ఈ చిత్రాల్లో ఒకదానిలో చేతి వేలిపై ఏదో ఇసుక రేణువు, మరో చిత్రంలో ఓ హ్యాండ్‌బ్యాగ్ కనిపిస్తున్నాయా? ఇసుక రేణువుకు, హ్యాండ్ బ్యాగ్‌కు సంబంధమేంటి అంటారా? సింపుల్.. రెండూ ఒకటే.
ఇలాంటి విచిత్రమైన వస్తులకు పాపులర్ అయిన యూఎస్ ఆర్టిస్ట్ కలెక్టివ్ మిస్చీఫ్.. మరొక ఆఫ్‌బీట్ ప్రొడక్ట్‌తో ఫ్యాన్స్‌ను అలరించారు. కేవలం మైక్రోస్కోప్‌లో మాత్రమే చూడగలిగే అతి సూక్క్ష్మ పర్స్ తయారు చేశారు.
ప్రఖ్యాత ఫ్యాషన్ వస్తువుల కంపెనీ మిస్చీఫ్.. ఫొటోపాలిమర్ రెసిన్‌తో ఈ మైక్రోస్కోపిక్ హ్యాండ్‌బ్యాగ్‌ను తయారు చేసింది. దీని పరిమాణం 700 మైక్రోమీటర్లు (అంటే మిల్లీమీటర్‌లో సగానికంటే ఎక్కువ). సూది రంధ్రం నుంచి సులువుగా దూరిపోగలదు. ఈ నెల 20 నుంచి దీనిని పారిస్‌లో ప్రదర్శనకు పెట్టనున్నారు. ఆ తర్వాత జూపిటర్ వేలం శాలలో వేలం వేయనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment