు గట్టి పోటీ ఇవ్వనుంది. (జియోలో కేకేఆర్ భారీ పెట్టుబడి) నవీ ముంబై, థానే, కళ్యాణ్ ప్రాంతాలలో తన సేవలు విజయవంతమైన ఒక నెల తరువాత, అనేక పట్టణాలు, నగరాల్లో తన కార్యకలాపాను విస్తరిస్తున్నట్టు ప్రకటించింది జియోమార్ట్. కొత్తగా ప్రారంభించిన ఇ-కామర్స్ పోర్టల్, జియోమార్ట్.కామ్ ద్వారా కిరాణా, పండ్లు, కూరగాయలు లాంటి ఇతర రోజువారీ కొనుగోళ్లకు వినియోగదారులు లాగిన్ అవ్వవచ్చు. అయితే ప్రస్తుతానికి తన వెబ్ సైట్ ద్వారా మాత్రమే కస్టమర్ల ఆర్డర్స్ తీసుకుంటుండగా, త్వరలో జియోమార్ట్ యాప్ లాంచ్ చేయనుంది. (అమెజాన్‌లో 50 వేల ఉద్యోగాలు) Nokha in Rajasthan; Bodhan in Telangana; Nagarcoil in Tamilnadu; Tadepalligudam in Andhra; Raygada, Odisha; Darjeeling, Bengal. Now on Grocery eComm map, with Fruits&Veggies, too. Next wave of democratisation of modernity. #JioMart Try with your pincode https://t.co/wrKLFTCDwV — Damodar Mall (@SupermarketWala) May 24, 2020 -
జియో మార్ట్ వాట్సాప్ నంబరు ఇదే!
సాక్షి, ముంబై: సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌తో మెగా ఒప్పందం కుదుర్చుకున్న నాలుగు రోజుల తరువాత, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ నేతృత్వంలోని టెలికాం సంస్థ రిలయన్స్ జియోలో జియో రీటైల్ వెంచర్ జియో మార్ట్ ఆన్లైన్ గ్రాసరీ డెలివరీ సేవల కార్యక్రమాన్ని మొదలు పెట్టేసింది. వాట్సాప్ సహకారంతో కిరాణా సరుకులను అందించే ఆన్లైన్ పోర్టల్‌ను టెస్టింగ్ కోసం లాంచ్ చేసింది. కరోనా వైరస్ లాక్డౌన్ కష్టాలు కొనసాగుతున్న వేళ వాట్సాప్ ఆధారిత ఆన్లైన్ షాపింగ్ పోర్టల్ సేవలు ప్రస్తుతం నవీ ముంబై, థానే, కళ్యాణ్‌లో మొదలు పెట్టింది. జియోమార్ట్, దాని కొత్త భాగస్వామి వాట్సాప్‌తో కలిసి,ఈ ప్రాజెక్ట్ పైలట్ రన్‌ను త్వరలోనే అన్ని రాష్ట్రాలకు విస్తరించనుంది. (ఫేస్బుక్ - జియో డీల్ : జుకర్ బర్గ్ సందేశం) జియో మార్ట్ ద్వారా సరుకుల బుకింగ్ జియో మార్ట్ సేవలను ఉపయోగించుకునేందుకు గాను కస్టమర్లు ముందుగా తమ పేరు, చిరునామా, ఫోన్ నంబర్ తదితర వివరాలను నమోదు చేయాలి. తరువాత తమకు కావల్సిన సరుకులను ఆర్డర్ చేయవచ్చు. ఇందుకు జియోమార్ట్ 88500 08000 నంబరును మొబైల్స్ లో సేవ్ చేసుకోవాలి. అనంతరం వాట్సాప్‌లో ఆ నంబర్‌కు హాయ్ అని మెసేజ్ పంపాలి. ఆర్డర్‌ను కోసం జియోమార్ట్ ఒక లింక్‌ను అందిస్తుంది. ఈ లింక్ 30 నిమిషాలు మాత్రమే అందుబాటులో ఉంటుంది. కావల్సిన సరుకులను ఎంచుకున్న తర్వాత, జియోమార్ట్ ఇన్వాయిస్తో పాటు సమీపంలోని స్టోర్ గూగుల్ మ్యాప్స్‌లో స్థానం, చిరునామా, దాన్ని లింక్ ను షేర్ చేస్తుంది. ఆర్డర్ కు సంబంధించిన సరుకులు సిద్ధం అయ్యాక సంబంధిత స్టోర్ నుంచి వినియోగదారుడికి ఎస్ఎంఎస్ వస్తుంది. ప్రతీరోజు సాయంత్రం 5 గంటలలోపు చేసిన ఆర్డర్లకు ఆ తరువాతి 48 గంటల్లోగా డెలివరీ అవుతుంది. లేదా కస్టమర్లు స్టోర్ వద్దే డబ్బులు చెల్లించడంతోపాటు, వస్తువులను అక్కడే తీసుకోవాల్సి వుంటుంది. ప్రస్తుతానికి సంస్థ ఆన్లైన్ చెల్లింపులను అంగీకరించదనీ, త్వరలోనే ఈ వెసులుబాటు అందుబాటులోకి వస్తుందని జియో తెలిపింది. వినియోగదారులు వివిధ గృహ ఆహార ఉత్పత్తులను రాయితీ ధరలకు మాత్రమే బుక్ చేసుకోవచ్చని పేర్కొంది. వినియోగదారులు ఆర్డర్లను సవరించడానికి, లేదా రద్దు చేయడానికి ఆస్కారం లేదనీ, బిల్లింగ్‌కు ముందు సదరుకిరణా షాపులోనే ఇలాంటివి చేసుకోవచ్చని తెలిపింది. ప్రస్తుత కష్టతరమైన సమయంలో జియో మార్ట్ మెగా డీల్ ప్రాధాన్యతను సంతరించుకుందని ఫిన్నోవిటి కన్సల్టింగ్ ఫౌండర్ పీఎన్ విక్రమన్ పేర్కొన్నారు. ఫేస్‌బుక్‌తో ఒప్పందంతో జియోమార్ట్ విస్తరణలో వాట్సాప్ కీలక పాత్ర పోషిస్తుందన్నారు. (అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌కు షాకివ్వనున్న జియో మార్ట్) కాగా టెలికాం సంస్థ రిలయన్స్ జియోలో ప్రముఖ సోషల్ మీడియా సంస్థ ఫేస్బుక్ 9.99 శాతం వాటాను రూ.44 వేల కోట్లకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. తద్వారా జియో ప్లాట్‌ఫామ్స్ లిమిటెడ్‌లో అతిపెద్ద మైనారిటీ వాటాదారుగా నిలిచిన విషయం విదితమే. ఈ క్రమంలోనే ఫేస్‌బుక్‌కు చెందిన వాట్సాప్‌తో కలిసి జియోమార్ట్ సేవలతో అమెజాన్, ఫ్లిప్ కార్ట్ లాంటి సంస్థలకు షాకివ్వనుంది.