టీచర్లకు నాయకత్వ లక్షణాలపై శిక్షణకు
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, టీచర్లలో నాయకత్వ లక్షణాలు పెంపొందించేందుకు స్కూల్ లీడర్ షిప్ అకాడమీని ఏర్పాటు చేయాలని పాఠశాల విద్యా శాఖ నిర్ణయించింది. రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎస్‌సీఈ ఆర్‌టీ) ఆధ్వర్యంలో త్వరలోనే ఈ అకాడమీ ని అందుబాటులోకి తెచ్చేందుకు కసరత్తు చేస్తోంది. శిక్షణ ఇచ్చేందుకు ప్రత్యేకంగా స్టేట్ రిసోర్స్ గ్రూపును ఏర్పాటు చేస్తోంది. అర్హులై న వారి నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోం ది. స్టేట్ రిసోర్సు గ్రూపులో చేరేందుకు ఈ నెల 17 లోగా అర్హులైన వారు ఈ మెయిల్ ( tgscert@gmail.com) ద్వారా దరఖాస్తు చేసుకోవాలని ఎస్‌సీఈఆర్‌టీ డైరెక్టర్ ఎస్.జగన్నాథరెడ్డి వెల్లడించారు.
ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చంటే...
పాఠశాలల్లో పనిచేస్తున్న ప్రిన్సిపాళ్లు లేదా హెడ్ మాస్టర్లు, రిటైర్డ్ ప్రిన్సిపాళ్లు లేదా హెడ్ మాస్టర్లు, జిల్లా/బ్లాక్/క్లస్టర్ అధికా రులు, ఎస్‌సీఈఆర్‌టీ/ సీటీఈ/ ఐఏఎస్‌ఈ/ డైట్ సిబ్బంది, ఎన్‌జీవోలకు చెందిన రీసోర్సు పర్సన్లు, ఫ్రీలాన్సర్లు, ఎడ్యుకేషన్ శిక్షణలో సర్టిఫికెట్ పొందిన శిక్షకులు దరఖాస్తు చేసుకో వచ్చు. పాఠశాల విద్యలో విద్య, పాలన పరమైన అంశాల్లో అవగాహన కలిగిన వారై ఉండాలి. అలాంటి వారినే స్టేట్ రిసోర్సు గ్రూపులో సభ్యులుగా తీసుకుంటారు. ఆసక్తి ఉన్నవారు ఈ మెయిల్ ద్వారా ఈ నెల 17 లోగా దరఖాస్తు చేసుకోవాలి. పూర్తి వివరా లను ఎస్‌సీఈఆర్‌టీ వెబ్‌సైట్(scert. telangana. gov.in)లో పొందవచ్చు.
పాఠశాలవిద్యలో ‘స్కూల్ లీడర్‌షిప్’
Published Sat, Jan 7 2017 2:23 AM | Last Updated on Sat, Sep 15 2018 5:14 PM
Advertisement
Advertisement