హైదరాబాద్: వేగవంతమైన వీడియో కాన్ఫరెన్సింగ్ సొల్యూషన్ అందించే దిశగా జాబ్రా, లెనొవొ జట్టు కట్టాయి. ఇందులో జాబ్రా రూపొందించిన 180 డిగ్రీల కోణంలోని పనోరమిక్ 4కే ప్లగ్ అండ్ ప్లే వీడియో సొల్యూషన్ పానాక్యాస్ట్50, లెనొవొకి చెందిన థింక్‌స్మార్ట్‌హబ్ భాగంగా ఉంటాయి.
10 అంగుళాల థింక్‌స్మార్ట్ హబ్‌లో మైక్రోసాఫ్ట్ టీమ్స్ అప్లికేషన్ ప్రీ–లోడెడ్‌గా ఉంటుంది. సమావేశాల నిర్వహణను సులభతరం చేసేందుకు ఈ సొల్యూషన్ తోడ్పడగలదని ఇరు సంస్థలు తెలిపాయి.
Comments
Please login to add a commentAdd a comment