సూళ్లూరుపేట(తిరుపతి జిల్లా): భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) గత నెల 14న ప్రయోగించిన చంద్రయాన్–3 మిషన్ లూనార్ ఆర్బిట్ (చంద్రుడి కక్ష్య)లో చంద్రుడికి దగ్గరగా 177 కిలోమీటర్లు, దూరంగా 150 కిలోమీటర్ల ఎత్తులోకి చేరుకుంది.
దీర్ఘ వృత్తాకార కక్ష్యలో తిరుగుతున్న చంద్రయాన్–3 మిషన్‌కు నాలుగోసారి సోమవారం మధ్యాహ్నం కక్ష్య దూరాన్ని తగ్గించే ప్రక్రియను విజయవంతంగా నిర్వహించారు. కక్ష్య దూరాన్ని వంద కిలోమీటర్లకు తగ్గించే ప్రక్రియను ఈనెల 17న చేపట్టనున్నారు. అయితే రష్యా ప్రయోగించిన లూనా–25 అనే మిషన్ చంద్రుడిపైన దిగింది. చంద్రుని ఉపరితలంపై ఈ నెల 23న దక్షిణ ధృవంలో దిగబోయే మొట్టమొదటి మిషన్ చంద్రయాన్–3దే పై చేయి అవుతుంది.
Comments
Please login to add a commentAdd a comment