
సాక్షి, బెంగళూరు: కరోనా సంక్షోభం వల్ల ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తమయింది. ఈ నేపథ్యంలో స్టార్టప్ కంపెనీల నుంచి దిగ్గజాల వరకు ఉద్యోగుల తొలగింపు, వేతనాల్లో కోత వంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు. కానీ ఈకామర్స్ దిగ్గజం అమెజాన్ మాత్రం త్వరలో లక్ష ఉద్యోగాలకు నియామకాలు చేపట్టనున్నట్లు సంస్థ ప్రకటించింది. కాగా కరోనా నేపథ్యంలో ఆన్‌లైన్ ఆర్డర్లకు విపిరీతమైన డిమాండ్ పెరిగిందని, మెజారిటీ నియామకాలను ఆన్‌లైన్ డిమాండ్ మేరకు వినియోగించుకుంటామని తెలిపింది. మరోవైపు పార్ట్ టైమ్, ఫుల్‌టైమ్ నిమాయకాలు చేపట్టనున్నట్లు పేర్కొంది. నిత్యావసరాలకు అధిక డిమాండ్ వల్ల 100కొత్త గిడ్డంగులు(వేర్‌హౌస్) ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది.
అయితే గిడ్డంగులలో ప్యాకింగ్ కోసం కొత్తగా నియమించుకునే వారిని ఉపయోగించుకుంటామని పేర్కొంది. సంస్థకు విపరీతమైన సిబ్బంది కొరత వేదిస్తోందని అమెజాన్ వేర్‌హౌస్ ఉన్నతాధికారి బోలర్ డెవిస్ తెలిపారు. అమెరికాలోని న్యూయార్క్, డెట్రాయిట్ తదితర నగరాలలో తీవ్ర కార్మికలు కొరత ఉందని, గంటకు 15డాలర్లు వేతనాలు, అదనంగా 100 డాలర్లు బోనస్‌లు ఇస్తామని ప్రకటించిన కార్మికులు మొగ్గు చూపడం లేదని డెవిస్ పేర్కొన్నారు. మరోవైపు నియామకాలలో ఆన్‌లైన్ షాపింగ్‌కు అధిక సిబ్బందిని వినియోగించుకుంటామని అమెజాన్ పేర్కొంది. (చదవండి: పండుగ సీజన్ : అమెజాన్ కీలక అడుగు)
Comments
Please login to add a commentAdd a comment