Naukri .com
-
వైట్ కాలర్ ఉద్యోగాలకు డిమాండ్ డౌన్
ముంబై: ఐటీ–సాఫ్ట్వేర్, టెలికం, విద్యా రంగాల్లో నియామకాలు మందగించిన నేపథ్యంలో అక్టోబర్–నవంబర్‌లో వైట్ కాలర్ ఉద్యోగాలకు హైరింగ్ తగ్గింది. గతేడాది ఇదే వ్యవధితో పోలిస్తే 12 శాతం క్షీణించింది. నౌకరీ జాబ్‌స్పీక్ సూచీకి సంబంధించిన నివేదిక ప్రకారం 2022 అక్టోబర్–నవంబర్‌లో 2,781 జాబ్ పోస్టింగ్స్ నమోదు కాగా ఈసారి అదే వ్యవధిలో 2,433 పోస్టింగ్స్ మాత్రమే నమోదయ్యాయి. నౌకరీడాట్‌కామ్‌లో సంస్థలు పోస్ట్ చేసే ఉద్యోగావకాశాలను బట్టి దేశీయంగా ప్రతి నెలా నియామకాల ధోరణిని నౌకరీ జాబ్‌స్పీక్ ఇండెక్స్ సూచిస్తుంది. మేనేజర్లు, క్లర్కులు, అడ్మిని్రస్టేషన్ సిబ్బంది మొదలైన ఆఫీసు ఆధారిత కొలువులను వైట్ కాలర్ ఉద్యోగాలుగా వ్యవహరిస్తారు. నివేదికలోని మరిన్ని విశేషాలు.. ► టెలికంలో 18 శాతం, విద్యా రంగంలో 17 శాతం, రిటైలింగ్ రంగంలో 11 శాతం మేర వైట్ కాలర్ నియామకాలు తగ్గాయి. ఆతిథ్య, ట్రావెల్, ఆటో, ఆటో విడిభాగాల రంగాల్లో హైరింగ్‌లో పెద్దగా మార్పులేమీ లేవు. ►ఇంధన కంపెనీలు వేగంగా కార్యకలాపాలు విస్తరిస్తుండటం, దేశవ్యాప్తంగా కొత్త రిఫైనరీలను ఏర్పాటు చేస్తుండటం వంటి సానుకూల పరిణామాలతో ఆయిల్, గ్యాస్ రంగాల్లో హైరింగ్ 9 శాతం పెరిగింది. ►కొత్త ఉద్యోగావకాశాలు ఫార్మా రంగంలో 6 శాతం, బీమా రంగంలో 5 శాతం పెరిగాయి. ►ఐటీ రంగంలో మొత్తం మీద హైరింగ్ 22 శాతం క్షీణించింది. అయితే అక్టోబర్‌తో పోలిస్తే నవంబర్‌లో నియామకాలు 1 శాతం మేర పెరిగాయి. ►ఆరి్టఫిíÙయల్ ఇంటెలిజెన్స్ సంబంధ మెషిన్ లెరి్నంగ్ ఇంజినీర్లకు అవకాశాలు 64 శాతం మేర, ఫుల్ స్టాక్ డేటా సైంటిస్టులకు కొత్త ఉద్యోగాలు 16 శాతం మేర పెరిగాయి. ►మెట్రోలతో పోలిస్తే నాన్–మెట్రోల్లోనే ఎక్కువగా హైరింగ్ కార్యకలాపాలు ఉన్నాయి. వదోదరలో అత్యధికంగా 9 శాతం కొత్త ఉద్యోగాల పోస్టింగ్స్ నమోదయ్యాయి. ►ఢిల్లీ ఎన్సీఆర్, ముంబై వంటి మెట్రోల్లో నియామకాలు చెరి 12 శాతం మేర, ఐటీ ప్రధానమైన బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, పుణెలో వరుసగా 20 శాతం, 18 శాతం, 21 శాతం, 18 శాతం మేర హైరింగ్ క్షీణించింది. ►2023 ఆసాంతంలో కనిపించిన ట్రెండ్‌కి అనుగుణంగా అక్టోబర్–నవంబర్‌లో కూడా సీనియర్ ప్రొఫెషనల్స్ వైపే కంపెనీలు మొగ్గు చూపాయి. 16 ఏళ్ల పైబడి అనుభవమున్న సీనియర్ నిపుణుల నియామకాలు 26 శాతం పెరిగాయి. ఫ్రెషర్లకు కొత్త ఆఫర్లు 13 శాతం పడిపోయాయి. -
ఐటీ హబ్‌లు వెలవెల! భారీగా పడిపోయిన నియామకాలు..
ప్రపంచవ్యాప్తంగా జాబ్ మార్కెట్లో ప్రస్తుతం అనిశ్చితి నెలకొంది. నియామకాలు బాగా నెమ్మదించాయి. భారత్‌లో ముఖ్యంగా ఐటీ హబ్‌లు వెలవెలబోతున్నాయి. దేశంలో ఉద్యోగాల క్షీణతకు సంబంధించి తాజాగా ఓ నివేదిక వెల్లడైంది. పుణె, బెంగళూరు, హైదరాబాద్ వంటి భారతీయ ఐటీ హబ్‌లలో గడిచిన అక్టోబర్ నెలలో ఉద్యోగాల క్షీణత కనిపించిందని నివేదిక వెల్లడించింది. మొత్తం మీద అక్టోబర్‌లో ఇతర రంగాల కంటే ఐటీ రంగంలో నియామకాలు అత్యధికంగా పడిపోయాయి. మరోవైపు, చమురు, గ్యాస్, విద్యుత్ రంగాల్లో అత్యధిక వృద్ధి కనిపించింది. ఐటీ నియామకాల్లో 14% క్షీణత నౌకరీ జాబ్‌స్పీక్ నివేదిక ప్రకారం.. గతేడాది అక్టోబర్‌తో పోల్చితే ఈ ఏడాది అక్టోబర్ నెలలో ఐటీ రంగం నియామకాల్లో 14 శాతం క్షీణతను చూసింది. నౌకరీ డాట్ కామ్ రెజ్యూమ్ డేటాబేస్‌పై ఈ నెలవారీ నివేదిక విడుదలైంది. ఇతర నగరాల్లో వృద్ధి కోల్‌కతాతో పాటు ఐటీ పరిశ్రమ కేంద్రాలుగా ఉన్న బెంగళూరు, హైదరాబాద్, పుణె, చెన్నై వంటి మెట్రో నగరాల్లో నియామకాల్లో 6 నుంచి 11 శాతం క్షీణత ఉండగా మరోవైపు ఢిల్లీ-ఎన్సీఆర్, ముంబై నగరాల్లో మాత్రం కొత్త జాబ్ ఆఫర్లలో వరుసగా 5, 4 శాతాల చొప్పున వృద్ధి నమోదైనట్లు నివేదిక పేర్కొంది. ఇక చెన్నైలో అత్యధికంగా 11 శాతం, బెంగళూరులో 9 శాతం, హైదరాబాద్‌లో 7 శాతం నియామకాలు పడిపోయాయి. గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే ఈ అక్టోబర్‌లో పుణె, కోల్‌కతాలో నియామకాలు 6 శాతం తగ్గాయి. చిన్న నగరాల విషయానికి వస్తే.. కొచ్చిలో 18 శాతం, కోయంబత్తూరులో 7 శాతం తగ్గింది. మరోవైపు మెట్రో నగరాలైన ఢిల్లీ 5 శాతం, ముంబై 4 శాతం వృద్ధిని సాధించాయి. అభివృద్ధి చెందుతున్న నగరాల్లో వడోదరలో అత్యధికంగా 37 శాతం వృద్ధి నమోదైంది. ఆ తర్వాత అహ్మదాబాద్‌లో 22 శాతం, జైపూర్‌లో 10 శాతం నియామకాల్లో వృద్ధి నమోదైనట్లు నౌకరీ జాబ్ స్పీక్ రిపోర్ట్ పేర్కొంది. ఈ రంగాల్లో జోష్ ఐటీ రంగంలో నియామకాల్లో క్షీణత ఉన్నప్పటికీ కొన్ని ఇతర రంగాల్లో మాత్రం కొత్త నియామకాల్లో జోష్ కనిపించినట్లు తాజా వివేదిక తెలిపింది. చమురు & గ్యాస్/పవర్ రంగం అత్యధికంగా 24 శాతం వృద్ధిని సాధించింది. ఆ తర్వాత ఫార్మా పరిశోధన, అభివృద్ధి (19 శాతం), బ్యాంకింగ్/ఫైనాన్స్/బ్రోకింగ్ (13 శాతం) ఉన్నాయి. ఇక నియామకాల్లో క్షీణత అత్యధికంగా ఉన్న రంగాలలో ఐటీ తర్వాత విద్య (10 శాతం), టెలికాం (9 శాతం) ఉన్నాయి. భారత్‌లో వైట్ కాలర్ నియామకానికి సంబంధించిన ఇండెక్స్ విలువ ఈ ఏడాది అక్టోబర్‌లో 2484గా ఉంది. ఇది గతేడాది అక్టోబర్‌లో 2455గా నమోదైంది. -
గుడ్‌న్యూస్.. డబుల్ డిజిట్ బాటలో వేతన ఇంక్రిమెంట్లు
దేశీయ కంపెనీల ఉద్యోగులు ఈ సంవత్సరం సగటున 10 శాతం ఇంక్రిమెంట్లు పొందారు. ఆర్థిక అనిశ్చిత భయాలతో లేఆఫ్‌లు, ఒడిదుడుకులతో 2023 సంవత్సరం ప్రారంభమైనప్పటికీ ఇంక్రిమెంట్లు డబుల్ డిజిట్ శాతం వైపు పయనాన్ని ప్రారంభించాయని నౌకరీ డాట్‌కామ్ (Naukri.com)నిర్వహించిన సర్వే పేర్కొంది. నౌకరీ డాట్‌కామ్ సర్వే ప్రకారం.. ఈ ఏడాది ప్రతి 10 మంది ఉద్యోగులలో కనీసం ఆరుగురు 10 శాతం కంటే ఎక్కువగా ఇంక్రిమెంట్లు పొందారు. కనిష్టంగా కాస్త తక్కువే ఉన్నప్పటికీ అసాధారణ పనితీరు ఉన్న ఉద్యోగులు 20 నుంచి 25 శాతం ఇంక్రిమెంట్ పొందారు. ఈ సర్వేలో 2 లక్షల మందికి పైగా ఉద్యోగులు పాల్గొన్నారు. తమ కంపెనీలు ఏప్రిల్ మార్చి మదింపు చక్రాన్ని అనుసరిస్తున్నాయని 56 శాతం మంది చెప్పారు. బ్యాంకింగ్, తయారీ రంగాల్లో అధికంగా.. జాబ్ మార్కెట్లో అనిశ్చిత పరిస్థితులు ఉన్నప్పటికీ ఈ సంవత్సరం వేతన పెంపు వేవ్ ఆశాజనకంగా ఉందని నౌకరీ డాట్ కామ్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ పవన్ గోయల్ అన్నారు. ఏప్రిల్-మార్చి వేతన పెంపులో బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్ సెక్టార్, మ్యానుఫ్యాక్చరింగ్ రంగాల ఉద్యోగులదే అత్యధిక వాటా. వీరిలో చాలా మంది 10 నుంచి 20 శాతం ఇంక్రిమెంట్లు అందుకున్నారు. ఇంక్రిమెంట్ల శాతంలో హెల్త్‌కేర్, రియల్ ఎస్టేట్ రంగాలు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. చాలా మంది ఉద్యోగులు గతేడాది కంటే మెరుగైన వేరియబుల్స్, బోనస్‌ల చెల్లింపులు ఈ ఏడాది పొందారు. ఇదీ చదవండి: మాదేం లేదు! వర్క్ ఫ్రం ఆఫీస్‌పై ఇన్ఫోసిస్ సీఈవో కీలక వ్యాఖ్యలు -
నిర్దాక్షిణ్యంగా ఉద్యోగుల తొలగింపు.. ఐటీ రంగంలో వీళ్లకి తిరుగులేదు!
ఈ ఏడాది తొలి ఆరు నెలల కాలంలో టెక్నాలజీ రంగంలో ఉద్యోగుల తొలగింపులు తక్కువ స్థాయిలో ఉండనున్నట్లు పలు సర్వేలు వెలుగులోకి వచ్చాయి. అయినప్పటికీ ఆ రంగానికి చెందిన సీనియర్ ఉద్యోగులపై తీవ్ర ప్రభావం పడనున్నట్లు సర్వేలు చెబుతున్నాయి. ప్రపంచం ఆర్థిక మాంద్యంలోకి దిగజారిపోతుందన్న భయాలు నెలకొన్న తరుణంలో చిన్న చిన్న కంపెనీల నుంచి బడా కంపెనీల వరకు ఉద్యోగుల్ని తొలగిస్తున్నాయి. దీంతో మిగిలిన రంగాల పరిస్థితులు ఎలా ఉన్న టెక్నాలజీ రంగం గడ్డు పరిస్థితులు ఎదుర్కొంది. ముఖ్యంగా సీనియర్ స్థాయి ఉద్యోగుల్లో ఈ లేఆఫ్స్ భయాలు ఎక్కువగా ఉన్నాయని వెలుగులోకి వచ్చిన నివేదికలు హైలెట్ చేస్తున్నాయి. ప్రముఖ దేశీయ ఎంప్లాయిమెంట్ సంస్థ నౌకరీ.. 1400 మంది రిక్రూట్లు, జాబ్ కన్సల్టెన్సీలతో సర్వే నిర్వహించింది. ఆ అధ్యయనంలో 20 శాతం మంది రిక్రూటర్లు సీనియర్ ఉద్యోగుల తొలగింపులు ఎక్కువగా ఉంటాయనే అభిప్రాయం వ్యక్తం చేశారు. అదే సమయంలో ఫ్రెషర్ల నియామకం ముమ్మరంగా కొనసాగనుందని, లేఆఫ్స్ .. ఫ్రెషర్ల రిక్రూట్ మెంట్‌పై తక్కువ ప్రభావం చూపుతుందని అంటున్నారు. ఐటీ రంగంలో 6 నెలలు పాటు అట్రిషన్ రేటు అధికంగా 15 శాతం ఉండనుందని, అదే సమయంలో గ్లోబుల్ మార్కెట్లో అనిశ్చితులు నెలకొన్నప్పటికీ కొత్త రిక్రూట్మెంట్ భారీగా ఉంటుదని రిక్రూటర్లు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అధ్యయనంలో పాల్గొన్న సగం మందికి పైగా 29 శాతంతో కొత్త ఉద్యోగాల రూపకల్పనలో నిమగ్నం కాగా.. 17 శాతం ఉద్యోగులు సంఖ్యను అలాగే కొనసాగించాలని భావిస్తున్నారు. 2023 మొదటి అర్ధభాగంలో (6 నెలలు) నియామక కార్యకలాపాలపై ఆశాజనకంగా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నందున .. భారతీయ ఉద్యోగులు గణనీయమైన ఇంక్రిమెంట్లను పొందవచ్చని అంచనా. సర్వే చేసిన మొత్తం రిక్రూటర్లలో మూడింట ఒక వంతు కంటే ఎక్కువ మంది సగటు పెరుగుదలను 20 శాతానికి పైగా అంచనా వేస్తున్నారు. ప్రపంచ స్థాయిలో నియామకాల ట్రెండ్లపై ప్రస్తుత అనిశ్చితి పరిస్థితులు ఉన్నప్పటికీ, దేశీయంగా క్యాంపస్ సెలక్షన్లు ఎక్కువ జరుగుతాయని సమాచారం. -
ఉద్యోగులకు బంపరాఫర్: పర్మినెంట్‌గా వర్క్ ఫ్రమ్ హోమ్
కోవిడ్ కారణంగా వర్క్ ఫ్రమ్ హోమ్ లేదా ఆఫీస్‌కి వెళ్లి పనిచేయాలా? అన్న సందిగ్ధంలో ఉన్నారా? అయితే మీకో శుభవార్త. దేశీయ దిగ్గజ కంపెనీలు పర్మినెంట్‌గా ఇంటి వద్ద నుంచి పనిచేసేలా బంపరాఫర్ ను ప్రకటిస్తున్నాయి. ఇదే విషయాన్ని ప్రముఖ జాబ్ పోర్టల్ నౌకరి స్పష్టం చేసింది. కోవిడ్ కారణంగా వర్క్ కల్చర్ ఆఫీస్నుంచి ఇంటికి మారింది. కానీ గత కొద్దిరోజులుగా పలు ఐటీ దిగ్గజ కంపెనీలు ఉద్యోగుల్ని కార్యాలయాల్లో పని చేయాలని చెప్పినట్లే చెప్పి మళ్లీ యూటర్న్ తీసుకున్నాయి. ఉద్యోగులు ఇంటి నుంచే పనిచేయాలని, అవసరం అయితే ఉద్యోగుల్ని ఐబ్రిడ్ వర్క్‌కి ఆహ్వానిస్తామని తెలిపాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ జాబ్ పోర్ట్ నౌకరి వర్క్ ఫ్రమ్ హోమ్‌లో పనిచేస్తున్న ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. గత 6నెలల్లో నౌకరిలో ప్రకటనలిస్తున్న దిగ్గజ కంపెనీలు శాశ్వతంగా ఇంటి వద్ద నుంచి పనిచేసే ఉద్యోగులకోసం అన్వేషిస్తున్నట్లు తెలిపింది. దీంతో పాటు మరెన్నో ఆసక్తికర విషయాల్ని వెల్లడించింది. ►నౌకరి వెబ్ పోర్టల్‌లో మనదేశానికి చెందిన సుమారు 32 లక్షల మంది ఉద్యోగులు ఉద్యోగాల కోసం అన్వేషించినట్లు నౌకరి తెలిపింది. అందులో దాదాపు 57శాతం మంది అభ్యర్ధులు పర్మినెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ కోసం వెతికినట్లు వెల్లడించింది. ►నౌకరి తన జాబ్ బోర్డ్‌లో ప్రత్యేక ఫీచర్‌ను రూపొందించిన తర్వాత, తన సైట్లో 93,000 శాశ్వత, తాత్కాలిక రిమోట్ ఉద్యోగాల్ని ప్రకటించాయని, పర్మినెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు 22శాతం ఉన్నాయి. ►మహమ్మారి కారణంగా గత రెండు సంవత్సరాలుగా వర్క్ కల్చర్ మారిపోయింది. కార్పోరేట్ కంపెనీలు చాలా వరకు ఉద్యోగుల్ని హైబ్రిడ్ వర్క్ కల్చర్ కి దగ్గర చేయాలని భావిస్తున్నాయి. ►రిక్రూటర్లు ఉద్యోగుల ఎంపిక, వారి పని విధానం విషయంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటున్నాయి అనే విషయంలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. మహమ్మారి కారణంగా ఎక్కువ మంది రిక్రూటర్లు పనితీరు కనబరిచే ఉద్యోగుల కోసం అన్వేషణ, ఎక్కడి నుండైనా పని చేసేందుకు అంగీకరిస్తున్నారు. కార్పొరేట్ స్థాయిలో మానవ వనరులు, మౌలిక సదుపాయాల అవసరాలకు శాశ్వత మార్పులు చేయడం ప్రారంభించారు”అని నౌకరి చీఫ్ బిజినెస్ ఆఫీసర్ గోయల్ అన్నారు. ►అంతేకాకుండా, కంపెనీలు కొన్ని జాబ్ ప్రొఫైల్‌లను పర్మినెంట్ వర్క్ హోమ్‌లో పనిచేసే ఉద్యోగుల కోసం అన్వేషిస్తున్నాయి. ముఖ్యంగా ఐటీ, సాఫ్ట్వేర్, బీపీఓ వంటి రంగాల్లో ఈతరహా ఉద్యోగాలు ఎక్కువగా ఉన్నాయి. ►పెద్ద, చిన్న కంపెనీలు రెండూ మూడు రకాల ఉద్యోగాలను పోస్ట్ చేశాయి. వాటిలో సాధారణ ఉద్యోగాలు, తాత్కాలిక వర్క్ ఫ్రమ్ హోమ్, శాస్వతంగా రిమోట్ వర్క్ చేసే ఉద్యోగాలు ఉన్నాయి. ►ఐటీ సాఫ్ట్వేర్, సాఫ్ట్వేర్ సేవలు, ఐటీఈఎస్, రిక్రూట్మెంట్/సిబ్బంది రంగాలు ఎక్కువ శాశ్వత రిమోట్ ఉద్యోగాలను పోస్ట్ చేస్తున్నాయని నౌకరీ డేటా చూపుతోంది. ►నౌకరీ డేటా ప్రకారం అమెజాన్, టెక్ మహీంద్రా, హెచ్‌సిఎల్, పిడబ్ల్యుసి, ట్రిజెంట్, ఫ్లిప్‌కార్ట్, సిమెన్స్, డెలాయిట్, ఒరాకిల్, జెన్సార్, టీసీఎస్, క్యాప్‌జెమినీ తాత్కాలిక, శాశ్వత రిమోట్ ఉద్యోగాలు ఆఫర్ చేస్తున్నాయి. -
ఇన్ఫో ఎడ్జ్- డిక్సన్ టెక్నాలజీస్ భలే జోరు
హెచ్చుతగ్గుల మధ్య ప్రారంభమైన దేశీ స్టాక్ మార్కెట్లు జోరందుకున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 250 పాయింట్లు జంప్‌చేసి 38,667ను అధిగమించగా.. నిఫ్టీ 58 పాయింట్లు ఎగసి 11,413 వద్ద ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో నష్టాలను వీడి లాభాలు ప్రకటించడంతో ఇన్ఫో ఎడ్జ్ ఇండియా కౌంటర్ వెలుగులోకి వచ్చింది. మరోపక్క ఇటీవల కొద్ది రోజులుగా జోరు చూపుతున్న డిక్సన్ టెక్నాలజీస్ కౌంటర్ మరోసారి ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. వెరసి ఎలక్ట్రానిక్ ప్రొడక్టుల కాంట్రాక్ట్ మ్యాన్యుఫాక్చరర్ డిక్సన్ టెక్నాలజీస్ షేరు సరికొత్త గరిష్టాన్ని తాకితే.. నౌకరీ.కామ్, జీవన్సాథీ, 99 ఏకర్స్.కామ్ ద్వారా సేవలందించే ఇన్ఫో ఎడ్జ్ ఇండియా రికార్డ్ గరిష్టానికి చేరువైంది. ఇతర వివరాలు చూద్దాం.. ఇన్ఫో ఎడ్జ్ ఇండియా ఈ ఏడాది క్యూ1(ఏప్రిల్-జూన్)లో ఇన్ఫో ఎడ్జ్ ఇండియా కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన రూ. 94 కోట్ల నికర లాభం ఆర్జించింది. గతేడాది(2019-20) క్యూ1లో రూ. 191 కోట్ల నికర నష్టం ప్రకటించింది. అయితే నికర అమ్మకాలు మాత్రం 11 శాతం క్షీణించి రూ. 285 కోట్లను తాకాయి. ప్రస్తుతం రూ. 123 కోట్ల పన్నుకు ముందు లాభం సాధించగా.. గతంలో రూ. 150 కోట్ల నష్టం నమోదైంది. దీంతో ఎన్ఎస్ఈలో ఈ షేరు తొలుత 4 శాతం జంప్‌చేసి రూ. 3,425ను తాకింది. ప్రస్తుతం 2.3 శాతం లాభంతో రూ. 3,369 వద్ద ట్రేడవుతోంది. గత నెల 10న సాధించిన రికార్డ్ గరిష్టం రూ. 3,584కు ఇంట్రాడేలో చేరువకావడం గమనార్హం! డిక్సన్ టెక్నాలజీస్ వరుసగా ఆరో రోజు డిక్సన్ టెక్నాలజీస్ కౌంటర్ దూకుడు చూపుతోంది. ఎన్ఎస్ఈలో ప్రస్తుతం 7 శాతం జంప్‌చేసి రూ. 9,546 వద్ద ట్రేడవుతోంది. ఇది సరికొత్త గరిష్టంకాగా.. గత ఆరు రోజుల్లో 17 శాతం బలపడింది. ఈ ఏడాది మార్చి 24న రూ. 2,900 వద్ద కనిష్టాన్ని చవిచూసిన డిక్సన్ టెక్నాలజీస్ ఇటీవల ర్యాలీ బాటలో సాగుతోంది. వెరసి కనిష్టం నుంచి ఏకంగా 215 శాతం ర్యాలీ చేసింది. దేశీ ఎలక్ట్రానిక్ మార్కెట్లో పలు విభాగాల్లో కంపెనీ కాంట్రాక్ట్ మ్యాన్యుఫాక్చరింగ్ సర్వీసులను అందిస్తోంది. ఎంఎన్‌సీలు తదితర దిగ్గజాలకు ప్రొడక్టులను తయారు చేస్తోంది. కన్జూమర్ ఎలక్ట్రానిక్స్, హోమ్ అప్లయెన్సెస్, మొబైల్ ఫోన్లు, లెడ్ లైటింగ్ తదితర విభాగాలలో కార్యకలాపాలు విస్తరించింది. ఈ ఏడాది క్యూ1లో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించినప్పటికీ.. ఇకపై పనితీరు మెరుగుపడగలదన్న అంచనాలు ఈ కౌంటర్‌కు జోష్‌నిస్తున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. -
జూలైలో జాబ్‌లు పెరిగాయ్..!
ముంబై: కరోనా ప్రేరేపిత లాక్డౌన్ సడలింపుతో జూలైలో ఉద్యోగ నియమాకాలు పెరిగాయి. కేంద్రం అన్‌లాక్ ప్రక్రియను ప్రారంభించడంతో అనేక కీలక పరిశ్రమలు పునఃప్రారంభమయ్యాయి. ఫలితంగా కిందటి నెల జూన్‌లో పోలిస్తే ఈ జూలైలో ఉద్యోగ నియామకాలు పెరిగాయి. అయితే వార్షిక ప్రాతిపదికన పోలిస్తే నియామకాలు భారీగా తగ్గాయి. ఆసక్తికరంగా మైట్రో నగరాల్లో కంటే అభివృద్ధి చెందుతున్న నగరాల్లో నియామకాలు పెరగడం విశేషం. మీడియా–ఎంటర్టైన్మెంట్, నిర్మాణ, ఇంజనీరింగ్ రంగాల్లో అధికంగానూ.., బ్యాంకింగ్, ఫైనాన్స్ సర్వీస్, ఇన్సూరెన్స్, అటో, టెలికం రంగాల్లో మోస్తారు నియమకాలు జరిగాయి. ఐటీ రంగంలో మాత్రం నియామకాలు అంతంగా మాత్రంగా ఉన్నాయి. నౌకరి జాజ్ ఇండెక్స్ ప్రకారం ఈ జూలైలో మొత్తం 1263 జాబ్ పోస్టింగ్‌లు నమోదయ్యాయి. కిందటి నెల జూన్‌లో జరిగిన 1208 పోస్టింగ్‌లతో పోలిస్తే 5శాతం వృది జరిగింది. అయితే గతేడాది ఇదే జూలైతో నియామకాలు 47శాతం క్షీణించాయి. ‘కిందటి నెలతో పోలిస్తే ఈ జూలైలో నియాయకాలు స్వల్పంగా పెరిగాయి. అయితే వార్షిక ప్రాతిపదికన 47శాతం క్షీణించాయి. రానున్నరోజుల్లో కేంద్రం దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధింపు ఆంక్షలను మరింత పరిమితం చేయవచ్చు. ఈ ఆగస్ట్‌లో ఉద్యోగాలు మరింత పెరిగే అవకాశం ఉంది’’ అని నౌక్రీ డాట్‌కామ్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ పవన్ గోయల్ చెప్పారు. -
ఇన్ఫో ఎడ్జ్ క్విప్ షురూ- షేరు జూమ్
ఇంటర్నెట్ ఫ్రాంచైజీ కంపెనీ ఇన్ఫో ఎడ్జ్ ఇండియా.. అర్హతగల సంస్థాగత ఇన్వెస్టర్లకు షేర్ల జారీ(క్విప్) ప్రక్రియను నేటి నుంచి ప్రారంభించింది. ఇందుకు ఫ్లోర్ ధరగా ఒక్కో షేరుకి రూ. 3177.18ను కంపెనీ బోర్డు మంగళవారం ప్రకటించింది. కాగా.. ఈక్విటీ షేర్ల విక్రయం ద్వారా రూ. 1,875 కోట్ల సమీకరణకు జూన్ 22న జరిగిన సమావేశంలోనే ఇన్ఫో ఎడ్జ్ బోర్డు ఆమోదముద్ర వేసింది. ఈ బాటలో మంగళవారం సమావేశమైన డైరెక్టర్ల బోర్డు.. తాజాగా క్విప్ ధరను నిర్ణయించింది. తద్వారా రూ. 1,875 కోట్ల సమీకరణకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఆన్లైన్ క్లాసిఫైడ్ విభాగాలు.. నౌకరీ.కామ్, 99ఏకర్స్.కామ్, జీవన్సాథీ.కామ్, శిక్షా.కామ్‌ను కంపెనీ నిర్వహిస్తున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో ఇన్ఫోఎడ్జ్ షేరు తొలుత ఎన్ఎస్ఈలో 7 శాతం దూసుకెళ్లి రూ. 3420ను తాకింది. ఇది చరిత్రాత్మక గరిష్టంకాగా.. ప్రస్తుతం 6.6 శాతం జంప్‌చేసి రూ. 3395 వద్ద ట్రేడవుతోంది. గోద్రెజ్ ప్రాపర్టీస్ ఈ ఆర్థిక సంవత్సరం క్యూ1(ఏప్రిల్-జూన్)లో రియల్టీ కంపెనీ గోద్రెజ్ ప్రాపర్టీస్ రూ. 20.2 కోట్ల నికర నష్టం ప్రకటించింది. అంతక్రితం ఏడాది(2019-20) క్యూ1లో రూ. 90 కోట్ల నికర లాభం ఆర్జించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన మొత్తం ఆదాయం సైతం 89 శాతం పడిపోయి రూ. 72 కోట్లకు పరిమితమైంది. ఫలితాల నేపథ్యంలో గోద్రెజ్ ప్రాపర్టీస్ షేరు ఎన్ఎస్ఈలో 2.7 శాతం క్షీణించి రూ. 906 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 892 వరకూ పతనమైంది. -
నియామకాలపై కోవిడ్-19 ఎఫెక్ట్
ముంబై : కోవిడ్-19ను ఎదుర్కొనేందుకు దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమలవుతున్న క్రమంలో ఈ ఏడాది మార్చిలో నియామకాలు 2019లో ఇదే నెలతో పోలిస్తే 18 శాతం మేర పడిపోయాయని నౌక్రి జాబ్‌స్పీక్ సూచీ వెల్లడించింది. ఈ ఏడాది జనవరి నుంచీ నియామకాలు సగటున 5.75 శాతం వృద్ధినే నమోదు చేస్తుండటం మందగమన సంకేతాలు పంపగా కరోనా మహమ్మారితో ఉద్యోగ నియామకాలు భారీగా తగ్గాయి. నౌక్రీ.కాం వెబ్సైట్లో ప్రతినెలా నమోదయ్యే జాబ్ లిస్టింగ్స్ ఆధారంగా నౌక్రీ జాబ్‌స్పీక్ పేరిట ప్రతినెలలో హైరింగ్ కార్యకలాపాలను వెల్లడిస్తుంది. తాజాగా నియామక కార్యకలాపాలు హోటల్, రెస్టారెంట్లు, ట్రావెల్, ఎయిర్‌లైన్స్, రిటైల్, ఆటో అనుంబంధ రంగాలు, బీమా, ఫార్మా, ఫైనాన్స్, ఐటీ సాఫ్ట్వేర్ రంగాల్లో భారీగా పడిపోయాయి. ఢిల్లీ, చెన్నై, హైదరాబాద్ వంటి ప్రధాన నగరాల్లో నియామకాల ప్రక్రియ భారీగా దెబ్బతిందని వెల్లడించింది. ఇక ఢిల్లీలో నియామక కార్యకలాపాలు 26 శాతం తగ్గగా, చెన్నై..హైదరాబాద్‌ల్లో 24 శాతం, 18 శాతం మేర తగ్గుముఖం పట్టాయని తెలిపింది. ఢిల్లీ, ఎన్సీఆర్ పరిధిలో హాస్పిటాలిటీ, ఫార్మాస్యూటికల్ రంగాల్లో నియామకాల ప్రక్రియ వరుసగా 66 శాతం, 43 శాతం మేర తగ్గుముఖం పట్టాయి. ఇక హైదరాబాద్‌లో నియామక కార్యకలాపాలు 18 శాతం తగ్గగా హాస్పిటాలిటీ రంగంలో 62 శాతం, ఆటో అనుబంధ రంగాల్లో 46 శాతం, బ్యాంకింగ్, ఆర్థిక సేవల రంగాల్లో 40 శాతం మేర నియామక కార్యకలాపాలు తగ్గుముఖం పట్టాయి. కోవిడ్-19 సంక్షోభం ప్రభావంతో హైరింగ్ కార్యకలాపాల్లో 18 శాతం తగ్గుదల నమోదైందని..జనవరి నుంచే ఈ ట్రెండ్స్ కనిపించాయని నౌక్రీ.కాం చీఫ్ బిజినెస్ ఆఫీసర్ పవన్ గోయల్ పేర్కొన్నారు. చదవండి : 2.5 కోట్ల ఉద్యోగాలకు కోత -
ఆన్లైన్ నియామకాలు పెరిగాయ్..
న్యూఢిల్లీ: ఆన్లైన్ నియామకాలు పెరిగాయి. వార్షిక ప్రాతిపదికన నవంబర్‌లో 16 శాతం వృద్ధి నమోదయింది. నియామకాల పెరుగుదలకు నాన్–ఐటీ రంగం బాగా దోహదపడింది. రానున్న నెలల్లో కూడా నియామకాలపై అంచనాలు సానుకూలంగానే ఉన్నట్లు జాబ్ పోర్టల్ ‘నౌకరీ.కామ్’ తెలియజేసింది. జాబ్ మార్కెట్ రికవరీని సూచిస్తూ నవంబర్‌లో నౌకరీ జాబ్ స్పీక్ ఇండెక్స్ 2,113 పాయింట్లకు చేరింది. ‘జాబ్ స్పీక్ ఇండెక్స్‌లో 16 శాతం వృద్ధి నమోదయింది. దీనికి నాన్–ఐటీ రంగం ప్రధాన కారణం. నిర్మాణం, ఇంజనీరింగ్, ఆటో, ఇండస్ట్రియల్ ప్రొడక్ట్స్, బ్యాంకింగ్ రంగాల్లో చెప్పుకోదగ్గ వృద్ధి నమోదయ్యింది’ అని నౌకరీ.కామ్ చీఫ్ సేల్స్ ఆఫీసర్ వి.సురేశ్ తెలిపారు. పరిశ్రమల వారీగా చూస్తే.. నిర్మాణ/ఇంజనీరింగ్ నియామకాల్లో 46 శాతం వృద్ధి, వాహన రంగ నియామకాల్లో 39 శాతం వృద్ధి కనిపించింది. ఇక హెవీ మిషనరీ, బ్యాంకింగ్ రంగాల్లో నియామకాలు వరుసగా 30 శాతం, 24 శాతం పెరిగాయి. ఎనిమిది మెట్రో నగరాలకు గానూ ఏడింటిలో నియామకాలు ఎగిశాయి. కోల్‌కతాలో 51 శాతం, ఢిల్లీ–ఎన్సీఆర్లో 15 శాతం, ముంబైలో 16 శాతం వృద్ధి కనిపించింది. బెంగళూరులో మాత్రం 3 శాతం మేర క్షీణించాయి. -
నవంబర్‌లో నియామకాలు
14 శాతం జంప్: నౌకరి.కామ్ నివేదిక న్యూఢిల్లీ: నియామకాల జోరు కొనసాగుతోంది. నవంబర్ నెలలో నియామకాలు 14 శాతంమేర పెరిగాయని నౌకరి.కామ్ తన నివేదికలో తెలిపింది. దీనికి బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్, సాఫ్ట్వేర్సర్వీసెస్ వంటి రంగాలు కారణంగా నిలిచాయని పేర్కొంది. నివేదిక ప్రకారం.. ఈ ఏడాది నవంబర్‌లో నౌకరి జాబ్ స్పీక్ ఇండెక్స్ 1,817కు పెరిగింది. గతేడాది ఇదే నెలతో పోలిస్తే ఇండెక్స్‌లో 14 శాతం వృద్ధి నమోదయ్యింది. పట్ణణాల వారీగా చూస్తే.. పుణేలో నియామకాలు గరిష్టంగా 32 శాతంమేర పెరిగాయి. కొత్త సంవత్సరంలోనూ నియామకాల జోరు కొనసాగవచ్చు. వార్షిక ప్రాతిపాదికన చూస్తే.. బీఎఫ్ఎస్ఐ నియామకాలు 42 శాతంమేరపెరిగాయి. ఇన్సూరెన్స్ రంగంలో నియామకాలు 43 శాతంమేర ఎగశాయి. ఇక ఐటీ సాఫ్ట్వేర్/సాఫ్ట్వేర్ సర్వీసెస్, బీపీవో/ఐటీఈఎస్ రంగాల్లో నియామకాలు వరుసగా 14 శాతం, 15 శాతం పెరిగాయి. నియామకాల వృద్ధిమెడికల్/హెల్త్‌కేర్ రంగంలో 24 శాతంగా, టీచింగ్/ఎడ్యుకేషన్ విభాగంలో 35 శాతంగా ఉంది. పట్టణాల వారీగా నియామకాల వృద్దిని పరిశీలిస్తే.. ఢిల్లీ–ఎన్సీఆర్లో 12 శాతంగా, ముంబైలో 18 శాతంగా, బెంగళూరులో 20శాతంగా నమోదయ్యింది. అలాగే నియామకాలు చెన్నైలో 12 శాతం, హైదరాబాద్‌లో 9 శాతం, పుణేలో 32 శాతం పెరిగాయి. -
మరిన్ని కొత్త కొలువులు!: నౌకరీ.కామ్ సర్వే
న్యూఢిల్లీ: కొత్త కొలువుల సృష్టితో రానున్న కాలంలో జాబ్ మార్కెట్ ఆశావహంగా ఉండనుంది. ఈ ఏడాది జాబ్ మార్కెట్ మంచి వృద్ధిని నమోదు చేస్తుందని నౌకరీ.కామ్ అభిప్రాయపడింది. సర్వే ప్రకారం.. ఈ ఏడాది రెండో అర్ధ భాగంలో కొత్త ఉద్యోగాల సృష్టి ఉంటుందని దాదాపు 66 శాతం మంది రిక్రూటర్లు ఆశాభావం వ్యక్తం చేశారు. ముఖ్యంగా 4-8 ఏళ్ల అనుభవం ఉన్న ఉద్యోగులకు డిమాండ్ అధికంగా ఉంటుంది. బీఎఫ్ఎస్ఐ, ఐటీ పరిశ్రమల్లో ఎక్కువ ఉద్యోగ నియామకాలు నమోదుకానున్నాయి. అవకాశాల వృద్ధితో కొన్ని రంగాల్లో ఉద్యోగులకు అధిక వేతనాలు లభించనున్నాయి. దాదాపు 68 శాతం మంది రిక్రూటర్లు ఉద్యోగ వేతనాలను 10 శాతం పైగా పెంచనున్నారు.