Leadership qualities
-
హైహై నాయికా
నాయకత్వ లక్షణాల్లో ఎవరు గొప్ప.. మహిళలా.. పురుషులా? దీనిచుట్టూ జరిగిన అనేక పరిశోధనలు, అధ్యయనాల్లో బయటపడింది ఏమంటే నాయకత్వ లక్షణాలు ఎక్కువగా మహిళల్లోనే మెరుగ్గా ఉంటాయట!. అమెరికాకు చెందిన ప్యూ రిసెర్చ్ సెంటర్ నివేదిక ప్రకారం ఒక మంచి నేతకు ఉండాల్సిన ముఖ్యమైన లక్షణాలు నిజాయితీ, మేధాశక్తి, కరుణతోపాటు సృజనాత్మకత. ఈ లక్షణాలు ఎక్కువగా మహిళల్లోనే ఉంటాయని ఈ సంస్థ పరిశోధనాత్మక వ్యాసంలో పేర్కొంది. ఇతరులు చెప్పేది వినడం, తనతోపాటు అందరి అభివృద్ధికి సాయం చేయడం, ఎలాంటి పరిస్థితులనైనా సృజనాత్మకతతో ఎదుర్కోవడం వంటి నాయకత్వ లక్షణాలు మహిళల్లో అధికంగా ఉంటాయని అమెరికాకు చెందిన నార్త్ వెస్టర్న్ యూనివర్సిటీ సైకాలజీ ప్రొఫెసర్ డాక్టర్ ఎలైస్ ఈగ్లొ వెల్లడించారు. సాధారణ పరిస్థితుల్లో స్త్రీ, పురుషులు దాదాపు ఒకేవిధమైన నిర్ణయాలు తీసుకున్నా అధిక ఒత్తిడిలో పురుషులు ప్రమాదంతో కూడిన క్లిష్టమైన నిర్ణయాలు తీసుకుంటారని, కానీ మహిళలు ఒత్తిడిలోనూ సానుకూల నిర్ణయాలు తీసుకుంటారని సదరన్ కాలిఫోర్నియా యూనివర్సిటీ అధ్యయనంలో వెల్లడైంది. అధిక ఒత్తిడికి లోనైనప్పుడు మనిషి లో కార్టిసొల్ అనే హార్మోన్ అధికంగా విడుదల అవుతుంది. ఈ కార్టిసొల్ హార్మోన్ విడుదలైనప్పుడు అది మనం తీసుకునే నిర్ణయాలను ప్రభావితం చేస్తుంది. కార్టిసొల్ స్థాయి పెరిగినా మహిళల మెదడు పురుషులకంటే సానుకూలంగా వ్యవహరిస్తున్నట్లు శాస్త్రీయ పరిశోధనలో వెల్లడైంది. మందకొడిగా నాయకత్వ హోదా.. ఒక మహిళ మంచి నాయకురాలిగా రాణించగలదని సామాజిక, శాస్త్రీయ పరిశోధనలు, అధ్యయనాలు చెబుతున్నా ప్రపంచవ్యాప్తంగా స్త్రీలు నాయకత్వ హోదాలోకి ఎదగడం అత్యంత మందకొడిగా సాగుతోంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే నాయకత్వ హోదా విషయంలో స్త్రీ, పురుషుల మధ్య సమానత్వం సాధించడానికి ఇంకో 130 ఏళ్లు పడుతుందని ఐక్యరాజ్యసమితి అంచనా. ప్రస్తుత పరిస్థితి ఇదీ.. ♦ గతేడాది చివరి నాటికి ప్రపంచవ్యాప్తంగా 28 దేశాల్లోనే మహిళలు దేశాధ్యక్ష లేదా ప్రభుత్వ అధినేత్రి హోదాలో ఉన్నారు. అందులో భారత్ సహా 13 దేశాల్లో అధినేత్రిలుగానూ మరో 15 దేశాల్లో ప్రభుత్వ అధినేత్రిలుగా ఉన్నారు. ♦అన్ని దేశాలు కలిపి మంత్రుల స్థానాల్లో 21 శాతమే మహిళలు ఉన్నారు. 14 దేశాల్లో మాత్రమే మంత్రివర్గాల్లో సగం లేదా ఆపైన అతివలు ఉన్నారు. ♦ ప్రస్తుతానికి అన్ని దేశాల పార్లమెంటుల్లో కలిపి 26 శాతం మహిళా అభ్యర్థులు సభ్యులుగా ఉన్నారు. 1995 నాటికి ఇది 11 శాతమే ఉండేది. వీటిలో ఐదు దేశాల్లో సగానికిపైగా మహిళా పార్లమెంటు సభ్యులు ఉన్నారు. రువాండాలో 61 శాతం, క్యూబాలో 53 శాతం, నికరగ్వాలో 51, మెక్సికోలో 50, యూఏఈలో 50 శాతం మంది మహిళలు పార్లమెంటు సభ్యులుగా ఉన్నారు. ♦ మరో 27 దేశాల్లో మహిళా పార్లమెంటు సభ్యులు 40 శాతానికిపైగా ఉన్నారు. అందులో 15 యూరప్‌లో, 5 లాటిన్ అమెరికా దేశాల్లో, 5 ఆఫ్రికాలో, చెరొకటి ఆసియా, పసిఫిక్ దేశాల్లో ఉన్నాయి. ఇందులో అధిక దేశాల్లో మహిళల కోసం పార్లమెంటు స్థానాల్ని రిజర్వు చేయడం వల్ల సాధ్యమైంది. ♦ ప్రపంచవ్యాప్తంగా 24 దేశాల్లో పార్లమెంటులో 10 శాతం కన్నా తక్కువగా మహిళలు ఉన్నారు. అందులో మూడు దేశాల్లో ఒక్క మహిళ కూడా పార్లమెంటులో లేరు. అవి మైక్రోనేసియా, పపువా న్యూగినియా, వనౌతు దేశాలు. ♦136 దేశాల సమాచారం క్రోడీకరిస్తే స్థానిక సంస్థలకు ఎన్నికైన మహిళల సంఖ్య 30 లక్షలుగా (34 శాతం) ఉంది. ఈ విషయంలో ప్రపంచ సగటు కంటే భారత్‌లో స్థానిక సంస్థల్లో మహిళల ప్రాతినిధ్యం మెరుగ్గా ఉంది. స్థానిక సంస్థల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కారణంగా మనదేశంలో మొత్తంగా మహిళా ప్రాతినిథ్యం 44 శాతానికి పెరిగింది. అదే ఫ్రాన్స్‌లో 40, బ్రిటన్‌లో 34, జర్మనీలో 27.5, చైనాలో 23, జపాన్‌లో 13 శాతంగా ఉంది. ♦ భారత్‌లో మొత్తం 2.5 లక్షల పంచాయతీలు ఉండగా మొత్తం 32 లక్షల మంది వాటికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వారిలో 14.5 లక్షల మంది మహిళలే. అత్యధికంగా ఉత్తరాఖండ్‌లో మహిళా ప్రాతినిధ్యం 54.8 శాతం ఉండగా అత్యల్పంగా జమ్మూకశ్మీర్‌లో 32 శాతం ఉంది. ♦ మహిళలు నేతృత్వం వహిస్తున్న స్థానిక సంస్థల పనితీరు మెరుగ్గా ఉంటోందని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ♦ భారత్‌లో మంచినీటి ప్రాజెక్టులు విషయంలో పురుషులు నేతృత్వం వహిస్తున్న పంచాయతీలకన్నా మహిళా నాయకత్వంలోని పంచాయతీల్లోనే 62 శాతం అధికంగా ఉన్నాయని తేలింది. ♦ ప్రపంచవ్యాప్తంగా స్థానిక సంస్థల్లో మహిళా ప్రాతినిధ్యం 50 శాతం దాటిన దేశాలు రెండే ఉన్నాయి. మరో 20 దేశాల్లో 40 శాతంగా ఉంది. అధినాయికలు నామమాత్రమే.. ప్రపంచవ్యాప్తంగా 1960 నుంచి ఇప్పటివరకు 59 దేశాల్లో మహిళలు అత్యున్నత స్థానాన్ని అధిరోహించారు. మొత్తంగా 77 మంది మహిళలు ఉన్నత స్థానాలకు ఎదిగారు. 1960లో సిరిమావో బండారునాయికే శ్రీలంక ప్రధానిగా ఎన్నికై ప్రపంచంలో అత్యున్నత స్థానాన్ని అధిరోహించిన తొలి మహిళా నేతగా ఖ్యాతిగాంచారు. ఈ ఏడాది ప్రారంభం నాటికి 15 దేశాలకు మహిళలు నేతృత్వం వహిస్తున్నారు. ఇందులో ఇటలీ, హొండురస్లో తొలిసారి మహిళా అధ్యక్షురాలిని ఎన్నుకున్నాయి. నిరంతరాయంగా అత్యధిక కాలం దేశాధినేతగా కొనసాగిన కీర్తి జర్మనీకి చెందిన ఎంజెలా మెర్కెల్‌కు దక్కింది. ఆమె జర్మనీ చాన్సలర్‌గా 16 ఏళ్ల 16 రోజులు ఉన్నారు. ఆ తరువాత స్థానాల్లో డొమినికన్ రిపబ్లిక్కు చెందిన దామె యుజెనియా చార్లెస్ (14 ఏళ్ల 328 రోజులు), లైబిరియాకు చెందిన ఎలెన్ జాన్సన్ సిర్లీఫ్ (12 ఏళ్ల 6 రోజులు) ఉన్నారు. మధ్యలో అంతరాయం వచ్చినా మొత్తంగా అత్యధికకాలం ప్రభుత్వాధినేత్రి హోదాలో ఉన్న ఘనత ఇందిరాగాందీకి కూడా దక్కుతుంది. ఆమె భారత్ ప్రధానిగా మొత్తం 16 ఏళ్ల 15 రోజులు పనిచేశారు. ప్రస్తుత బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా ఏకంగా 19 ఏళ్లకుపైగా ప్రధాని పదవిని అలంకరించారు. - దొడ్డ శ్రీనివాసరెడ్డి -
నాయకత్వ నిర్వచనం మారాలి!
భౌతిక దారుఢ్యం, ఆచరణాత్మకంగా ఉండటం వంటి వాటిని నాయకత్వ లక్షణాలుగా చూడడం వల్ల అనాదిగా పురుషులే నాయకత్వ స్థానాలలో కనిపిస్తున్నారు. కానీ మహిళలు నాయకత్వ బృందాలలో ఉన్నప్పుడు కరుణ వంటి లక్షణాలు కూడా ముఖ్యం అవుతున్నాయి. మహిళా నాయకత్వానికీ, సామాజిక సంక్షేమానికీ మధ్య ధనాత్మక సంబంధాన్ని అనేక అధ్యయనాలు తెలియజేస్తున్నాయి. 21వ శతాబ్దపు ఒక క్లిష్టమైన పోరాటం అందుబాటులో ఉన్న వనరులకూ, మానవ వైఖరులకూ మధ్య జరుగుతుంది. దీన్ని ఎదుర్కొనేందుకు బహుముఖ నాయకత్వం అవసరం. మెరుగైన సమాజం నిర్మించడం కోసం మహిళల విభిన్న అనుభవాలు, నైపుణ్యాలు ఎంతో అవసరం. ఏది నాయకి? 2030 నాటికి ప్రపంచం సాధించాల్సిన సుస్థిర అభివృద్ధి లక్ష్యాలలో లింగ సమానత్వాన్ని ఐదో లక్ష్యంగా నిర్ణయించి, దీన్ని సాధించడంలో మహిళల సమాన భాగ స్వామ్య అవసరాన్ని ఐకరాజ్య సమితి నొక్కి చెప్పింది. కానీ వాస్తవాలు ఇందుకు పూర్తి భిన్నంగా ఉండి, లింగ సమానత్వ లక్ష్యాన్ని ఎప్పటికి సాధించగలమనే ప్రశ్నను రేకెత్తిస్తునాయి. ప్రపంచవ్యాప్తంగా నిర్ణయాలు తీసుకొనే అనేక స్థానాలలో మహిళల ప్రాతినిధ్యం చాలా తక్కువగా ఉంది. 1 సెప్టెంబర్ 2021 నాటికి కేవలం 24 దేశా లలో మాత్రమే మహిళలు దేశ, ప్రభుత్వ అధిపతు లుగా ఉన్నారు. దీని ప్రకారం, అత్యున్నత అధికార స్థానాల్లో లింగ సమానత్వం మరో 130 సంవ త్సరాల వరకు కూడా సాధించలేము. ప్రపంచంలోని మూడు వంతుల పార్లమెంటరీ స్థానాలను పురుషులు కలిగి ఉండటం రాజకీయాల్లో పురుషుల ఆధిపత్యాన్ని సూచిస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా మంత్రులుగా 21 శాతం మాత్రమే మహిళలు ఉన్నారు. మహిళా వ్యవహారాల శాఖలకే సాధార ణంగా మహిళలు పరిమితం కావాల్సి వస్తోంది. మహిళా నాయకత్వానికీ, సామాజిక సంక్షే మానికీ మధ్య ధనాత్మక సంబంధాన్ని అనేక అధ్య యనాలు తెలియజేస్తున్నాయి. భారత్‌లో మహిళల నేతృత్వంలో ఉన్న పంచాయతీ ప్రాంతాల్లో తాగు నీటి ప్రాజెక్టుల సంఖ్య పురుషుల నేతృత్వంలోని పంచాయితీల కంటే 62 శాతం అధికంగా ఉన్నదనీ, మున్సిపల్ కౌన్సిళ్లలో మహిళల ప్రాతినిధ్యానికీ, పిల్లల సంరక్షణకీ మధ్య ప్రత్యక్ష సంబంధం ఉన్న దనీ సర్వేలు చెపుతున్నాయి. 21వ శతాబ్దపు ఒక క్లిష్టమైన పోరాటం అందుబాటులో ఉన్న వనరులకూ, మానవ వైఖరు లకూ మధ్య జరుగుతుంది. వాతావరణ మార్పు, ఆరోగ్యం, పర్యావరణ క్షీణత, సామాజిక అసమా నతలు మొదలైన సమస్యలను ఎదుర్కొనేందుకు బహుముఖ నాయకత్వం అవసరం. మెరుగైన సమాజం నిర్మించడం కోసం తీసుకొనే నిర్ణయా లలో మహిళల విభిన్న అనుభవాలు, నైపుణ్యాలు ఎంతో అవసరం. మహిళలకు సాధికారత చేకూర్చడానికి లింగ బడ్జెట్‌ను చాలా దేశాలు ఒక మార్గంగా ఎన్ను కున్నాయి. ఐఎంఎఫ్ ప్రకారం, ప్రపంచంలో 80 దేశాలు లింగ బడ్జెట్ విధానాన్ని అనుసరిస్తు న్నాయి. భారతదేశం కూడా 2006 నుండి లింగ బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. మన లింగ బడ్జెట్లో సాధారణంగా రెండు రకాల పథకాలు గమనించ వచ్చు. మొదటిది, మహిళలను మాత్రమే లక్ష్యంగా చేసుకుని ఖర్చు చేసే పథకాలు: ఉదాహరణకు బేటీ బచావో, బేటీ పఢావో. రెండవది పాక్షికంగా మహిళ లను లక్ష్యంగా చేసుకుని ప్రవేశపెట్టినవి. ఇక్కడ పథక ప్రయోజనాలు కనీసం 30 శాతం మహిళలకు చేకూరుతాయి. అయితే రెండో కోవకు చెందిన పథ కాలే ఆధిపత్యంలో ఉంటున్నాయి. ఉదాహరణకు 2021 బడ్జెట్లో మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ బడ్జెట్ 16 శాతం పెరిగింది. కానీ ఈ మొత్తం బడ్జెట్లో 80 శాతం అంగన్ వాడీ, మిషన్ పోషణ్ 2.0 పథకాలకు కేటాయించడం జరిగింది. సమాన అవకాశాలను కల్పించగలిగే ప్రగతిశీల సమాజాన్ని నిర్మించడానికి నిర్ణయాత్మక స్థానాలలో మహిళల పాత్ర, ప్రాముఖ్యతలను గుర్తించడం కీలకం. మార్పు అనేది దానికదే స్వతంత్రంగా రాదు. సమాజంలో సమానత్వం సృష్టించే సద్గుణ చక్రాన్ని సాధించడానికి వ్యవస్థలు మారాలి. ఇప్పటివరకు ఈ ప్రపంచం ప్రధానంగా పురుషుల ఆలోచనలు, నాయకత్వంలో నడుస్తోంది. చారిత్రకంగా భౌతిక దారుఢ్యం, హేతుబద్ధత, ఆచరణాత్మకంగా ఉండడం వంటి వాటిని నాయకత్వ లక్షణాలుగా చూడడం వల్ల అనాదిగా పురుషులే నాయకత్వం స్థానాలలో కనిపిస్తున్నారు. నాయకత్వ నిర్వచనాన్ని మరింత బహుమితీయంగా మార్చి, నాయకత్వ లక్షణాలను విస్తృతం చేయాల్సిన సమయం ఆసన్నమైంది. మారుతున్న ఆర్థిక కార్యకలాపాలు, ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి శారీరక బలాల మీద కాకుండా నైపుణ్యాలపై ఆధారపడి ఉంది. సహజంగా మహిళలు వ్యూహాత్మక దృష్టితో ఆలోచించే విధానం సమాజ నిర్మాణం కోసం ఉపయోగపడుతుంది. మహిళలు నాయకత్వ బృందాలలో ఉన్నప్పుడు కరుణ వంటి లక్షణాలు నాయకత్వంలో భాగం అవుతున్నాయి. గణపతిరాజు పావనీ దేవి వ్యాసకర్త ఆర్థిక శాస్త్ర లెక్చరర్ పితృస్వామ్యమే ముద్దాయి స్త్రీ అనగానే కేవలం సౌందర్య భావనతో ప్రాచీన కవులు ఎన్నో కావ్యాలలో రకరకాలుగా వర్ణించారు. మహిళ అనే పదం ఈ మహిలో చాలా గొప్పది. ఒక మహిళను చూసే కళ్ళలో, మనసులో మార్పు వచ్చి తీరాలి. తనకు జన్మ నిచ్చిన స్త్రీ జాతిని గౌరవించకపోగా రక రకాలుగా అవమానించడం అమానుషం. క్షమించరాని నేరం. స్త్రీల దైన్యస్థితికి అతి ముఖ్యమైన కారణం పితృస్వామ్య వ్యవస్థ. నిజానికి ఆదిమ సమాజంలో మాతృస్వామ్యం ఉండేది. స్త్రీ కేంద్రంగా సమాజం నడిచేది. కాలక్రమంలో స్త్రీలు ఉత్పత్తి పరికరాలకు దూరమ వడం, పురుషులు వాటిపై ఆధి పత్యం చలాయించడం, బానిస వ్యవస్థ, గుంపు పెళ్లి నుండి దంపతీ వివాహానికి వివాహ వ్యవస్థ పరిణామం చెందడం, వ్యక్తిగత ఆస్తి భావన పెరగడం, ఆయుధాల మీద పురు షుల ఆధిపత్యం వంటి అనేక కారణాల వల్ల స్త్రీ వెనక్కి నెట్టివేతకు గురై క్రమంగా పురుషాధిక్యత పాదుకు పోయింది. ఈ సంవత్సరం ‘ఆవిష్కరణ, సాంకేతికతల్లో లింగ సమానత్వం’ అంశాన్ని థీమ్‌గా మహిళా దినోత్సవాన్ని జరుపుతున్నారు. ఇది ఆహ్వానించదగినది. ఎందుకంటే... ‘ఐకాస’, ‘ఉమెన్స్ జెండర్స్ స్నాప్ షాట్– 2022’ నివేదిక ప్రకారం డిజిటల్ ప్రపంచంలో మహిళలు లేకపోవడం వల్ల గత పదేళ్లలో తక్కువ, మధ్య ఆదాయ దేశాల స్థూల జాతీయ ఉత్పత్తి తగ్గింది. ఈ విషయంలో ఏమీ చేయలేక పోయినట్లయితే ఈ నష్టం 2025 నాటికి ఇంకా పెరుగుతుంది. స్త్రీలు విద్యావంతులు కానంత వరకూ ఏ దేశమూ బాగుపడదు. మన అభివృద్ధి అంతా స్త్రీల అభివృద్ధిపైనే ఆధారపడి ఉన్నది. అయితే పురుషులతో సమానంగా ఉద్యోగం చేస్తున్నా... భారతీయ సమాజంలో ఇంటి పని, వంట పని, పిల్లల పెంపకం స్త్రీ బాధ్యత కాబట్టి ఆమెపై ఒత్తిడి ఎక్కువగా ఉంటోంది. ఇలాంటి పరిస్థితుల్లోనూ అన్ని విధులనూ మహిళ అత్యంత చాకచక్యంగా నిర్వర్తిస్తోంది. స్వప్న కొండ వ్యాసకర్త తెలుగు ఉపాధ్యాయురాలు అపర కాళీమాత కూడా... స్త్రీ ప్రకృతికి ప్రతీక. అందానికే నిర్వచనం. ఇంటికి దీపం. అమృతాన్ని వర్షించే అమ్మగా, అనునయించే అక్కగా, అనురాగాన్ని పంచే చెల్లిగా, ఆత్మీయతను కురిపించే భార్యగా ఆమె ఒక కుటుంబానికి ఎంత సుపరిచితురాలో... ఒక టీచరుగా, డాక్టరుగా, పోలీస్ ఆఫీసరుగా, పైలెట్‌గా, రైతుగా, కూలీగా, ఇంటిపనులు చేసే మనిషిగా... ఇలా అన్ని హోదాలలో కూడా సమాజానికి అంతే సుపరిచితురాలు. భారతీయ సంస్కృతిలో స్త్రీలకు సముచిత స్థానాన్నే అందించారు. మనం నిత్యం ఆరాధించే ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపాలైన అమ్మవార్లు కూడా స్త్రీలే కదా. స్త్రీని ఒక దేవతలా చూడడం, ఆమెను జాగ్రత్తగా కాపాడుకోవడం అనేది అనాదిగా మన రక్తంలోనే జీర్ణించుకుపోయింది. అయితే నేడు ఈ జాగ్రత్తనే కొన్ని సందర్భాలలో అతియై ఆడపిల్లల స్వేచ్ఛకు ఆటంకంగా మారు తోంది. సమాజంలోని కొన్ని దుస్సంఘటనలకు వెరసి ఇంట్లోవాళ్ళు విధించే ఆంక్షలు ఆడపిల్లల అభివృద్ధికి అవరోధాలుగా పరిణమించడంతో పాటు, పిల్లలకూ తల్లిదండ్రులకూ మధ్య అగా థాలను సృష్టిస్తున్నాయి. ప్రతి పరిణామం ఇంటి నుండే మొద లవ్వాలి. ఆది గురువులై అమ్మలు మంచి చెడుల వివేచన జ్ఞానాన్ని తమ పిల్లలకు రంగరించి ఎటువంటి ఆటుపోట్లనైనా ఎదుర్కొనే ధైర్యాన్ని అలవరచాలి. భర్త అడుగుజాడల్లో నడిచిన సీతగా, అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన సావిత్రిగా, యుద్ధభూమిలో తోడు నిలిచిన సత్య భామగా, బుద్ధి కుశలతతో త్రిమూర్తులనే పసిబిడ్డలను చేసి లాలించిన అనసూయగా ఉంటూనే, అవసరమైతే ఇంతులు అపర కాళీ మాతలవ్వాలి. సమాజాభివృద్ధికి హేతువయ్యే ప్రతి పాత్రను సంపూర్ణంగా పండించాలి. – డా‘‘ బి. నీలిమా కృష్ణమూర్తి సహాయ కార్మిక అధికారి -
పాఠశాలవిద్యలో ‘స్కూల్ లీడర్షిప్’
టీచర్లకు నాయకత్వ లక్షణాలపై శిక్షణకు సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, టీచర్లలో నాయకత్వ లక్షణాలు పెంపొందించేందుకు స్కూల్ లీడర్ షిప్ అకాడమీని ఏర్పాటు చేయాలని పాఠశాల విద్యా శాఖ నిర్ణయించింది. రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎస్సీఈ ఆర్టీ) ఆధ్వర్యంలో త్వరలోనే ఈ అకాడమీ ని అందుబాటులోకి తెచ్చేందుకు కసరత్తు చేస్తోంది. శిక్షణ ఇచ్చేందుకు ప్రత్యేకంగా స్టేట్ రిసోర్స్ గ్రూపును ఏర్పాటు చేస్తోంది. అర్హులై న వారి నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోం ది. స్టేట్ రిసోర్సు గ్రూపులో చేరేందుకు ఈ నెల 17 లోగా అర్హులైన వారు ఈ మెయిల్ ( tgscert@gmail.com) ద్వారా దరఖాస్తు చేసుకోవాలని ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ ఎస్.జగన్నాథరెడ్డి వెల్లడించారు. ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చంటే... పాఠశాలల్లో పనిచేస్తున్న ప్రిన్సిపాళ్లు లేదా హెడ్ మాస్టర్లు, రిటైర్డ్ ప్రిన్సిపాళ్లు లేదా హెడ్ మాస్టర్లు, జిల్లా/బ్లాక్/క్లస్టర్ అధికా రులు, ఎస్సీఈఆర్టీ/ సీటీఈ/ ఐఏఎస్ఈ/ డైట్ సిబ్బంది, ఎన్జీవోలకు చెందిన రీసోర్సు పర్సన్లు, ఫ్రీలాన్సర్లు, ఎడ్యుకేషన్ శిక్షణలో సర్టిఫికెట్ పొందిన శిక్షకులు దరఖాస్తు చేసుకో వచ్చు. పాఠశాల విద్యలో విద్య, పాలన పరమైన అంశాల్లో అవగాహన కలిగిన వారై ఉండాలి. అలాంటి వారినే స్టేట్ రిసోర్సు గ్రూపులో సభ్యులుగా తీసుకుంటారు. ఆసక్తి ఉన్నవారు ఈ మెయిల్ ద్వారా ఈ నెల 17 లోగా దరఖాస్తు చేసుకోవాలి. పూర్తి వివరా లను ఎస్సీఈఆర్టీ వెబ్సైట్(scert. telangana. gov.in)లో పొందవచ్చు. -
బాబుకు నాయక త్వ లక్షణాలు లేవు: ఎర్రబెల్లి
యాదగిరికొండ: ఏపీ సీఎం చంద్రబాబుకు నాయకత్వ లక్షణాలు లేవని ఇటీవల టీఆర్ఎస్లో చేరిన టీడీపీ శాసనసభాపక్ష నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. శనివారం ఉదయం ఆయన యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో పూజలు నిర్వహించి విలేకరులతో మాట్లాడుతూ.. తెలంగాణలో టీడీపీ మునిగిపోయే నావ అని అన్నారు. ‘నా కేడర్‌ను కాపాడుకోవడానికి, పాలకుర్తి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవడానికే నేను టీఆర్ఎస్లో చేరాను’ అని పేర్కొన్నారు. మునిగే నావలో ఎంతో దూరం ప్రయాణం చేయలేరని, బాబు తెలంగాణలో ఎంతచేసినా టీడీపీని బతికించుకోలేరన్నారు. యాదాద్రిని టీడీపీ అధికారంలో ఉన్న పదేళ్లు పట్టించుకోలేదన్నారు. ప్రస్తుతం ఈ ఆలయం దేశంలోనే అగ్రగామిగా పేరు గడించిందని, దీనికి కారణం సీఎం కేసీఆరే’ అని ఎర్రబెల్లి అన్నారు. -
కేటీఆర్‌కు ట్వీట్ చేసి....
హైదరాబాద్ : రాజకీయ నాయకుడిగా ఎదగాలని ఇటీవలి కాలంలో చేస్తున్న రకరకాల ప్రయత్నాలేవీ ఫలితాలను ఇవ్వకపోవడంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కుమారుడు లోకేష్‌కు అంతుబట్టడం లేదు. ఇప్పుడేం చేయాలో అంతుబట్టక తర్జనభర్జన పడుతున్నారు. తన ఇమేజీ మరింత డ్యామేజీ కావడం ఆయనకు మింగుడుపడటం లేదు. కేసీఆర్ కుమారుడు కేటీఆర్ తరహాలో తన ఇమేజీని పెంచుకోవడానికి తెగ ప్రయత్నాలు చేస్తున్న లోకేష్ ఇటీవలి కాలంలో తన చుట్టూ సలహాదారులు, మీడియా మేనేజ్ మెంట్ టీం వంటి అనేక వ్యవస్థలను ఏర్పాటు చేసుకున్న విషయం తెలిసిందే. తన రాజకీయ వారసుడిగా ఎదగాలన్న కాంక్షతో చంద్రబాబు ఏడాది కాలంగా లోకేష్ కు అనేక బాధ్యతలను అప్పగించారు. అప్పటి నుంచి రాజకీయంగా ఎదగడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఫలితం ఇవ్వకపోవడంపై ఇప్పుడు పార్టీలో చర్చనీయాంశంగా మారింది. గ్రేటర్ ఎన్నికల్లో ఘోర పరాజయం లోకేష్ రాజకీయ కెరీర్ ను కూడా ప్రశ్నార్థకంగా మార్చింది. కేటీఆర్ స్థాయిలో తానూ ఎదగాలన్న ప్రయత్నాల్లో ఉన్న లోకేష్ ఇటీవలి గ్రేటర్ ఎన్నికల్లో ప్రచారం సందర్భంగా సభల్లో విమర్శల్లో ఏమాత్రం పస లేకపోవడం, హైదరాబాద్ నగరంపై అవగాహన లేకుండా చేశారన్న అభిప్రాయం పార్టీలో బలంగా వినిపిస్తోంది. లోకేష్ ను నాయకుడిగా అంగీకరించడానికి ప్రజలు సిద్ధంగా లేరన్న విషయం గ్రేటర్ ఎన్నికలతో తేలిపోయిందని నేతలు ఇప్పుడు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. గ్రేటర్ ఎన్నికల ప్రచారం సందర్భంగా మంత్రి కేటీఆర్ కు ట్విట్టర్ ద్వారా లోకేష్ సవాలు చేయడం కూడా నేతలు ఊదహరిస్తున్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కేటాయించడానికి సంబంధించి ఒక మహిళ తనను కలిసిన విషయాన్ని కేటీఆర్ కు ట్విటర్ లో పోస్టు చేశారు. దానికి వెంటనే కేటీఆర్ కౌంటర్ ఇవ్వడంతో లోకేష్ ఢీలా పడ్డారు. ఈ రకంగా రాజకీయ వ్యూహం లేకపోవడం, పసలేని విమర్శలు చేయడం ద్వారా మరింత నవ్వులపాలవుతున్నామని టీడీపీ నేతలు తలలు పట్టుకుంటున్నారు. వాటి నుంచి బయటపడకుండా మీడియాలో నిత్యం కనిపించడం కోసం ఆయన సలహాదారులు, ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడం ద్వారా ప్రయోజనం లేదని పార్టీ నేతలు రుసరుస లాడుతున్నారు. గ్రేటర్ ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాభవం ఇప్పుడు పార్టీ అసలుకే ఎసరు తెస్తోంది. నేతలెవరూ ఈ ఫలితాలపై మాట్లాడటానికి ముందుకు రావడం లేదు. ఫలితాలు వెల్లడైన రోజునే కాకుండా రెండో రోజు శనివారం కూడా నేతలెవరూ ఎన్టీఆర్ భవన్ వైపు కన్నెత్తి చూడలేదు. ఎన్నికలకు ముందు లోకేష్ వచ్చి ఏదో చేస్తారన్నట్టు బిల్డప్ ఇచ్చారనీ, తీరా ఫలితాలు చూస్తే ప్రజలు ఏమాత్రం ఆయనను స్వీకరించడానికి సిద్ధంగా లేరని తేలిపోయిందని గ్రేటర్ ఎన్నికలపై నియమించిన కమిటీ సభ్యుడొకరు నిర్వేదం వ్యక్తం చేశారు. రాజకీయ వారసుడి కోసం పసలేని నేతలను మాపై రుద్దతున్నారని మండిపడ్డారు. ఈ ఎన్నికల బాధ్యతను నెత్తినెత్తుకున్న లోకేష్ పార్టీలోని నేతలందరినీ ఎందుకు సమన్వయం చేయలేకపోయారని పార్టీలో చాలా మంది ప్రశ్నిస్తున్నారు. గ్రేటర్ ఫలితాలు వెల్లడైన తర్వాత ఈ ఎన్నికల్లో సమన్వయ బాధ్యతలను నెత్తినెత్తుకున్న నేతలెవరితోనూ లోకేష్ మాట్లాడలేదని తెలిసింది. ఓటమికి కారణాలను విశ్లేషించే పేరుతో నేతలను పిలిచి సమావేశం నిర్వహించాలని కొందరు సన్నిహితులు చెప్పడంతో సరేనన్న లోకేష్ శనివారం సాయంత్రం ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అయితే కొంత మంది నేతలు తమకు ఇతరత్రా పనులు ఉన్నాయంటూ సమావేశానికి రాలేమని తేల్చిచెప్పినట్టు పార్టీ వర్గాల సమాచారం. -
ప్రధానోపాధ్యాయులకు నాయకత్వ లక్షణాలు
శిక్షణనివ్వాలని విద్యాశాఖ నిర్ణయం సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ పాఠశాలల్లో పని చేసే ప్రధానోపాధ్యాయులకు నాయకత్వ లక్షణాలు, పాలన పరమైన అంశాలపై శిక్షణ ఇవ్వాలని విద్యా శాఖ నిర్ణయించింది. మూడు దశల్లో 15 రోజుల పాటు ఈ శిక్షణ ఇచ్చేందుకు చర్యలు చేపట్టింది. మొదటి దశలో 5 రోజుల శిక్షణను హైదరాబాద్‌లోని డాన్ బాస్కో స్కూల్లో ఈనెల 30 నుంచి వచ్చే నెల 3 వరకు శిక్షణనివ్వనుంది. ప్రతి జిల్లా నుంచి ఎంపికైన ప్రధానోపాధ్యాయులకు ఈ శిక్షణ ఇవ్వాలని నిర్ణయించింది. 5 నుంచి 9 వరకు రెండో దశ, 12 నుంచి 16 వరకు మూడో దశ శిక్షణ ఇస్తారు. -
ముగురమ్మలు
నాయకత్వ లక్షణాలకు అసలైన నిదర్శనం - డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి. ఆయనతో ఒక్క నిమిషం గడిపినా - దాన్ని ఎన్నో వందల నిమిషాల విలువగా మలిచేవారాయన. ఉత్తమనాయకుడు కొండెక్కి కూచోకూడదు, జనంతో మమేకమై పోవాలి. వైఎస్ చేసిందదే! అచ్చుగుద్దినట్లు ఆరణాల తెలుగువాడి వస్త్రధారణ వైఎస్‌ది. తేటతెలుగు నుడికారపు పలకరింపు ఆయన సొంతం. నిండుగా, పెదవులారా, నోరారా, కళ్లారా, కడుపారా, మనసారా నవ్వడం వైఎస్‌కే తెలుసు. సమకాలీన రాజకీయ నాయకుల్లో ఈ లక్షణం మచ్చుకైనా కనిపించదు. ఎంతటి విషమ పరిస్థితుల్లోనయినా మొహమంతా పరచుకొన్న ఆ చిర్నవ్వు చెక్కు చెదరదు. ఎంతటి షాకింగ్ న్యూస్ విన్నా - ధైర్యంగా నిబ్బరంగా నిలబడేవారాయన. కంగారు పడరు, తోటివారిని కంగారుపెట్టరు. సమయపాలనకు ప్రాణమిచ్చిన వ్యక్తి వైఎస్. క్రమశిక్షణకు చిరునామా ఆయన. ఉదయం నాలుగు గంటలకే లేవడం, గంటసేపు వ్యాయామం, ట్రెడ్‌మిల్‌పై వాకింగ్, పది నిమిషాల ధ్యానం - ఇదీ రోజుని ప్రారంభించే తీరు. ఎక్స్ర్సైజులు చేసేటప్పుడు కూడా పక్కన ఓ చిన్నపుస్తకం, పెన్ను ఉండాల్సిందే. కొత్త ఆలోచనని రాసేసుకోవాల్సిందే. ఎంత బిజీ ఉన్నా - కుటుంబంతో గడపడం ఆయనకు ఇష్టం. బయటి ఒత్తిళ్లను ఇంట్లో చూపేవారు కారాయన. కార్యక్రమాలు ఎన్ని ఉన్నా, రాజకీయ టెన్షన్లు ఎన్ని ఉన్నా - ఇంట్లోకి అడుగుపెట్టగానే అవన్నీ దూది పింజలైపోవాల్సిందే. మనసుపై గట్టిపట్టు ఉంటేనే ఇది సాధ్యం. ఏ విషయంలోనయినా సరే - ముందు తన మీద తాను పవర్ సాధించాలి. ఆపై ఇతరులపై పవర్ సాధించడం చిటికెలో సాధ్యం. స్త్రీని అమితంగా గౌరవించడం నాయకుడి లక్షణం. ‘‘నా జీవితాన్ని ముగ్గురు మహిళలు మలిచారు. మా అమ్మ జయమ్మ - నన్ను ధైర్యస్ధుణ్ని చేసింది. భార్య విజయమ్మ - కంటిపాపలా చూసుకొంది. కుమార్తె షర్మిలమ్మ - వెలుగులు నింపింది’’ అని చెప్పేవారాయన. ఇలాంటి అనేక నాయకత్వ లక్షణాలు వైఎస్‌కి రాత్రికి రాత్రి రాలేదు. శిల నుంచి సమస్యల ఉలిదెబ్బలతో రాటు తేలితే వచ్చాయి. కాలంతో పాటు, వయసుతో పాటు, అనుభవంతో పాటు తనను తాను మలచుకొన్న వ్యక్తిత్వం ఆయనది. ఇవ్వాళ ప్రపంచానికి అతి పెద్ద సమస్య - నాయకుల్లేకపోవడం. ప్రజల్ని ప్రేమించగల, జనాన్ని నడిపించగల, కోట్లాది మందిని కలగలుపుకొని పోగలవాడే అచ్చమైన నాయకుడు. అందుకు సిసలైన నిర్వచనం - వైఎస్ఆర్. - ఆకెళ్ల రాఘవేంద్ర ‘దటీజ్ వైఎస్ఆర్’ గ్రంథ రచయిత -
లోకేష్ నాయకత్వ లక్షణాలు అలవర్చుకోవాలి: కేఈ
లోకేష్ నాయకత్వ లక్షణాలను అలవర్చుకోవాలని ఏపీ ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి అన్నారు. ప్రస్తుతం ఆయన నిర్వహిస్తున్న యాత్రకు మంచి స్పందన వస్తోందని తెలిపారు. అందుకే తెలుగుదేశం పార్టీలో లోకేష్‌కు మంచి స్థానం కల్పించాలని కేఈ కోరారు. ఇక భోగాపురంలో ఎయిర్‌పోర్టుకు భూసేకరణపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కేఈ చెప్పారు. భూసేకరణ చట్టానికి పార్లమెంటులో తుదిరూపు వచ్చిన తర్వాతే దానిపై నిర్ణయం తీసుకుంటామన్నారు. రెవెన్యూ అధికారులు అసలు గ్రామాల్లోకి వెళ్లడం లేదని, రెవెన్యూ శాఖలో త్వరలోనే సంస్కరణలు చేపడతామని చెప్పారు. ఎమ్మార్వో, వీఆర్వోలను సొంత రెవెన్యూ డివిజన్లలో ఉండనిచ్చేది లేదని స్పష్టం చేశారు. రాజధానిలో కూడా గ్రామకంఠాల వివాదాలు ఉన్నాయని, బీపీఎల్ కేటగిరీకి చెందినవారి ఆధీనంలో ఉన్న గ్రామకంఠాలపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కేఈ చెప్పారు. మిగిలిన వాళ్ల ఆధీనంలో ఉన్న భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని ఆయన వివరించారు. -
నాయకత్వ లక్షణాలను అలవర్చుకోవాలి
‘సాక్షి యువ మైత్రి’లో వేణు బంజారాహిల్స్: ఉన్నత శిఖరాలకు చేరుకోవడానికి మంచి నాయకత్వ లక్షణాలు ప్రధానంగా దోహదం చేస్తాయని వ్యక్తిత్వ వికాస నిపుణులు వేణు భగవాన్ చెప్పారు. ‘సాక్షి యువ మైత్రి’ కార్యక్రమంలో భాగంగా బంజారాహిల్స్ రోడ్ నెం. 7లోని మెరిడియన్ స్కూల్లో శుక్రవారం విద్యార్థులకు నాయకత్వ లక్షణాలు-వ్యక్తిత్వ వికాసాభివృద్ధి అన్న అంశంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన వేణు మాట్లాడుతూ పెద్ద సంస్థలో ఉద్యోగం పొందినప్పుడు అక్కడ నా యకత్వ లక్షణాలు ప్రదర్శించాలని అవసరం ఉంటుందని విద్యార్థులకు సూ చించారు. ఏ రంగంలో ఆసక్తి ఉందో అటువైపు అడుగులు వేస్తేనే భవిష్యత్ ఉజ్వలంగా ఉంటుందన్నారు. చిన్నారుల్లో ఉన్న ప్రతిభను గుర్తించి, ప్రోత్సహించాల్సిన బాధ్యత తల్లిదండ్రులు, ఉపాధ్యాయులపైన ఉందని పేర్కొన్నారు. -
సీమలో పీఆర్పీ నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే శోభ
శోభా నాగిరెడ్డి... మంచి నాయకత్వ లక్షణాలున్న మహిళ. ఆమెకు భర్త, ముగ్గురు పిల్లలు ఉన్నారు. తెలుగుదేశం పార్టీతో రాజకీయ ఆరంగేట్రం చేసిన ఆమె.. ఆ తర్వాత సినీనటుడు చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించినప్పుడు భూమా దంపతులు ఆ పార్టీలో చేరారు. భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డి ఇద్దరూ పీఆర్పీలో చేరారు. భారీ అంచనాలు ఉన్నా కూడా పీఆర్పీ పెద్దగా ఫలితాలు సాధించలేకపోయిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో ఉన్న మొత్తం 294 అసెంబ్లీ నియోజకవర్గాలకు పోటీచేసినా.. కేవలం 18 స్థానాలను మాత్రమే గెలుచుకుంది. అందులోనూ రాయలసీమలో ఆ పార్టీకి ఒకే ఒక్క స్థానం లభించింది. ఆ ఒక్క స్థానంలో గెలిచిన ధీరవనిత.. శోభా నాగిరెడ్డి. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నుంచి పీఆర్పీ తరఫున పోటీ చేసిన శోభా నాగిరెడ్డి 61,555 ఓట్లు సాధించి.. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి గంగుల ప్రతాపరెడ్డిపై 1958 ఓట్ల మెజారిటీతో నెగ్గారు. టీడీపీ అభ్యర్థి ఎరిగెల రామపుల్లారెడ్డికి ఆ ఎన్నికల్లో కేవలం 23800 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఇక ఆ పార్టీకి రాజీనామా చేసి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత ఆళ్లగడ్డ ఉప ఎన్నికల్లో ఆమెను ఓడించడానికి ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులు కూడా రంగంలోకి దిగి మరీ ఓటర్లను బెదిరించారు. శోభా నాగిరెడ్డికి ఓటేస్తే ఒక్క అభివృద్ధి కార్యక్రమానికి కూడా నిధులు రావన్నారు. అయినా కూడా ఆమె దాదాపు 37 వేల ఓట్ల మెజారిటీతో నెగ్గారు. ఆ ఎన్నికల్లో శోభా నాగిరెడ్డికి 88,697 ఓట్లు రాగా, సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి గంగుల ప్రతాపరెడ్డికి 51,902 ఓట్లు వచ్చాయి. టీడీపీ అభ్యర్థి ఎరిగెల రామపుల్లారెడ్డికి ఆ ఎన్నికల్లో 20,374 ఓట్లు మాత్రమే వచ్చాయి. -
మహిళలకు నాయకత్వ లక్షణాలు అవసరం
మాదాపూర్, న్యూస్‌లైన్: మహిళలు పారిశ్రామిక రంగంలో రాణించాలంటే ప్రతి ఒక్కరూ నాయకత్వ లక్షణాలు కలిగి ఉండాలని కెనైటిక్ ఇంజినీరింగ్ లిమిటెడ్ వైస్ చైర్మన్ సులజ్జ చిరోబియా మోత్వానీ పేర్కొన్నారు. సోమవారం మాదాపూర్‌లోని ఓ హోటల్లో ఫిక్కీ మహిళా ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ‘లీడర్షిప్ ఇన్ ఉమెన్’ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆమె మాట్లాడుతూ.. మహిళా పారిశ్రామికవేత్తల సాధికారత కోసం ఏర్పాటు చేసిన సంస్థ వారికి పలు సలహాలు, సూచనలు అందిస్తుందన్నారు. ఫిక్కీ మహిళా ఆర్గనైజేషన్ చైర్మన్ జోత్స్నా అంగారా మాట్లాడుతూ మహిళలకు కావాల్సిన నాయకత్వ లక్షణాలు, పారిశ్రామిక రంగాల్లో ముందుకు దూసుకువెళ్లడానికి అవసరమైన సూచనలు అందిస్తామన్నారు.