న్యూఢిల్లీ : రిలయన్స్ జియోఫోన్.. ఫీచర్ ఫోన్ మార్కెట్‌లో ఓ సంచలనం. కంపెనీ వృద్ధిలో కూడా ఈ ఫోన్ కీలక పాత్ర పోషిస్తోంది. ఈ ఫోన్ మార్కెట్‌లోకి వచ్చినప్పటి నుంచి దాదాపు 4 కోట్ల ఫోన్లు అమ్ముడుపోయినట్టు రిపోర్టులు ప్రకటించాయి. క్రెడిట్ స్యూజ్ చేపట్టిన అధ్యయనంలో 2018 జనవరి-మార్చి క్వార్టర్‌లో ఫీచర్ ఫోన్ మార్కెట్ షేరులో జియోఫోన్ 36 శాతం షేరును తన సొంతం చేసుకుందని తెలిసింది. తన మార్కెట్‌బేస్‌ను విస్తరించుకోవడానికి ఇది ఎంతో దోహదం చేసిందని పేర్కొంది. ఈ క్వార్టర్‌లో 2.1 కోట్ల జియోఫోన్ విక్రయాలు జరిగాయని అంటే నెలకు 70 లక్షల జియోఫోన్‌లు అమ్ముడుపోయినట్టు సర్వే పేర్కొంది.
రిపోర్టు ప్రకారం జనవరిలో కంపెనీ అత్యంత చౌకగా రూ.49తో సరికొత్త ప్లాన్‌ను తీసుకొచ్చింది. ఈ ప్లాన్‌తో భారీ ఎత్తున్న జియోఫోన్ విక్రయాలు కూడా నమోదుతున్నాయని రిపోర్టు తెలిపింది. మొత్తంగా జియో వృద్ధికి అత్యంత కీలకమైన పాత్రను జియోఫోన్ పోషిస్తున్నట్టు రిపోర్టు పేర్కొంది. లాంచింగ్ నుంచి మొత్తంగా ఇప్పటి వరకు 4 కోట్ల ఫోన్లు అమ్ముడుపోయినట్టు రిపోర్టు వెల్లడించింది. అయితే జియో ఫోన్ ఇతర ఫోన్ల మార్కెట్ షేరును తినేస్తోందా? లేదా జియో ఫోన్‌ను కస్టమర్లు రెండో డివైజ్‌లాగా కొనుగోలు చేస్తున్నారా? అని తెలుసుకోవడం మాత్రం కష్టతరంగా మారినట్టు సర్వే పేర్కొంది. ఇంక్యూబెంట్ల సబ్‌స్క్రైబర్ బేస్‌ను ఇది తన వైపుకు లాగేసుకోవడం ప్రారంభించిందని నివేదించింది.
Comments
Please login to add a commentAdd a comment