వ్యక్తిగత బాధ్యతలే  కెరీర్‌ పురోగతికి బ్రేక్‌! | Womens Gap In career leadership responsibilitys | Sakshi
Sakshi News home page

వ్యక్తిగత బాధ్యతలే  కెరీర్‌ పురోగతికి బ్రేక్‌!

Published Fri, Mar 7 2025 5:06 AM | Last Updated on Fri, Mar 7 2025 5:06 AM

Womens Gap In career leadership responsibilitys

నాయకత్వ బాధ్యతలకు మహిళలు దూరం 

ప్రోత్సాహించినా వెనకడుగు 

నౌకరీ నివేదిక వెల్లడి 

నెలసరి సమయంలో సెలవుకు ప్రాధాన్యం

ముంబై: ఉద్యోగంతోపాటు, వ్యక్తిగత బాధ్యతలకు సమప్రాధాన్యం దృష్ట్యా మహిళలు కెరీర్‌లో నాయకత్వ బాధ్యతలకు దూరం అవుతున్నారు. నాయకత్వ బాధ్యతలు చేపట్టే విషయంలో తమకు తగినంత ప్రోత్సాహం ఉన్నప్పటికీ ఆ విషయంలో ముందడుగు వేయలేకపోతున్నట్టు నౌకరి సర్వేలో తెలిపారు. ‘మహిళా నిపుణులు అసుల ఏమి కోరుకుంటున్నారు?’ పేరుతో నౌకరీ సర్వే నివేదికను విడుదల చేసింది. 

మహిళా ఉద్యోగులు ఏం చెబుతున్నారు?  
→ నాయకత్వ బాధ్యతల నిర్వహణ దిశగా తమకు ప్రోత్సాహం ఉందని 66 శాతం మంది తెలిపారు. అయినప్పటికీ 44 శాతం మంది మహిళలు ఈ బాధ్యతల నిర్వహణ పట్ల సుముఖంగా లేరు. ఉద్యోగం–వ్యక్తిగత జీవితానికి సమ ప్రాధాన్యం ఇవ్వడం కోసమే వారు నాయకత్వాన్ని వద్దనుకుంటున్నారు. ఈ బాధ్యతలు స్వీకరిస్తే కెరీర్‌ సాఫీగా సాగిపోకుండా, క్లిష్టమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారు.  

→ అస్పష్టత, ప్రమోషన్లలో పక్షపాతం కారణాలతో 35 శాతం మంది, నాయకత్వానికి సంబంధించి పరిమిత కార్యక్రమాల నేపథ్యంలో 14% మంది, తమకు సరైన మార్గదర్శకులు లేరన్న కారణంతో 7 % మంది నాయకత్వ పాత్రను చేపట్టడానికి ముందుకు రావడం లేదు. 

→ 50 పట్టణాల నుంచి సుమారు 70వేల మంది మహిళల అభిప్రాయాలను నౌకరీ తన సర్వే కోసం స్వీకరించింది.  

→ పురుషులతో సమాన వేతనం కంటే కూడా నెలసరి సమయంలో సెలవుకు మహిళా ఉద్యోగుల ప్రాధాన్యం ఇస్తున్నారు. ఉద్యోగంలో తమ మొదటి ప్రాధాన్యం దీనికేనని 34 శాతం మంది చెప్పారు. కొత్తగా కెరీర్‌ ఆరంభించిన మహిళల్లో సగం మంది ఈ విషయంలో చర్చించడానికి అవకాశం లేదన్నారు. 75 శాతం మంది తాము పనిచేసే చోట ఈ తరహా విధానాల్లేవని తెలిపారు. 

→ 2 ఏళ్లలోపు సర్విసు ఉన్న నిపుణుల్లో 75 శాతం మంది నాయకత్వ బాధ్యతల్లో సమ ప్రాధాన్యం కోరుకుంటుంటే, మూడింట ఒక వంతు మంది సీనియర్లు 
(15 ఏళ్లకు పైగా సర్విసు) వేతనాల్లో పారదర్శకత 
అవసరమని అంటున్నారు.  

→ మహిళలు కెరీర్‌లో మరింత ముందుకు వెళుతున్న కొద్దీ వేతనాల్లో అసమానతలు పెరుగుతున్నట్టు ఈ నివేదిక తెలిపింది. రూ.2–5 లక్షల మధ్య వేతనాలు అందుకుంటున్న వారిలో 11% మంది స్త్రీ–పురుష ఉద్యోగుల మధ్య వేతన వ్యత్యాసాన్ని గుర్తిస్తుంటే.. రూ.50 లక్షల నుంచి ఏడాదికి రూ.కోటి వరకు వేతనం అందుకుంటున్న వారిలో 26 శాతం మందికి అది అనుభవమవుతోంది. 

→ ముంబైలో 28%, బెంగళూరులో 27%, ఢిల్లీలో 24% చొప్పున వేతన వ్యత్యాసం ఉంది. అది కూడా బీఎఫ్‌ఎస్‌ఐ రంగంలో 28%, ఎఫ్‌ఎంసీజీ రంగంలో 27%, ఐటీలో 24% చొప్పున స్త్రీ–పురుష ఉద్యోగుల మధ్య వేతనాల్లో అంతరం ఉంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement