సాక్షి, ముంబై: రిలయన్స్ ఇండస్ట్రీస్ కూడా వేలాది ఉద్యోగాలను తీసివేస్తున్న కంపెనీలో చేరబోతోంది. ఆసియా బిలియనీర్ ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ ఆన్‌లైన్ హోల్‌సేల్ ఫార్మాట్ జియోమార్ట్ వెయ్యి మందికి పైగా ఉద్యోగులను తొలగించినట్లు సమాచారం. రానున్న కాలంలో ఇది మరింత పెరగనుందనే అంచనాలు ఆందోళనకు దారి తీసింది.
ది ఎకనామిక్ టైమ్స్ నివేదిక ప్రకారం రానున్న కాలంలో హోల్‌సేల్ విభాగం జియోమార్ట్ ఉద్యోగుల్లో మూడింట రెండు వంతు, సుమారు 15వేల మందిని తొలగించనుంది. అంతేకాదు స్థానిక పొరుగు దుకాణాలకు కిరాణా ,సాధారణ వస్తువులను సరఫరా చేసే150 ఫుల్‌ఫిల్‌మెంట్ కేంద్రాలలో సగానికి పైగా మూసివేయాలని కూడా జియోమార్ట్ యోచిస్తోంది. (అన్నీ సాహసాలే: ఆరు నెలలకే వేల కోట్ల బిజినెస్!)
రిలయన్స్ రిటైల్ తన జియోమార్ట్ బిజినెస్-టు-బిజినెస్ వర్టికల్‌ను ఏకీకృతం చేయడం ప్రారంభించింది. 3,500 మంది ఉద్యోగులతో కూడిన మెట్రో శాశ్వత ఉద్యోగులను చేర్చుకున్న తరువాత, ఉద్యోగాల కోతతోపాటు, కంపెనీ మార్జిన్‌లను మెరుగు పర్చుకోవడానికి, నష్టాలను తగ్గించుకోవాలని చూస్తోంది. ఇటీవల మెట్రో క్యాష్ అండ్ క్యారీ కొనుగోలు చేసిన కంపెనీ తన కార్యకలాపాలసమీక్ష అనంతర తాజా నిర్ణయం వెలుగులోకి వచ్చింది. గత కొన్ని రోజులుగా కంపెనీ తన కార్పొరేట్ కార్యాలయంలోని 500 మంది ఎగ్జిక్యూటివ్‌లతో సహా 1,000 మందిని రాజీనామా చేయమని కోరింది.
ఇప్పటికే పనితీరు మెరుగుదల ప్రణాళిక (PIP)లో ఉన్న వందలాది మంది ఉద్యోగులతో మరింత మందిని తొలగించాలని యోచిస్తోందని సమాచారం. ఆయా ఉద్యోగుల స్థిర వేతనాన్ని తగ్గించిన తర్వాత మిగిలిన సేల్స్ ఉద్యోగుల్ని వేరియబుల్ పే స్ట్రక్చర్‌లో ఉంచినట్టు తెలుస్తోంది.
మరిన్ని బిజినెస్ వార్తలో కోసం చదవండి: సాక్షిబిజినెస్
Comments
Please login to add a commentAdd a comment