వాషింగ్టన్: ఆరుబయట కాకుండా ఆఫీస్, నివాస స్థలం వంటి ఇండోర్ ప్రాంతాల్లో గాలి ద్వారా కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకోవాలంటే ఆరు అడుగుల భౌతిక దూరం సరిపోదని ఓ తాజా అధ్యయనంలో తేలింది. ‘సస్టేనబుల్ సిటీస్, సొసైటీ’ జర్నల్‌లో ఈ అధ్యయనం ఫలితాలు ప్రచురితమయ్యాయి. వైరస్‌ని అడ్డుకోవాలంటే భౌతిక దూరం ఒక్కటే సరిపోదని, మాస్క్ ధరించడం, గదిలో ధారాళంగా గాలి, వెలుతురు ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని పరిశోధకుల అధ్యయనంలో వెల్లడైంది.
చదవండి: కరోనా ఎఫెక్ట్ నిల్.. అంటార్కిటికా కంటే పెద్ద హోల్, 2070 కూడా కష్టమేనా?
నిర్దిష్ట ప్రాంతం గుండా ప్రయాణించే గాలి; వెలుగురు, గాలి వచ్చేందుకు ఉన్న వెంటిలేషన్ పరిస్థితులు; మాట్లాడినపుడు గాల్లోకి వెదజల్లబడే వైరస్ స్థాయి.. ఇలా మూడు ప్రాథమిక అంశాలపై పరిశోధకులు అధ్యయనం కొనసాగించారు. భవంతుల్లో కరోనా వైరస్ సోకిన వ్యక్తులు వదిలే గాలి ద్వారా ఎంత స్థాయిలో వైరస్ వ్యాప్తి చెందుతుందనే తెల్సుకునేందుకే అధ్యయనం చేసినట్లు యూఎస్‌లోని పెన్సిల్వే నియా వర్సిటీ విద్యార్థి జెన్ పీ చెప్పారు.
చదవండి: క్యాన్సర్‌పై సంచలన వివరాలు వెల్లడించిన బ్రిటన్ శాస్త్రవేత్తలు
Comments
Please login to add a commentAdd a comment