ముంబై: రిలయెన్స్ జియోతో టెలికాం మార్కెట్‌లో సంచలనాలు సృష్టిస్తు దిగ్గజ కంపెనీగా రిలయెన్స్ పేరు గాంచింది. ఈ నేపథ్యంలో రిలయెన్స్ జియో త్వరలోనే 5జీ టెక్నాలజీతో వినియోగదారులను ఆకట్టుకోనుంది. మౌళిక సదుపాయాల కల్పనకు అధిక పప్రాధాన్యత ఇవ్వనున్నట్లు జియో తెలిపింది. 5జీ టెక్నాలజీని వినియోగదారులకు అందించడానికి రిలయెన్స్ తీవ్రంగా కృషి చేస్తున్న నేపథ్యంలో టెక్నాలజీకి అయ్యే ఖర్చు తగ్గనున్నట్లు నిపుణులు తెలిపారు.
టెక్నాలజీలో అగ్రస్థానంలో కొనసాగుతున్న జియో 5 జీని అతి త్వరలో తీసుకురానున్నట్లు సంస్థ ఉన్నతాధికారులు తెలిపారు. అయితే ఇటీవల కాలంలో రిలయెన్స్ సంస్థ జియో మార్ట్, జియో ఫైబర్, రిలయెన్స్ డిజిటల్ తదితర విభాగాలుగా వినియోగదారులకు మెరుగైన సేవలను అందిస్తుంది. కాగా రిలయోన్స్ దూకుడుతో ప్రపంచ దిగ్గజ కంపెనీలు రిలయెన్స్‌తో జత కట్టడానికి క్యూ కట్టాయి. ముఖ్యంగా ఐటీ దిగ్గజాలు గూగుల్, ఫేస్‌బుక్, క్వాల్కమ్ తదితర ఐటీ సంస్థలు ఇప్పటికే రిలయెన్స్‌తో కలిసి పనిచేయనున్నాయి.
చదవండి: జియో మార్ట్ దూకుడు: ఉచిత డెలివరీ
Comments
Please login to add a commentAdd a comment