నాయకత్వ లక్షణాలను అలవర్చుకోవాలి
‘సాక్షి యువ మైత్రి’లో వేణు
బంజారాహిల్స్: ఉన్నత శిఖరాలకు చేరుకోవడానికి మంచి నాయకత్వ లక్షణాలు ప్రధానంగా దోహదం చేస్తాయని వ్యక్తిత్వ వికాస నిపుణులు వేణు భగవాన్ చెప్పారు. ‘సాక్షి యువ మైత్రి’ కార్యక్రమంలో భాగంగా బంజారాహిల్స్ రోడ్ నెం. 7లోని మెరిడియన్ స్కూల్‌లో శుక్రవారం విద్యార్థులకు నాయకత్వ లక్షణాలు-వ్యక్తిత్వ వికాసాభివృద్ధి అన్న అంశంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన వేణు మాట్లాడుతూ పెద్ద సంస్థలో ఉద్యోగం పొందినప్పుడు అక్కడ నా యకత్వ లక్షణాలు ప్రదర్శించాలని అవసరం ఉంటుందని విద్యార్థులకు సూ చించారు. ఏ రంగంలో ఆసక్తి ఉందో అటువైపు అడుగులు వేస్తేనే భవిష్యత్ ఉజ్వలంగా ఉంటుందన్నారు. చిన్నారుల్లో ఉన్న ప్రతిభను గుర్తించి, ప్రోత్సహించాల్సిన బాధ్యత తల్లిదండ్రులు, ఉపాధ్యాయులపైన ఉందని పేర్కొన్నారు.