
మీడియాకు దూరంగా మంత్రులు
తెలంగాణ ఉద్యమం సమయంలో మీడియా ప్రతినిధులు కనిపిస్తే చాలు ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చిన నేతలు ఇప్పుడు మంత్రులయ్యాక మైకులు కనిపిస్తే చాలు దూరం దూరం పోతున్నారు. విలేకరులు ఏం అడుగుతారో, వారికి ఏం చెబితే ఏ ఇబ్బందులు వచ్చిపడతాయోనన్న శంక వారిని పట్టి పీడిస్తోంది. ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ ఆ మధ్య మీడియాతో మాట్లాడుతున్నప్పుడు ఓ విలేకరి రుణమాఫీ గురించి అడిగినప్పుడు ఏడాదిలో పూర్తి చేస్తామంటూ వ్యాఖ్యానించడంతో ముఖ్యమంత్రి ఆయనపై ఇంతెత్తున లేచారట! ఆ సంగతి మంత్రులకూ తెలిసింది. ఎందుకొచ్చిన తంటా.. అసలు ఏమీ మాట్లాడకపోతే ఏ బాధ ఉండదు కదా అని వారు భావిస్తున్నారు. దీంతో సచివాలయంలో మీడియా పాయింట్ దగ్గర ఇప్పుడు మాట్లాడేవారు కరువయ్యారు.