joom
-
Joom: భారత్‌లోకి మరో ఈ-కామర్స్ దిగ్గజం.. ఎస్ఎంఈలకు సరికొత్త వేదిక
భారత్‌లోకి మరో ఈ-కామర్స్ దిగ్గజం అడుగు పెట్టింది. లిస్బన్ కేంద్రంగా నడిచే జూమ్(Joom) భారత్‌లోని ఎనిమిది నగరాల్లో కార్యకలాపాలు ప్రారంభించింది. ముంబై, న్యూఢిల్లీ, ఇండోర్, జైపూర్, సూరత్, రూర్కీ, లుథియానాలలో స్థానిక వ్యాపారులు, ఎగుమతిదారుల కోసం ఒక వేదికను ప్రారంభించింది. ఇందులో ఇప్పటికే 350 మందికిపైగా వ్యాపారులు నమోదు చేసుకున్నారు. వీరిలో సగం మంది డైరెక్ట్ టు కస్టమర్ వ్యాపారాల్లో ఇంతకు ముందు ఎప్పుడూ తమ ఉత్పత్తులను గ్లోబల్ మార్కెట్లో విక్రయించలేదు. వారంతా ఇప్పుడు జూమ్ ద్వారా మొదటిసారి అంతర్జాతీయ మార్కెట్లను చేరుకోగలిగారని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ఫ్యాషన్, జువెలరీ, క్రిస్టల్ హీలింగ్, హెల్త్ అండ్ బ్యూటీ, హెల్త్ సప్లిమెంట్స్, స్కిన్ కేర్, హెయిర్ కేర్, ఉమెన్స్ ఫ్యాషన్, యాక్సెసరీస్ వంటి విభాగాల్లో ఉత్పత్తులను అందిస్తోన్న ఈ జూమ్ కంపెనీ భారత్‌లో హెల్మెట్లు, కవచాలు, తేనెటీగల పెంపకందారుల ఉత్పత్తులు, గుర్రాలకు జీనులు, వివిధ రకాల రత్నాలు, తివాచీలు, సాంప్రదాయ వస్త్రాల వంటి ఉత్పత్తుల విక్రయాలను ప్రారంభించింది. తాము 2022 ప్రారంభం నుంచే భారత్‌లోని ప్యాపారులతో అనుసంధానం కోసం ప్రయత్నిస్తున్నామని, ఇందులో పూర్తిగా విజయవంతం కాకపోయినప్పటికీ టాప్-5 కొత్త కంపెనీలలో ఒకటిగా నిలిచామని కంపెనీ ఆసియా-పసిఫిక్ బిజినెస్ డెవలప్మెంట్ హెడ్ మాగ్జిమ్ బెలోవ్ తెలిపారు. జూమ్ ఈ-కామర్స్ కంపెనీని 2016లో లాట్వియాలో స్థాపించారు. 2023 నాటికి భారత్ ఈ సంస్థకు టాప్-2 గ్లోబల్ మార్కట్‌గా నిలుస్తుందని, దీని బీటూసీ ఈ-కామర్స్ మార్కెట్ విలువ 2023 నాటికి 25.8 శాతం వృద్ధితో 5.57 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటుందని గ్రాండ్‌వ్యూ రీసర్చ్ అంచనా వేసింది. ఈ కంపెనీకి ఫార్మా, ఫిన్‌టెక్ , లాజిస్టిక్ వంటి ఈ-కామర్స్ వ్యాపారాలు ఉన్నాయి. 2022 నాటికి ఈ సంస్థకు ప్రపంచవ్యాప్తంగా 400 మిలియన్ల మంది రిజిస్టర్డ్ కస్టమర్లు ఉన్నారు. -
కన్నడ పోరు: మార్కెట్ల జోరు
సాక్షి,ముంబై: ఒకవైపు కర్ణాటక ఎన్నికల ఫలితాలు లెక్కింపు పక్రియ ఉత్కంఠను రాజేస్తున్నాయి. బీజీపే 90కిపైగా స్థానాల్లో లీడింగ్‌లో ఉన్న నేపథ్యంలో స్టాక్‌మార్కెట్లు ఆరంభ నష్టాలనుంచి పుంజుకుంటున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 222 పాయింట్లకు పైగా పుంజుకుని 35,779 వద్ద, నిఫ్టీ 57పాయింట్లు ఎగిసి 10865 వద్ద ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా నిఫ్టీ 11000 వేల స్థాయి వైపు పరుగులు పెడుతోంది. మెటల్, ఫార్మ, రియల్టీ, మెటల్, ఎఫ్ఎంసీజీ, ఐటీ షేర్లలో కొనుగోళ్ల దోరణి నెలకొంది. పవర్‌గ్రిడ్, హెచ్‌యూఎల్, టెక్ మహీంద్రా, గెయిల్, టాటా స్టీల్, టైటన్, ఓఎన్జీసీ, బజాజ్ ఫైనాన్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 3-1 శాతం లాభపడుతుండగా, టాటా మోటార్స్, ఇన్ఫ్రాటెల్, గ్రాసిమ్, ఐషర్, హెచ్‌పీసీఎల్, హెచ్‌సీఎల్ టెక్, సిప్లా నష్టాల్లో కొనసాగుతున్నాయి. -
ఈ షేరు ధర రూ.50 వేలు
ముంబై: దేశీయ టైర్ల ఉత్పత్తి సంస్థ మద్రాస్ రబ్బర్ ఫ్యాక్టరీ లిమిటెడ్ (ఎంఆర్ఎఫ్) షేర్ ధర బుధవారం నాటి మార్కెట్లో రికార్డ్ స్థాయిలో దూసుకుపోయింది. ముడిచమురు ధరలు క్షీణించడంతో ఇటీవల కొద్ది రోజులుగా జోరుమీదున్న టైర్ల ధరలు ఈ రోజు భారీ లాభాల బాటలో సాగాయి. ముఖ్యంగా టైర్ల తయారీ దిగ్గజం ఎంఆర్ఎఫ్ బీఎస్ఈలో 7 శాతం ఎగసి కంపెనీ చరిత్రలో మొట్టమొదటిసారిగా రూ. 50,000 స్థాయిని తాకింది. చెన్నైకు చెందిన ఈ కంపెనీ షేరు సుమారు 3వేలకు పైగా ఎగిసి మదుపర్లు ను విపరీతంగా ఆకర్షిస్తోంది. ఇదే బాటలో మిగిలిన టైర్ల షేర్లుకూడా పయనించాయి. ముఖ్యంగా జేకే టైర్ 8 శాతానికి పైగా, అపోలో టైర్స్ ,సియట్ టైర్స్ 5 శాతానికి పైగా లాభపడ్డాయి. కాగా కంపెనీల ముడిసరుకు వ్యయాల్లో నేచురల్ రబ్బర్ వాటా 40 శాతం కావడమే దీనికి కారణమని విశ్లేషకులు చెబుతున్నారు. సహజ రబ్బర్ ధరలు నేలచూపులు చూస్తుండటంతో ఇటీవల టైర్ల తయారీ షేర్లకు డిమాండ్ పెరిగిన సంగతి తెలిసిందే. దీనికితోడు రుతుపవన ప్రభావంతో రబ్బర్ ఉత్పత్తి పుంజుకోనుంది. ఈ సానుకూల అంశాలు టైర్ పరిశ్రమ లాభాలకు దోహదపడ్డాయని నిపుణులు పేర్కొన్నారు.