
జియో ఫోన్.. ఫీచర్ ఫోన్ మార్కెట్‌లో ముఖ్యంగా గ్రామీణ భారతంలో ఈ ఫోన్ నూతన శకాన్ని ఆరంభించింది. కేవలం వాయిస్ నెట్‌వర్క్‌ను మాత్రమే వినియోగించే ఫీచర్ ఫోన్ వినియోగదారులు.. జియోఫోన్‌తో డేటాను కూడా వాడటం ప్రారంభించారు. సరసమైన ధరలో లభించే జియో ఎల్‌టీఈ టారిఫ్ ప్లాన్స్ ద్వారా వీడియో కాల్స్ చేస్తూ అంతులేని మధురానుభూతికి లోనవుతున్నారు. దీంతో పాటు జియోఫోన్ అందిస్తున్న మరో స్పెషల్ ఫీచర్ గ్రామీణ ప్రజానీకానికి విపరీతంగా ఉపయోగపడుతోంది. అదే వాయిస్ కమాండ్. పెద్ద వాళ్లతోపాటు గ్రామీణ భారతంలోని వినియోగదారులు దీన్ని విరివిగా వినియోగిస్తున్నారని కంపెనీ తెలిపింది. జియోఫోన్‌లో విప్లవాత్మకమైన కొత్త వాయిస్ కమాండ్ ఫీచర్, వినియోగదారులకు ఎంతో సులువుగా ఉండటంతో పాటు యాక్సెస్ సౌలభ్యంగా ఉండటమే దీని ప్రత్యేకతని పేర్కొంది..
ఇప్పుడు వినియోగదారులు వాయిస్ కమాండ్‌తో కాల్స్ చేయడంతోపాటు, ఎస్ఎంఎస్ పంపవచ్చని కంపెనీ ప్రకటించింది. వాయిస్ కమాండ్‌తో పాటు వినోదాన్ని పంచే ఎన్నో యాప్స్‌ను కూడా వాడుకోవచ్చని తెలిపింది. ఈ ఫోన్ ఇంటర్‌ఫేస్ 22 భారతీయ భాషలకు సపోర్ట్ చేస్తుందని, దీనివల్ల దేశవ్యాప్తంగా ఉండే వినియోగదారులు తమకిష్టమైన భాషలో ఫోన్‌ను పొందే సౌలభ్యాన్ని సొంతం చేసుకోవచ్చని పేర్కొంది. జియోటీవీ, జియోసినిమా, జియో మ్యూజిక్ తదితర యాప్స్ ద్వారా దేశంలోని చాలా గ్రామీణ ప్రాంతాల్లోని వినియోగదారులు టీవీ ప్రసారాలను ప్రత్యక్షంగా వీక్షించగలుగుతున్నారని వివరించింది. అపరిమితంగా ఉన్న సినిమాలను, వివిధ భాషల్లోని అంతులేని సంగీతాన్ని ఆస్వాదిస్తున్నారని తెలిపింది. తమ చుట్టూ సంగతులతోపాటు నిత్యం ప్రపంచంలో ఏం జరుగుతుందో అని తెలుసుకునేందుకు ఉత్సుకత కనపరిచే వారికి జియోఫోన్ జియోఎక్స్‌ప్రెస్‌న్యూస్ అనే యాప్‌ను అందిస్తోందని... దీంతో రోజువారీ వార్తావిశేషాలను అందిస్తామని వెల్లడించింది. అంతేకాక జియోఫోన్ జియోపే యాప్ ద్వారా డిజిటల్ చెల్లింపులను కూడా ప్రోత్సహిస్తోంది. ఇది ప్రభుత్వ డిజిటల్ ఎజెండాలో భాగమయ్యేందుకు ఎంతగానో ప్రేరణగా నిలుస్తోందని కంపెనీ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment