న్యూఢిల్లీ: సోషల్ డిస్టెన్సింగ్ పదాన్ని వినియోగించరాదంటూ దాఖలైన పిల్‌ని కోర్టు కొట్టివేయడమే కాకుండా పిల్ దాఖలు చేసిన వ్యక్తికి 10,000 జరిమానా విధిస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీచేసింది. సోషల్ డిస్టెన్స్‌కి బదులు, ఫిజికల్ డిస్టెన్స్ అనే పదాన్ని వాడాలంటూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఎస్.కె.కౌల్, జస్టిస్ బీ.ఆర్ గవాయ్ లతోకూడిన ధర్మాసనం వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా విచారణ జరిపి, ప్రజాప్రయోజనవ్యాజ్యం విచారణార్హం కాదని కోర్టు కొట్టివేసింది. డిస్టెన్సింగ్ అనే పదం వివక్షతో కూడుకున్నదనీ, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమనీ అందుకే ఆ పదం వాడుక మార్చాలనీ షకీల్ ఖురేషీ పిల్ దాఖలు చేసిన నేపథ్యంలో ధర్మాసనం పై విధంగా స్పందించింది.
Comments
Please login to add a commentAdd a comment